ప్రధాన మెనూను తెరువు

1858 నుండి 1947 మధ్య, భారత ఉపఖండం లో సాగిన బ్రిటిష్ పరిపాలనను బ్రిటిష్ రాజ్య చరిత్ర సూచిస్తుంది. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీఆధ్వర్యంలో ఉన్న పాలనను 1858లో విక్టోరియా రాణి కిరీటానికి మార్పిడి చేశాక (1876లో ఈమెను భారత సామ్రాఙ్ఞిగా ప్రకటించారు), పాలనా వ్యవస్థ సంస్థాగతం చేయబడింది. బ్రిటిష్ ఇండియా సామ్రాజ్యం 1947 వరకూ కొనసాగింది. 1947లో ఇది రెండు సర్వసత్తాక అధినివేశ రాజ్యాలుగా విభజించబడింది .అవి: భారత సమాఖ్య (ఆ తర్వాత ఇది భారత గణతంత్ర రాజ్యం) అయింది), పాకిస్తాన్ అధినివేశ రాజ్యం (ఆ తర్వాత ఇది పాకిస్తాన్ ఇస్లామిక్ గణతంత్ర రాజ్యం అయింది. కొంత కాలం తర్వాత దీనిలో తూర్పునున్న సగ భాగము విడివడి బంగ్లాదేశ్ ప్రజా గణతంత్ర రాజ్యం ఏర్పడింది). భారత సామ్రాజ్యంలో తూర్పున ఉన్నబర్మా ప్రాంతాన్ని 1937లో విడదీసి, ప్రత్యేకమైన వలసగా మార్చారు. ఇది 1948లో స్వాతంత్ర్యం పొందింది.

పీఠికసవరించు

ఆర్థిక వ్యవస్థపై ప్రభావాలుసవరించు

19 శతాబ్దపు ద్వితీయార్ధ భాగంలో, బ్రిటిష్ రాణి ప్రత్యక్ష పరిపాలన వలన, పారిశ్రామిక విప్లవ కారణంగా సాంకేతికంగా వచ్చిన మార్పుల వలన భారత, గ్రేట్ బ్రిటన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు బాగా ప్రభావితమయ్యాయి.[1] వాస్తవానికి రవాణా, సమాచార రంగాలలో (అవి భారతదేశంలో రాణి పరిపాలనలతో ముడిపడి ఉన్నాయి) చాలా మార్పులు తిరుగుబాటు కంటే ముందే ప్రారంభమయ్యాయి. సాంకేతికాభివృద్ధి గ్రేట్ బ్రిటన్‌లో తారాస్థాయికి చేరుకున్నాక డల్హౌసీ వాటిని భారతదేశంలో ప్రవేశపెట్టాడు. భారతదేశం కూడా ఆయా సాంకేతిక రంగాలలో చాలా వేగంగా అభివృద్ధి చెందింది. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల నుండి పత్తి వంటి ముడి పదార్థాలను బొంబాయి వంటి ప్రాంతాలలో ఉన్న నౌకాశ్రయాలకు, అక్కడ నుండి అవి ఇంగ్లండుకు మరింత సమర్ధవంతంగా ఎగుమతి చేయడం కోసం రైల్వేలు, రోడ్డు మార్గాలు, కాలువలు, వంతెనలను చాలా వేగంగా నిర్మించారు. టెలీగ్రాఫ్ సంధానాలను కూడా అంతే వేగంగా ఏర్పరిచారు.[2] ఇంగ్లండులో తయారైన సరుకులను కూడా, దినదినాభివృద్ధి చెందుతున్న భారతీయ మార్కెట్లలో అమ్మేందుకై తిరిగి అంతే సమర్ధతతో రవాణా చేశారు.[3] మార్కెట్‌కు అవసరమైన మౌలిక సౌకర్యాల అభివృద్ధికి బ్రిటన్‌లో వైయక్తిక మదుపుదారులు కారకులు కాగా, దీనికి భిన్నంగా, భారత దేశంలో పన్ను చెల్లింపుదారులైన, రైతులు, వ్యవసాయ కూలీలు కారకులయ్యారు. వీటి కోసం 50 మిలియన్ పౌండ్లు ఖర్చయ్యాయి.[4] భారతీయులు ఇంత సొమ్మును వెచ్చించినా, వారి కోసం నిపుణత అవసరమైన ఉద్యోగాల కల్పన మాత్రం చాలా తక్కువగానే జరిగింది. 1920 నాటికి, ప్రపంచంలోనే నాల్గవ అతి పెద్దదైన రైల్వే యంత్రాంగంగా పేరొంది, నిర్మాణంలో అప్పటికే 60 సంవత్సరాల చరిత్రను సంతరించుకున్న భారతీయ రైల్వేలలో, కేవలం పది శాతం మంది భారతీయులు మాత్రమే "ఉన్నత పదవుల"లో ఉన్నారు.[5]

