బొమ్మలరామారం మండలం

తెలంగాణ, యాదాద్రి భువనగిరి జిల్లా లోని మండలం

బొమ్మలరామారం మండలం, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా లోని మండలం.[1]బొమ్మల రామారం, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన భువనగిరి నుండి 25 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం భువనగిరి రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  23  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

బొమ్మలరామారం
—  మండలం  —
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, బొమ్మలరామారం స్థానాలు
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, బొమ్మలరామారం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°31′58″N 78°45′59″E / 17.532749°N 78.766251°E / 17.532749; 78.766251
రాష్ట్రం తెలంగాణ
జిల్లా యాదాద్రి జిల్లా
మండల కేంద్రం బొమ్మలరామారం
గ్రామాలు 23
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 37,248
 - పురుషులు {{{population_male}}}
 - స్త్రీలు 18,471
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.15%
 - పురుషులు 62.29%
 - స్త్రీలు 37.58%
పిన్‌కోడ్ 508126

మండల గణాంకాలుసవరించు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త నల్గొండ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 37,248 - పురుషులు - స్త్రీలు 18,471, అక్షరాస్యత - మొత్తం 50.15% - పురుషులు 62.29% - స్త్రీలు 37.58%. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ లేదు. మండల వైశాల్యం 165 చ.కి.మీ. కాగా, జనాభా 37,248. జనాభాలో పురుషులు 18,777 కాగా, స్త్రీల సంఖ్య 18,471. మండలంలో 8,951 గృహాలున్నాయి.[3]

సమీప మండలాలుసవరించు

కీసర మండలం పడమరన, బీబీనగర్ మండలం దక్షిణాన, ఎం.తుర్కపల్లి మండలం ఉత్తరాన, ఘటకేసర్ మండలం దక్షిణాన ఉన్నాయి.

మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలుసవరించు