ప్రధాన మెనూను తెరువు
బ్రహ్మ మల్లిక
Baobab and elephant, Tanzania.jpg
Baobab tree in Tanzania
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
(unranked): పుష్పించే మొక్కలు
(unranked): యుడికాట్స్
(unranked): రోసిడ్స్
క్రమం: మాల్వేలిస్
కుటుంబం: మాల్వేసి
జాతి: Adansonia
ప్రజాతి: A. digitata
ద్వినామీకరణం
Adansonia digitata
లి.

బ్రహ్మ మల్లిక అనునది ఎత్తుగా, లావుగా పెరిగె ఒక వృక్షం పేరు. ఆఫ్రికా ఖండంలో పెరిగే ఈ చెట్టు వృక్ష శాస్త్రీయ నామం : Adansonia digitata. దీనిని ఆంగ్లంలో baobab, dead-rat tree (from the appearance of the fruits), monkey-bread tree (the soft, dry fruit is edible), upside-down tree (the sparse branches resemble roots) and cream of tartar tree అని పిలుస్తారు.

పెరుగుదలసవరించు

ఇవి చాలా పెద్ద వృక్షాలుగా పెరిగా సామాన్యంగా ఒంటరిగా కనిపిస్తాయి. చూచినవెంటనే గుర్తించేవిధంగా అనగా తిరగబడిన వృక్షం మాదిరిగా ఉంటాయి. ఇవి వేయి కన్నా ఎక్కువ సంవత్సరాలు జీవిస్తాయి.[1] దీని పుష్పాలు తెల్లని తెలుపు రంగులో పెద్దవిగా ఉండి వ్రేలాడుతుంటాయి. ఇవి మంచి సువాసన కలిగివుండి గబ్బిలాలు ద్వారా పరాగసంపర్గం జరుపుకుంటాయి. దీని పండ్లు తెల్లని గుజురు కలిగి ఎండి గట్టిపడి క్రిందపడి రొట్టె ముక్కలుగా కనిపిస్తాయి.[2] ఇది ఆఫ్రికాలో సాంప్రదాయపు ఆహార ప్రధానమైన మొక్క.[3] దీని జాతి నామం digitata వీని ఆకుల ఆకారం ఆధారంగా వచ్చినది. ప్రతి దానిలో ఐదు ఆకులు కలిసి చేతివేళ్లలాగా కనిపిస్తాయి.


పండుసవరించు

ఆఫ్రికన్ బోబాబ్ పండు 6 నుండి 8 సెం.మీ పొడవుంటుంది. దీనిలో కాల్షియం, ఏంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి ఉంటాయి.[4] కొన్ని సందర్భాలలో ఇది సూపర్ ఫ్రూట్ గా పిలువబడుతుంది.[4] దీని ఆకులు కూడా తింటారు. పండును పాలు లేదా నీటిలో కలుపుకుని పానీయంగా త్రాగుతారు. దీని విత్తనాల నుండి వంట నూనె తయారుచేస్తారు.

చిత్రమాలికసవరించు

మూలాలుసవరించు

  1. Varmah, J. C.; Vaid, K. M. (1978). "Baobab - the historic African tree at Allahbad". Indian Forester. 104 (7): 461–464.
  2. National Research Council (January 25, 2008). "Baobab". Lost Crops of Africa: Volume III: Fruits. Lost Crops of Africa. 3. National Academies Press. ISBN 978-0-309-10596-5. Retrieved July 15, 2008.
  3. National Research Council (October 27, 2006). "Baobab". Lost Crops of Africa: Volume II: Vegetables. Lost Crops of Africa. 2. National Academies Press. ISBN 978-0-309-10333-6. Retrieved July 15, 2008.
  4. 4.0 4.1 [http://www.independent.co.uk/news/world/africa/the-tree-of-life-and-its-super-fruit-869737.html Claire Soares 2008. The tree of life (and its super fruit), The Independent, Thursday, 17 July 2008

బయటి లింకులుసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.