సాంకేతికత వేగవంతమవడం వలన భారత వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ కూడా మార్పులను సంతరించుకున్నది. 19వ శతాబ్దపు చివరి దశకం నాటికి, కేవలం పత్తి వంటి ముడిపదార్ధాలు మాత్రమే కాకుండా, కొన్ని ఆహార దాన్యాలు కూడా సుదూర మార్కెట్లకు రవాణా అయ్యాయి.[6] దీని ఫలితంగా, మార్కెట్లపై ఆధారపడిన అనేకమంది సన్నకారు రైతులు వారి భూమిని, పశువులను, సాధనాలను వడ్డీ వ్యాపారులకు పోగొట్టుకున్నారు.[6] 19వ శతాబ్దపు రెండవ అర్థ భాగంలో భారతదేశంలో కరువులు అనేకం భారీస్థాయిలో సంభవించాయి. కరువులు భారత ఉపఖండానికి కొత్తవి కాకపోయినప్పటికీ, ఇవి చాలా తీవ్రమైనవి కావడం వలన పదుల మిలియన్ల సంఖ్యలో జనం చనిపోయారు[7]. భారత, బ్రిటన్ దేశాలకు సంబంధించిన అనేక మంది విమర్శకులు దీనికి వలస పాలకులే కారకులని నిందించారు[6].

చిత్రమాలిక చిత్రం: భారతీయ రైల్వేలు 1909ఎ.జెపిజి|ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైల్వే మార్గంగా ఉన్న సమయంలో భారతీయ రైల్వేలపై 1909 నాటి చిత్రపటం. భారతదేశంలో రైలు మార్గాన్ని1853లో వేయడం మొదలు పెట్టారు. చిత్రం:విక్టోరియా టెర్మినస్ 1903.జెపిజీ|"ప్రపంచంలోనే గొప్ప బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్." 1888 లో పూర్తి చేయబడిన బొంబాయిలోని విక్టోరియా టెర్మినస్ స్టీరియోగ్రాఫిక్ దృశ్యము. చిత్రము:1871లో ఆగ్రా కాలువ తవ్వకపు కీలక పనులు ఎ.జెపిజి|ఆగ్రా కాలువ (సి. 1873), పూర్తి కావడానికి ఒక సంవత్సరం ముందు. 1904లో కరువు నివారణా సహాయం కోసం, నీటి పారుదల సౌకర్యాలను పెంచడం కోసం ఈ కాలువను మూసివేసారు. చిత్రము:జార్జి రాబిన్‌సన్ ఒకటవ మార్కస్ ఆఫ్ రిప్పన్.జెపిజి|లార్డ్ రిప్పన్, దుర్బిక్ష నియమావళిని ఏర్పరచిన ఉదార వైస్రాయ్ చిత్రమాలిక

స్వీయ ప్రభుత్వ ఆరంభంసవరించు

19వ శతాబ్ధపు చివరి అర్థ భాగంలో బ్రిటీష్ వైస్రాయ్‌కి సలహాల నిచ్చేందుకోసం, భారతీయ సలహాదారులను నియమించడం, భారతీయ సభ్యులతో ప్రాంతీయ మండలుల నేర్పరచడం వలన, బ్రిటీష్ ఇండియాలో స్వీయ ప్రభుత్వాన్ని ఏర్పరిచే దిశగా తొలి అడుగులు పడ్డాయి. ఆ తర్వాత భారతీయ మండలుల చట్టము1892 ద్వారా శాసన మండలిలో భారతీయుల ప్రాతినిధ్యాన్ని పెంచారు. స్థానిక పరిపాలన కోసం నగర పాలక సంస్థలు, జిల్లా బోర్డులు ఏర్పడ్డాయి. వీటిలో ఎన్నిక కాబడిన భారతీయ సభ్యులు కూడా ఉంటారు.

భారతీయ ప్రభుత్వ చట్టము1909, దీనినే మార్లే-మింటో సంస్కరణలుగా పిలిచారు (జాన్ మార్లే భారత దేశపు కార్యదర్శి, గిల్‍బర్ట్ ఇలియట్, నాల్గవ మింటో ప్రభువు, అప్పటి వైస్రాయ్ ) - భారతీయులకు కేంద్ర, ప్రాదేశిక శాసన సభలలో పరిమిత అధికారాలను కల్పించింది. ఈ శాసన సభలను శాసన మండలులు అంటారు. శాసన మండలులకు గతంలో భారతీయులు నియమించేవారు. సంస్కరణల అనంతరం వారు శాసన మండలులకు ఎన్నికయ్యారు. కేంద్రంలో, మండలి సభ్యులలో ప్రభుత్వంచేత నియమింపబడిన అధికారులే ఎక్కువమంది ఉండేవారు. శాసన సభకు వైస్రాయ్ బాధ్యత వహించేవాడు కాదు. ప్రాదేశిక స్థాయిలో, అనధికారికంగా నియమించబడిన వారితో పాటుగా ఎన్నికయిన సభ్యులు, వారి కంటే ఎక్కువ సంఖ్యలో నియమితులైన అధికారులు ఉండేవారు. శాసనసభకు గవర్నర్ బాధ్యత పడే వాడు కాదు. బ్రిటీష్ పార్లమెంటులో చట్టాన్ని ప్రవేశపెడుతూ, పార్లమెంటరీ స్వీయ ప్రభుత్వం బ్రిటీష్ ప్రభుత్వ లక్ష్యం కాదని మార్లే స్పష్టం చేసాడు.

మోర్లే-మింటో సంస్కరణలు ఒక మైలురాయి. భారతీయ శాసన మండలులలో సభ్యత్వం కోసం, అంచెలంచెలుగా ఎన్నిక పద్ధతిని ప్రవేశ పెట్టారు. "ఓటర్లు" పరిమితంగా ఉండేవారు. వీరు ఉన్నత తరగతికి చెందిన కొద్దిమంది భారతీయులు. ఎన్నిక అయిన సభ్యులు పెరిగే కొద్దీ, వారు "అధికారిక ప్రభుత్వాని"కి "ప్రతిపక్షం"గా తయారయ్యారు. మత ప్రాతిపదికన ఓటర్ల నమోదు ఇతర మతాలకు కూడా అన్వయించడం వలన, భారత రాజకీయ ధోరణిలో అనేక సమూహాలు మతం ద్వారా ఉనికిలోనికి వచ్చాయి.

చిత్రమాలిక చిత్రము: జాన్ మార్లే, మొదటి విస్కౌంట్ మార్లే ఆఫ్ బ్లాక్‌బర్న్ - ప్రాజెక్ట్ గ్యుటెన్‌బర్గ్ ఇ వాచకము 17976. జెపిజి|జాన్ మార్లే 1905 నుండి 1910 వరకు భారతదేశ కార్యదర్శి, మరియు గ్లాడ్‌స్టోనియన్ లిబరల్. భారత ప్రభుత్వ చట్టం 1909ని మింటో మార్లే సంస్కరణలు అని కూడా పిలుస్తారు. ఇది శాసన మండలికి ఎన్నికయ్యేందుకు భారతీయులను అనుమతించింది. చిత్రము:ఢిల్లీదర్బార్ పిసి1911.జెపిజి| గోర్డాన్ హైలాండర్స్ కవాతు, రాజు, భారత సామ్రాజ్యాధినేతగా మకుటధారణ జరిగాక, 1911,డిసెంబర్ 12న ఢిల్లీ దర్బార్లో ఐదవ జార్జ్ రాజు, రాణి మేరీల పటం. చిత్రము: భారతీయ వైద్య దళాలు డబ్ల్యూడబ్ల్యూ1.జెపిజె|మొదటి ప్రపంచ యుద్ధంలో, మెసపటోమియాలో, మెసపటోమియన్ ఎక్స్ పెడిషనరీ ఫోర్స్ లోని గాయపడిన సైనికులకు సేవలనందిస్తున్న భారతీయ వైద్య సైనిక బృందం. చిత్రం: ఖుదాదాద్ ఖాన్ విసి1915.జెపిజి|సిపాయిఖుదాదాద్ ఖాన్ విక్టోరియా క్రాస్ అవార్డు పొందిన మొదటి భారతీయ సైనికుడు. ఇది యుద్ధ కాలపు ఉన్నత వీరోచిత పోరాట మెడల్. ఖాన్ ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న పంజాబ్‍లోని చాక్‌వల్ జిల్లాలో జన్మించాడు. అతడు 1971లో మరణించాడు. చిత్రమాలిక

