బేరియం కార్బొనేట్ ఒక రసాయన సమ్మేళన పదార్థం.ఇది ఒక ఆకర్బన సమ్మేళనం.ఈ సంయోగ పదార్థాన్ని విథేరైట్(witherite)అనికూడా పిలుస్తారు.దీనిని ఎలుకల సంహారక మందుగా వాడెదరు.ఈ సమ్మెళనపదార్థం బేరియం,కార్బన్, ఆక్సిజన్మూలకాల సంయోగం /సమ్మేళనం వలన ఏర్పడును.

బేరియం కార్బొనేట్
Skeletal formula of barium carbonate
Powder of barium carbonate
పేర్లు
ఇతర పేర్లు
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [513-77-9]
పబ్ కెమ్ 10563
యూరోపియన్ కమిషన్ సంఖ్య 208-167-3
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య CQ8600000
SMILES [Ba+2].[O-]C([O-])=O
ధర్మములు
CBaO3
మోలార్ ద్రవ్యరాశి 197.34 g·mol−1
స్వరూపం white crystals
వాసన odorless
సాంద్రత 4.286 g/cm3
ద్రవీభవన స్థానం 811 °C (1,492 °F; 1,084 K)
polymorphic transformation
బాష్పీభవన స్థానం 1,450 °C (2,640 °F; 1,720 K)
decomposes[1] from 1360 °C
16 mg/L (8.8°C)
22 mg/L (18 °C)
24 mg/L (20 °C)
24 mg/L (24.2 °C)
Solubility product, Ksp 2.58·10−9
ద్రావణీయత decomposes in acid
insoluble in ethanol
వక్రీభవన గుణకం (nD) 1.676
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
-1219 kJ/mol[2]
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
112 J/mol·K[2]
విశిష్టోష్ణ సామర్థ్యం, C 85.35 J/mol·K
ప్రమాదాలు
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు The exclamation-mark pictogram in the Globally Harmonized System of Classification and Labelling of Chemicals (GHS)[3]
జి.హెచ్.ఎస్.సంకేత పదం Warning
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు H302[3]
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు R22
S-పదబంధాలు (S2), S24/25
జ్వలన స్థానం {{{value}}}
Lethal dose or concentration (LD, LC):
418 mg/kg, oral (rat)
సంబంధిత సమ్మేళనాలు
ఇతర కాటయాన్లు
Magnesium carbonate
Calcium carbonate
Strontium carbonate
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is ☑Y☒N ?)
Infobox references

బేరియం కార్బొనేట్ భౌతిక ధర్మాలుసవరించు

బేరియం కార్బొనేట్ తెల్లని స్పటిక ఘనపదార్థం. బేరియం కార్బొనేట్ వాసన లేనటువంటి సంయోగ పదార్థం. బేరియం కార్బొనేట్ సంయోగ పదార్థం యొక్క అణుభారం 197.34 గ్రాములు/మోల్. బేరియం కార్బొనేట్ యొక్క సాంద్రత 4.286 గ్రాములు/సెం.మీ3.బేరియం కార్బొనేట్ పదార్థం యొక్క ద్రవీభవన స్థానం 811 °C (1,492 °F; 1,084K). బాష్పీభావన స్థానం1,450 °C (2,640 °F;1,720K),అయితే 1360 °C వద్ద ఈ సమ్మేళన పదార్థం వియోగం చెందటం మొదలగును.బేరియం కార్బొనేట్ నీటిలో కరుగుతుంది.నీటిఉష్ణోగ్రత పెరిగే కొలది,నీటిలో ఈ సమ్మెళన పదార్థం కరుగు ద్రావణీయత పెరుగుతుంది.ఇథనాల్‌లో కరుగదు.ఆమ్లాలలో వియోగం పొందును.బేరియం కార్బొనేట్ యొక్క వక్రీభవనసూచిక 1.676.విశిష్ణ ఉష్ణ సామర్ధ్యం 85.35జౌల్స్/మోల్-K

బేరియం కార్బొనేట్ స్పటిక అణువు అర్థోరొంబిక్ సౌష్టవము కలిగి యున్నది స్పటికాలు ఒకదానితో ఒకటిమెలిపడి మూడు గ్రూపులుగా, నకిలీ షట్కోణ రూపంగా, కొంతవరకు సిలికాఖనిజం యొక్క బై పిరమిడ్ స్పటికాల వలె ఉండును.అణుసౌష్టవం1084Kవద్ద షట్కోణస్థితి లో,1254 K.వద్దచతుర్కోణస్థితిలో ఉండును.

ఆవిష్కరణ-లభ్యతసవరించు

బేరియం కార్బొనేట్ సమ్మేళన పదార్థాన్ని1784 లో విలియం విథేరింగ్ అనుశాస్త్ర వేత్త రసాయనికంగా barytesకు భిన్నమైనదని మొదటగా గుర్తించడం వలన ఈ సమ్మేళనంనకు విథేరైట్అని పేరు పెట్టారు. నార్త్‌అంబర్‌లాండ్ లోని హేక్సుహామ్ లోని సీసపు ఖనిజం(leadore)లోను,కుంబ్రియాలోనిఅల్స్టాన్,లాంకషైర్ లోని చోర్లె, కొన్ని ఇతర ప్రాంతాలలో గుర్తించారు.బేరియం కార్బొనేట్ అనునదీతర బేరియం లవణాల ఉత్పత్తికి ముఖ్య వనరు,నార్త్ అంబర్‌లాండ్ లోని గనులనుండి గణనీయ ప్రమాణంలో ఈ ఖనిజాన్నిత్రవ్వి తీసారు. దీనిని ఎలుకల సంహారక మందులలో,గాజు,పింగాణి వస్తువుల తయారీలో వాడుతారు,గతంలో చక్కెరను శుద్ధికరించుటకు ఉపయోగించేవారు.

క్రోమియం ఎలక్ట్రోప్లేటింగ్‌లో క్రోమేట్:సల్ఫేట్ నిష్పత్తిని నియంత్రించుటకు బేరియం కార్బొనేట్‌ను ఉపయోగిస్తారు.

ఉత్పత్తిసవరించు

బేరియం కార్బొనేట్‌^ను వ్యాపార స్థాయిలో బేరియం సల్ఫైడ్ నుండి తయారు చేయుదురు. ఒక విధానంలో బేరియం సల్ఫైడ్‌ను 60-70°Cవద్ద (సోడా యాష్ పద్ధతి) సోడియం కార్బొనేట్‌తో చర్య జరిపించడం ద్వారా ఉత్పత్తి చెయ్యుదురు. మరోవిధానంలో బేరియం సల్ఫైడ్ మీదుగా 40 -90°Cవద్ద కార్బన్ డైఆక్సైడ్‌వాయువును ప్రసరింపచేసి బేరియం కార్బొనేట్‌ను ఉత్పత్తి చెయ్యుదురు. సోడా యాష్ ప్రక్రియలో ఘన లేదా కరిగించిన సోడియం కార్బొనేట్‌ను బేరియం సల్ఫైడ్ ద్రావణంకు చేర్చెదరు, ప్రతి చర్య ఫలితంగా అవక్షేపగా ఏర్పడిన బేరియం కార్బొనేట్‌ ను వడబోత చేసి,శుభ్రంగా కదిహి,పొడిపర్చెదరు .బేరియం కార్బొనేట్ అణువులోని రెండు ఆక్సిజన్ పరమాణువులు,విడిగా ఒక్కొక్క ఎలక్ట్రాన్‌ను బేరియం పరమాణువు నుండి గ్రహించును.

రసాయన చర్యలుసవరించు

బేరియం కార్బొనేట్ ఆమ్లాలతో చర్య జరుపును.హైడ్రోక్లోరిక్ ఆమ్లం తోచర్య వలన నీటిలో కరుగు బేరియం క్లోరైడ్(BaCl2) ఏర్పడును.

BaCO3(s) + 2 HCl(aq) → BaCl2(aq) + CO2(g) + H2O(l)

సల్ఫ్యూరిక్ ఆమ్లంతో బేరియం కార్బొనేట్ సమ్మేళనం జరుపు రసాయనక చర్య బలహీనమైనది. కారణం బేరియం సల్ఫేట్ ద్రావణీయత (కరుగు స్వభావం)లేని పదార్థం కనుక.

ఉపయోగాలుసవరించు

బేరియం కార్బొనేట్ ను విరివిగా పింగాణి తయారి పరిశ్రమలలో పింగాణి వస్తువులకు మెరుపు నిచ్చే పదార్థాలలో కలిపి ఉపయోగిస్తారు.రంగును కల్గించే కొన్ని ఆక్సైడ్ లతో కలిపిన అపూర్వమైన రంగులను ఏర్పరచును. దీనిని పింగాణి వస్తువులకు మెరుపు నిచ్చుటకు వాడటంలో కొంత వివాదం నెలకొని ఉన్నది.ఇది కాలక్రమేన కరిగి ఆహార పదార్థాలకు చేరుతుందనికొందరి అభిప్రాయం.

ఎలకల సంహారక మందులలో ఉపయోగిస్తారు.బేరియం కార్బొనేట్‌ను ఇటులకు,పెంకులు, మట్టి పాత్రలు, కుండలు తయారయ్యేపరిశ్రమలలో ఉపయోగిస్తారు.

ఇవికూడా చుడండిసవరించు

మూలాలుసవరించు

  1. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; chemister అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. 2.0 2.1 Zumdahl, Steven S. (2009). Chemical Principles 6th Ed. Houghton Mifflin Company. ISBN 0-618-94690-X.
  3. 3.0 3.1 మూస:Sigma-Aldrich