బేతుల్ జిల్లా

మధ్య ప్రదేశ్ లోని జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో బేతుల్ జిల్లా (హిందీ:) ఒకటి. బేతుల్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. బేతుల్ జిల్లా నర్మదాపురం డివిజన్‌లో భాగం.

బేతుల్ జిల్లా
बैतूल जिला
మధ్య ప్రదేశ్ పటంలో బేతుల్ జిల్లా స్థానం
మధ్య ప్రదేశ్ పటంలో బేతుల్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనునర్మదాపురం
ముఖ్య పట్టణంబేతుల్
Government
 • లోకసభ నియోజకవర్గాలుబేతుల్
Area
 • మొత్తం10,043 km2 (3,878 sq mi)
Population
 (2011)
 • మొత్తం15,75,247 (provisional)[1]
జనాభా వివరాలు
 • అక్షరాస్యత70.1%[2]
 • లింగ నిష్పత్తి970[1]
ప్రధాన రహదార్లుజాతీయ రహదారి 69
Websiteఅధికారిక జాలస్థలి
బేతుల్ జిల్లాలో సాత్పురా శ్రేణి

2001 లో గణాంకాలు మార్చు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 15,82,793,[3]
ఇది దాదాపు. గబాహో దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. ఇదాహో నగర జనసంఖ్యకు సమం..[5]
640 భారతదేశ జిల్లాలలో. 314వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 466 .[3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 6.85%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 862:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 85.4%.[3]
జాతియ సరాసరి (72%) కంటే.
జిల్లా వైశాల్యం 10043 km2.[6]

ప్రజలు మార్చు

జిల్లాలో ఆదివాసి ప్రజలు అధికంగా ఉన్నారు. 2001 గణాంకాల ప్రకారం జిల్లాలోని గిరిజనుల సంఖ్య 5,49,907. వీరిలో గోండి, కొర్కు తెగలకు చెందిన ప్రజలు అధికంగా ఉన్నారు. మిగిలిన వారిలో మరాఠీలు అధికంగా ఉన్నారు. వీరిలో క్షత్రియులు, కుంబీలు, మాలీ, బ్రాహ్మణులు, పాటిల్, భోయర్లు, చమర్లు, సోనీ ప్రజలు అధికంగా ఉన్నారు. [7]

రైలు మార్గం మార్చు

బెతుల్ రైల్వేస్టేషను భోపాల్ - నాగ్పూర్ స్టేషనుల మద్య ఉంది.

విభాగాలు మార్చు

జిల్లా 8 తాలూకాలుగా విభజించబడింది:- భైంస్దేహి, అథనర్, చించొలి, బెతుల్, షాహ్పూర్, ముల్తై, ఘొదడొంగరి, అమ్ల.

భౌగోళికం మార్చు

జిల్లా సముద్రమట్టానికి 2000 అడుగుల ఎత్తున ఉంది. భౌగోళికంగా జిల్లా 3 భాగాలుగా విభజించబడి ఉంది. ఉత్తర భాగంలో ఎగుడుదిగుడు ఇసుకరాతి భూమి ఉంది. ఇక్కడ చెట్లు విస్తారంగా ఉన్నాయి. ఇది జనసాంధ్రత తాకువగా స్వల్పమైన వ్యవసాయ భూములు కలిగి ఉంది. ఉత్తర సరిహద్దులో పర్వతశ్రేణి ఉంది. మద్యభాగం సారవంతమైన వ్యవసాయ భూములు ఉన్నాయి. ఇక్కడ మచ్నా నది జలాలు, సరన్ ఆనకట్ట ద్వారా వ్యవసాయభూములకు పుష్కలంగా నీరు అందుతుంది. అక్కడక్కడా గ్రామాలు ఉన్నాయి. దక్షిణంలో బసలిక్ ఫార్మేషన్ మైదానాలు ఉన్నాయి. ఇందులో ముల్‌తై పట్టణం ఉంది.[8]

వాతావరణం మార్చు

The climate of Betul is fairly healthy. Its height above the plains and the neighbourhood of extensive forests moderate the heat, and render the temperature pleasant throughout the greater part of the year. During the cold season the thermometer at night falls below the freezing point; little or no hot wind is felt before the end of April, and even then it ceases after sunset. The nights in the hot season are comparatively cool and pleasant. During the monsoon the climate is very damp, and at times even cold and raw, thick clouds and mist enveloping the sky for many days together. The average annual rainfall is 40 in.[8]