ప్రపంచ యుద్ధం I మరియు అనంతర పరిస్థితిసవరించు

ప్రపంచ యుద్ధం I బ్రిటన్ మరియు భారతదేశం మధ్య సామ్రాజ్య సంబంధంలో ఒక కూడలిగా నిరూపించబడుతుంది. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి చెందిన 1.4 మిలియన్ భారతీయ మరియు బ్రిటిష్ సైనికులు ఈ యుద్ధంలో పాలుపంచుకుంటారు, వీరి భాగస్వామ్యం విస్తృతమైన సాంస్కృతిక ప్రభావాలకు దారితీస్తుంది: భారతీయ సైనికులు బ్రిటిష్ సైనికులతో కలిసి పోరాడి మరణిస్తున్న వార్తలు, కెనడా మరియు ఆస్ట్రేలియా ప్రాంతాలకు చెందిన సైనికులు ప్రపంచంలోని సుదూర తీరాలకు ప్రయాణిస్తున్న వార్తలు వార్తాపత్రికలు మరియు కొత్త వార్తా మాధ్యమమైన రేడియోలో వస్తుంటాయి.[8] భారతదేశానికి ఉన్న అంతర్జాతీయ చిత్రణ అప్పటినుంచి పెరగింది మరియు 1920లలో ఇది కొనసాగుతూ వచ్చింది.[8] ఇది అనేక ఇతరవిషయాలకు మల్లే భారత్ తన స్వతం పేరుతో 1920లో నానాజాతి సమితి యొక్క సంస్థాపక సభ్యురాలుగా మారడానికి దారితీసింది మరియు అంట్‌వెర్ప్లో జరిగిన 1920 వేసవి ఒలింపిక్స్‌లో "Les Indes Anglaises" (ది బ్రిటిష్ ఇండీస్) పేరుతో పాల్గొనడానికి కూడా ఈ పరిణామాలు దారితీశాయి.[9] భారత్ విషయానికి వస్తే, ప్రత్యేకించి భారత జాతీయ కాంగ్రెస్, నేతలు భారతీయులకు మరింత స్వీయ ప్రభుత్వం కోసం పిలుపు నివ్వడానికి ఇది దారితీసింది.[8]

1916లో, లక్నో ఒప్పందంపై సంతకాలు చేయడంతో జాతీయవాదులచే ప్రదర్శించబడిన కొత్త బలం మరియు హోమ్ రూల్ లీగ్‌ల స్థాపన, మరియు మెసపటోమియన్ కేంపెయిన్ వినాశనం తర్వాత, యుద్ధం దీర్ఘకాలం కొనసాగుతుందని గుర్తించడం వంటి అంశాల నేపథ్యంలో, కొత్త వైస్రాయి లార్డ్ ఛెమ్స్‌ఫర్డ్, భారత ప్రభుత్వం భారతీయ అభిప్రాయం పట్ల మరింత బాధ్యతాయుతంగా ఉండవలసి ఉంటుందని హెచ్చరించాడు.[10] సంవత్సరాంతంలో, లండన్‌లో ప్రభుత్వంతో చర్చలు జరిగిన తర్వాత, – భారతీయ యుద్ధ పాత్ర నేపథ్యంలో– అనేక ప్రజా చర్యల ద్వారా అంటే రాజులకు బిరుదులు, గౌరవాలు, సైన్యంలో భారతీయులకు కమిషన్లు మంజూరు చేయడం, పత్తి పన్నును తొలగంచడం వంటివాటితో సహా బ్రిటిష్ ప్రభుత్వం తన విశ్వసనీయతను ప్రదర్శించిందని అతడు సూచించాడు. వీటన్నిటికంటే ముఖ్యంగా భారత్ కోసం బ్రిటిష్ భవిష్యత్తు పథకాలు, కొన్ని నిర్దిష్ట చర్యలు చేపడుతున్నట్లు సూచనలు కూడా వచ్చాయి.[10] మరింత చర్చ తర్వాత, 1917 ఆగస్టులో, కొత్త ఉదారవాద భారతీయ ప్రభుత్వ కార్యదర్శి, ఎడ్విన్ మాంటేగ్, “బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా భారత్‌లో బాధ్యతాయుత ప్రభుత్వ ప్రగతిశీల పాత్ర దృక్పధంతో ప్రభుత్వ పాలనలోని ప్రతి విభాగంలో భారతీయుల పాత్రను పెంచడం, స్వయం-ప్రభుత్వ సంస్థలను క్రమానుగతంగా అభివృద్ధి చెందించడం,”కి సంబంధించిన బ్రిటిష్ లక్ష్యాన్ని ప్రకటించాడు.[10] ఈ చిత్రణ ఇప్పటివరకు ప్రాతినిధ్యంలేని మైనారిటీగా ఏవగింపుతో చూడబడుతున్న విద్యావంత భారతీయులలో తిరిగి విశ్వాసాన్ని పెంచింది. మాంటేగ్ వీరిని “బౌద్ధికంగా మన పిల్లలు” అని వర్ణించాడు.[11] బ్రిటన్ నిర్దేశించిన సంస్కరణలు భారతీయులకు ఫలాలు అందించినట్లుగానే కనిపించాయి.[11] అయితే, చిత్రించిన పథకం – బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమై ఉంటున్న భారత్‌లోని– ప్రోవిన్స్‌లలో మాత్రమే పరిమితమైన స్వయం ప్రభుత్వాన్ని ఉనికిలోకి తెచ్చింది. శ్వేతేతర వలసలో ప్రాతినిధ్య ప్రభుత్వ రూపాన్ని గురించి బ్రిటిష్ చేసిన మొట్టమొదటి ప్రతిపాదనను ఇది ప్రతిఫలించింది.

అంతకుముందు, ప్రపంచ యుద్ధం I ప్రారంభంలో భారత్‌లోని బ్రిటిష్ సైన్యంలో చాలా భాగాన్ని ఐరోపా‌కి మరియు మెసపటోమియాకు తరలించాలనే నిర్ణయంతో మునుపటి వైస్రాయ్ లార్డ్ హోల్డింగ్ "భారత్‌లో సైనికదళాలను తగ్గించడలో పొంచి ఉన్న ప్రమాదాలు" గురించి కలవరపడ్డాడు[8] విప్లవ హింస అప్పటికే బ్రిటిష్ ఇండియాలో ఆందోళనకరంగా ఉంటోంది; తత్ఫలితంగా 1915లో ప్రమాదాలు పెరగుతున్నట్లుగా అది భావించిన కాలంలో తన శక్తులను బలోపేతం చేసుకోడానికి బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ రక్షణ చట్టంని ఆమోదించింది, ఈ చట్టం రాజకీయంగా ప్రమాదకారులైన అసమ్మతివాదులను ఎలాంటి శాసన ప్రక్రియలతో సంబంధం లేకుండా నిర్బంధించడాన్ని అనుమతించింది మరియు ప్రభుత్వానికి అప్పటికే –1910 ప్రెస్ చట్టం కింద – ఉన్న శక్తికి ఇది అదనంగా చేరింది, ఈ రెండు చట్టాలు విచారణ లేకుండానే పత్రికావిలేకరులు నిర్బంధించేవి మరియు ప్రెస్ సెన్సార్‌ని అమలు చేసేవి.[12] ఇప్పుడు, రాజ్యాంగ సంస్కరణ చర్చకు రావడం ప్రారంభమవడంతో కొత్త మితవాద భారతీయులను రాజ్యాంగబద్ధ రాజకీయాల్లోకి ఎలా తేవాలి, అదేసమయంలో ఇప్పటికే స్థిరపడిన రాజ్యాంగవాదులను బలోపేతం చేయడం ఎలా అనే విషయాలను బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించనారంభించింది.[12] అయితే, యుద్ధకాలపు ప్రభుత్వ నియంత్రణ పెరిగిన ఫలితంగా ఉగ్రవాద హింస తగ్గుముఖం పట్టిన సమయంలో సంస్కరణ పథకం ముందుకొచ్చింది మరియు ఇది విప్లవ హింస పునరుద్ధరించబడుతుందని ఇది భయపడుతోంది, [11] ప్రభుత్వం కూడా యుద్ధకాలంలో తాను పొందిన అధికారాల్లో కొన్నిటిని శాంతి కాలంలో కూడా పొడిగించడం ఎలా అని ఆలోచించడం ప్రారంభించింది.[12][12]