వృక్షజాలం, జంతుజాలం మార్చు

బేతుల్ జిల్లా అరణ్యసంపదతో విలసిల్లుతుంది. బేతుల్ అరణ్యాలలో టేకు పుష్కలంగా లభ్యం ఔతుంది. బేతుల్ అడవులలో హల్దు, సజ, ధయోడా మొదలైన చెట్లు అధికంగా ఉన్నాయి. బేతుల్ అడవులలో ఔషధ మొక్కలు అధికంగా ఉన్నాయి. తెండు ఆకులు, చొరొంజి ఆకులు, హర్రా, ఉసిరి వంటి ఆటవిక ఉత్పత్తులు ప్రజలకు ఆర్థికంగా ఉపకరిస్తున్నాయి. బేతుల్ లో ఆసియాలో అతి పెద్దదైన వుడ్ డిపోట్ ఉంది.

నదులు మార్చు

జిల్లాలో ప్రధానంగా గంజల్ నది (తపతి ఉపనది) మొరంద్, తవా (నర్మదానది ఉపనదులు) ప్రవహిస్తున్నాయి.

చరిత్ర మార్చు

ఖెర్లా సామ్రాజ్యానికి చెందిన దేవ్‌గర్, గర్హ-మంద, చంద-సిర్పూర్ రాజ్యాలకు (గోండ్ రాజులు) బేతుల్ ప్రాంతానికి సంబంధం ఉంది. పర్షియన్ చరిత్రకారుడు పెరిష్టా వివరణా చిత్రంలో 1398లో ఈ ప్రాంతం కనిపించింది. ఆ చిత్రంలో గోండ్వానా పర్వతాలు దానిని ఆనుకున్న రాజ్యాలు ఉన్నాయి. ఇక్కడ గొప్ప సంపద, శక్తి కేంద్రీకరించి ఉందని భావిస్తున్నారు. 1418లో మాల్వా సుల్తాన్ హోషంగ్ షా ఖెర్లా మీద దాడి చేసి ఈ ప్రాంతాన్ని తన సామంతరాజ్యం చేసుకున్నాడు. 9 సంవత్సరాల తరువాత రాజు తిరుగుబాటు చేసాడు. అయినప్పటికీ బహమనీ సుల్తానుల సహాయంతో కొంతకాలం స్వతంత్రంగా వ్యవహరించాడు. చివరికి లొంగిపోయి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. 1467లో ఖెర్ల బహమనీ సుల్తానుల వశం అయింది. తరువాత అది మాల్వా రాజుల వశం అయింది. ఒక శతాబ్దం తరువాత మాల్వా సామ్రాజ్యాన్ని ఢిల్లీ సుల్తానులు వశపరచుకున్నారు. 1703లో గోండు నుండి ముస్లిం మతానికి మారిన ముస్లిం ఈ ప్రాంతానికి పాలకుడయ్యాడు. 1743 లో బేరర్ సామ్రాజ్యానికి చెందిన మరాఠీ పాలకుడు రఘోజీ భోంస్లె ఈ ప్రాంతాన్ని తన రాజ్యంతో విలీనం చేసుకున్నాడు. [8]

మరాఠీలు మార్చు

1818లో మరాఠీలు ఈ జిల్లాను ఈస్టిండియా కంపెనీకి స్వాధీనం చేసారు. 1826లో ఈ ప్రాంతాన్ని పూర్తిగా బ్రిటిష్ ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంది.[8] 1861లో సెంట్రల్ ప్రావిన్సెస్ రూపొందించిన తరువాత ఈ ప్రాంతం సౌగర్, నెర్బుద్దా భాగం అయింది. తరువాత బేతుల్ జిల్లా సెంట్రల్ ప్రొవింస్, బేరర్ లోని నెర్బుద్దా డివిజన్‌లో భాగం అయింది.[9]

బ్రిటిష్ మార్చు

1862లో 4 భాగాలుగా విభజించబడిన బ్రిటిష్ సైన్యాలలో 4 వ భాగం బేతుల్ వద్ద ఉన్నారు. విధ్వంసం చేయబడిన ఖెర్లా గోండుల రాజధానిగా మారింది. తరువాత ఈ భూభాగం బ్రిటిషు రాజ్యంలో విలీనం అయ్యే వరకు ఖేర్లా సర్కారు పేరుతో గోండురాజుల పాలనలో ఉంది. ముల్‌తై పట్టణంలో కృత్రిమంగా నిర్మించబడిన చెరువు నుండి తపతి నది జన్మించిందని భావిస్తున్నారు. తపతి నదిని ఆరాధిస్తూ ఇక్కడ పలు ఆలయాలు వెలిసాయి.[8]

కరువు మార్చు

1896-1897 లో మద్య ఈ ప్రాంతం కరువు బారిన పడింది. 1897 మరణాల శాతం 70:1000 కి చేరుకుంది. 1900 నాటికి జనసంఖ్యలో 3 వ భాగం వలస పోయారు. 1901 జనసంఖ్య 285,363. ముందున్న జనసంఖ్యలో 12% శాతం క్షీణించింది. 1901 బేతుల్ పట్టణం జనసంఖ్య 4,739. జిల్లా కేంద్రం బేతుళ, మధ్యప్రదేశ్ ( బదనూర్‌కు) పట్టణానికి మార్చబడింది. ఇది బేతుల్ పట్టణానికి 3 మైళ్ళు ఉత్తరాన ఉంది. 20 వ శతాబ్దం ఆరంభంలో జిల్లాలో ప్రధానంగా గోధుమ, మిల్లెట్, ఇతర ధాన్యాలు, పప్పుధాన్యాలు, స్వల్పంగా చెరకు, పత్తి పండించబడ్డాయి.[8]

గణాంకాలు మార్చు

http://betul.nic.in/stat.htm statics

జిల్లాలో 10043 చ.కి.మీ వైశాల్యం
జిల్లా జనసంఖ్య (2011) 15,75,247 (మధ్యప్రదేశ్ 2.2%)
పురుష జనాభా 7,99,721
స్త్రీ జనాభా 7,75,252
గ్రామీణ జనాభా (2001) 11,36,056
అర్బన్ జనాభా (2001) 2,59,119
షెడ్యూల్ ట్రైబ్ (2001) 5,49,907
షెడ్యూల్డ్ పురుషులు 2,75,793
షెడ్యూల్డ్ స్త్రీలు 2,74,114
షెడ్యూల్ కులాలు (2001) 1,47,604
షెడ్యూల్ కులాల పురుషులు 75.789
షెడ్యూల్ కులాల స్త్రీలు 71.815
జనసంఖ్య 138 చ.కి.మీకు సాంద్రత.
అభివృద్ధి. 18.2%
అక్షరాస్యత రేటు 66,87%
పురుష అక్షరాస్యత రేటు 77,31%
స్త్రీ అక్షరాస్యత రేటు 56,05%
సబ్ డివిజన్లు 3
తాలూకాలు 7
బ్లాక్స్ 10
గ్రామ పంచాయితీలు 556
గ్రామాలు 1341
జిల్లాలో 1 బేతుల్ తాలుకా 2. ముల్తై . 3.బైంస్ 4.‌దేహి. 5. షహపూర్. 6.అమ్ల. 7.అథ్నర్
అభివృద్ధి విభాగములు 1.బెతుల్ . 2. షహపూర్ . 3. ఘొర దొంగ్రి . 4.చిచొలి . 5. భీంపూర్. 6. భైంస్‌దేహి . 7.అథ్నర్ . 8.అం ల . 9.ముల్తై . 10.ప్రభాత్ పట్టణం .
10. (పైన అదే) చైల్డ్ డెవలప్మెంట్ బ్లాక్స్ ఇంటిగ్రేట్
జంపద్ పంచాయత్ 10. (పైన అదే)
నగర్ పాలిక 1. బెతుల్. 2. సరానీ. 3. అమల.
నగర్ పంచాయతీ 1. ముల్తై . 2.భైంస్‌దేహి . 3.బెతుల్ బజార్
పార్లమెంటరీ సీట్లు 1
శాసనసభ సీట్లు 5

ఆర్ధికం మార్చు

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో బేతుల్ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[10] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[10]

ఆకర్షణలు మార్చు

బేతుల్ జిల్లాలో రొంధ అతిపురాతన గ్రామం. ఇక్కడ రాతితో చెక్కబడిన నందివిగ్రహం ఉంది. గ్రామంలో 100 సంవత్సరాల కంటే అధికమైన చంపక వృక్షాలు ఉన్నాయి. ఈ గ్రామంలో సంత్ తుకాడోజీ, సర్వోదయా నాయకుడు వినోభాభావే స్థస్థలం. ఇక్కడ చంపకవృక్షాలు, గైంట్ ఫికస్, చాట్ మంత్, అనేక మంది గోండి ప్రజలు పాల్గొనే గోండి జాతర ప్రధాన పర్యాటక ఆకర్షణగా ఉన్నాయి. హిందీ పాత్రికేయుడు స్నత్బ్ రాంకిషోర్ పవార్ స్వస్థలం.

 
Balajipuram temple

బాలాజీపురం మార్చు

  • బలాజీపురం ఆలయం :- ఇది బేతిల్ నగరానికి 8 కి.మీ దూరంలో ఉంది. బేతుల్‌లో ఆధ్యాత్మికత, అందమైన విహార ప్రదేశంగా ఇది ప్రత్యేకత కలిగి ఉంది. ఇక్కడకు ప్రజలు భక్తిశ్రద్ధలతో వచ్చి దేవుని సేవించుకుంటారు.
  • రుక్మిణీ బాలాజీ ఆలయం :- బేతుల్ జిల్లాలోని బేతుల్ బజార్ వద్ద ఉంది. ఇది బాలాజీ ఆలయం. ఈ ఆలయం కారణంగా ఈ పట్టణానికి బాలాజీపురం అనే పేరువచ్చింది.

ఈ ఆలయాన్ని దక్షిణభారతీయులు నిర్మించారు. ప్రఖ్యాతి చెందిన దక్షుణభారతీయ శిల్పులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో గణేశా, రాధా కృష్ణా, దుర్గా, శివునికి ఉపాలయాలు ఉన్నాయి. ప్రధాన దైవం లక్ష్మీనారాయణులు. ఆలయం వెలుపల హనుమాన్ నవగ్రహ, సిరిడీ సాయిబాబా ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ఆలయాన్ని ఆనుకుని గంగాకుండ్ పేరిట ఒక కోనేరు ఉంది. ఇందులో 10 ఫౌంటెన్లు ఉన్నాయి. పాంథర్ ముఖం నుండి లోపలికి వెళ్ళి సందర్శించేలా ఈ ఆలయం నిర్మించబడింది. 2001 లో నిర్మించబడిన ఈ ఆలయ ట్రస్ట్ భక్తులకు తాత్కాలిక బస వంటి వసతి సౌకర్యం కల్పిస్తారు. రైల్వే స్టేషను నుండి ఆలయం వరకు ఉచిత బసు వసతి ఉంది. .

 
Enchanting Lord Krishna's statue at Mandir

కుజు మార్చు

బేతుల్ జిల్లాలోని కురు భైంస్దేహి తాలూకాలోని గ్రామాలలో కురి ఒకటి. ఇది నర్మదాపురం మడలంలో ఉంది. జిల్లా కేంద్రం బేతుల్ నుండి ఇది 46కి.మీ దూరం ఉంది. ఇక్కడ " ది నర్మదా హైడ్రాలిక్ పవర్ డెవెలెప్మెంటు కార్పొరేషన్ " ఉంది. ఈ గ్రామంలో 100 మె.వా విద్యుత్తును ఉత్పత్తి చేయగల పవన విద్యుత్తు యూనిట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Distribution of population, sex ratio, density and decadal growth rate of population – State and District: 2011". Office of The Registrar General & Census Commissioner, Government of India. Retrieved 19 July 2011.
  2. "Total Population, child population in the age group 0–6,literates and literacy rates by sex: 2011". Office of The Registrar General & Census Commissioner, Government of India. Retrieved 19 July 2011.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 సెప్టెంబరు 2011. Retrieved 1 October 2011. Gabon 1,576,665
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 30 September 2011. Idaho 1,567,582
  6. "Betul District – Statistics". Collectorate, Betul, Madhya Pradesh. Retrieved 20 July 2011.
  7. "History". betul.nic.in.
  8. 8.0 8.1 8.2 8.3 8.4 8.5   One or more of the preceding sentences incorporates text from a publication now in the public domainChisholm, Hugh, ed. (1911). "Betul". ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్). Vol. 3 (11th ed.). Cambridge University Press. p. 833.
  9. Hunter, William Wilson, Sir, et al. (1908). Imperial Gazetteer of India, Volume 6. 1908-1931; Clarendon Press, Oxford
  10. 10.0 10.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 5 ఏప్రిల్ 2012. Retrieved 27 September 2011.