 
ఎడ్విన్ మోంటేగ్, ఎడమవైపు, ఇండియాకు స్టేట్ కార్యదర్శి, ఇతడి నివేదిక భారత ప్రభుత్వ చట్టం 1919కి దారితీసింది, వీటిని మోంట్‌ఫోర్డ్ సంస్కరణలు లేదా మోంటేగ్-చెమ్స్‌పర్డ్ సంస్కరణలు అని కూడా పేరుపడ్డాయి.

తత్ఫలితంగా 1917లో, ఎడ్విన్ మాంటెగ్యు కొత్త రాజ్యాంగ సంస్కరణలు ప్రకటించినప్పుడే, బ్రిటిష్ న్యాయమూర్తి మిస్టర్ ఎస్.ఎ.టి. రోలాట్ట్ నేతృత్వంలోని రాజద్రోహ కమిటీ, యుద్ద-కాల విప్లవ కుట్రదారులుమరియు భారత్‌లో హింసకు సంబంధించి జర్మన్ మరియు బోల్షెవిక్ సంబంధాలు [13][14][15] పై పరిశోధించే లక్ష్యంతో పనిచేసింది, దీనికి ప్రభుత్వ యుద్ధకాల అధికారాల విస్తరణకు సంబంధించిన అప్రకటిత లక్ష్యం కూడా ఉంది.[10] రౌలట్ కమిటీ తన నివేదికను 1918 జూలైలో నివేదించింది, ఇది కుట్రపూరితమైన తీవ్రవాదంతో ముడిపడిన మూడు ప్రాంతాలను గుర్తించింది: బెంగాల్, బాంబే ప్రెసిడెన్సీ, మరియు పంజాబ్.[10] ఈ ప్రాంతాలలో తిరుగుబాటు కార్యకలాపాలను ఎదుర్కోవడానికి, ప్రభుత్వం తన యుద్ధకాల అధికారానికి సంబంధించిన అత్యవసర అధికారాలను ఉపయోగించాలని కమిటీ సిఫార్సు చేసింది. జ్యురీలు లేకుండానే ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల ద్వారా రాజద్రోహ కుట్రలను విచారించే సామర్థ్యం, అనుమానితులనుంచి సెక్యూరిటీలపై జరిమానాలను విధించడం., అనుమానితుల నివాసప్రాంతాలపై నిఘాపెట్టడం, [10] తాత్కాలిక నిర్బంధ కేంద్రాలలో విచారణ లేకుండా అనుమానితులను నిర్బంధించడానికి, అదుపులోకి తీసుకోవడానికి ప్రాంతీయ ప్రభుత్వాలకు అధికారం కల్పించడం ఈ సిఫార్సులలో ఉన్నాయి.[16]

ప్రథమ ప్రపంచ యుద్ధం ముగియడంతో ఆర్థిక వాతావరణంలో కూడా మార్పు వచ్చింది. 1919 సంవత్సరాంతానికి, 1.5 మిలియన్ల మంది భారతీయులు సాయుధ విభాగాలలో ప్రత్యక్ష పోరులో లేదా పోరాటేతర రంగాల్లో పనిచేశారు, యుద్ధం కోసం భారత్ £146 మిలియన్‌లను అందించింది.[17] పెరిగిన పన్నులు దేశీయంగా మరియు అంతర్జాతీయ వ్యాపారంలో అంతరాయాలతో కలిసి ప్రభావం చూపడంతో 1914 మరియు 1920ల మధ్య కాలంలో భారత్‌లో మొత్తం ధరల సూచి దాదాపుగా రెట్టింపుకు పెరిగింది.[17] తిరిగి వచ్చిన యుద్ధ వీరులు ప్రత్యేకించి పంజాబ్‌లో, తీవ్రమైన నిరుద్యోగ సంక్షోభాన్ని సృష్టించారు[18] మరియు యుద్ధానంతర ద్రవ్యోల్బణం బొంబాయి, మద్రాసు, బెంగాల్ ప్రాంతాలలో ఆహార దాడులకు దారి తీసింది.[18] 1918-19 రుతువు వైఫల్యంతో, అక్రమలాభాలు, సట్టా వ్యాపారంతో ఈ పరిస్థితి మరింత ఘోరంగా మారింది.[17] ప్రపంచవ్యాప్తంగా ఇన్‌ఫ్లూయెంజా సాంక్రమిక వ్యాధి మరియు 1917 నాటి బోల్షెవిక్ విప్లవం ప్రపంచాన్ని మరింతగా వణికించింది: వీటిలో మొదటిది జనాభాలో అప్పటికే ఉన్న ఆర్థిక బాధలను మరింతగా పెంచింది, [18] మరియు రెండోది భారత్‌లోనూ అలాంటి విప్లవమే వస్తుందన్న భయాలను ప్రభుత్వోద్యోగులలో కలిగించింది.[19]

రానున్న సంక్షోభంగా చూస్తున్న దాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఇప్పుడు రౌలట్ కమిటీ ప్రతిపాదనలను రెండు రౌలట్ బిల్స్‌గా ముసాయిదాను రూపొందించింది.[16] ఈ బిల్లులు ఎడ్విన్ మాంటెగ్యూ ద్వారా శాసనసభ పరిశీలనకు పంపబడినప్పటికీ, ఇవి కింది ప్రకటన ద్వారా అయిష్టపూర్వకంగా పరిశీలించబడినవి, “ఈ సూచనను మొట్టమొదట చూడగానే రౌలట్ మరియు అతడి మిత్రులు ఆలోచిస్తున్న స్థాయిలో శాంతికాలంలో భారత రక్షణ చట్టాన్ని పరిరక్షించడానికి నాకు ఇష్టం లేకపోయింది."[10] తర్వాత జరిగిన చర్చ మరియు ఇంపీరియల్ శాసన మండలిలో ఓటు సందర్భంగా భారతీయ సభ్యులందరూ ఈ బిల్లులకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఏది ఏమైనా, 1919ల ముందు నాళ్ళలో భారత ప్రభుత్వం తనకున్న" అధికారిక మెజారిటీ"ని ఉపయోగించి బిల్లులను ఆమోదింపచేసుకునేది.[10] భారతీయ ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ఇంతకు ముందర జారీ చేసిన మొదటి బిల్లు కన్నా ఇది తక్కువ తీవ్రత కలది. ఇది చట్ట భాహ్యమైన శక్తులను మూడేండ్ల పాటు అనుమతించింది. "అరాచక, విప్లవకర ఉద్యమాల"పై మాత్రమే అది నేరారోపణకు అనుమతించింది. భారత శిక్షాస్మృతిని సవరించడం ద్వారా రెండవ బిల్లును పూర్తిగా ఆపివేసింది.[10] నూతన రౌలట్ చట్టం జారీకాగానే భారతదేశమంతటా ఈ అన్యాయానికి వ్యతిరేకంగా కోపాగ్ని ప్రజ్వరిల్లింది. ఇది జాతీయోద్యమం లోనికి మోహన్‌దాస్ గాంధీని ముందు వరుస లోనికి తెచ్చింది.[16]

కిందటి శీతాకాలంలో నిజనిర్ధారణ నిమిత్తం భారత దేశమంతటా సుదీర్ఘంగా పర్యటించి తయారుచేసిన నివేదికను, మాంటేగ్, చేమ్స్ ఫోర్డ్‌లు 1918 జూలైలో, అదే సమయంలో ప్రవేశపెట్టారు.[20] భారత ప్రభుత్వ చట్టం 1919 (దీనినే మాంటేగ్ చేమ్స్ ఫోర్డ్ సంస్కరణలు అంటారు) ని ప్రభుత్వము, బ్రిటన్ పార్లమెంట్ బాగా చర్చించాక, భవిష్యత్తు ఎన్నికలలో ఎవరు ఓటు చేయనున్నారో గుర్తించేందుకు ఫ్రాంఛైజ్ అండ్ ఫంక్షన్స్ కమిటీ మరో పర్యటనను జరిపాక, డిసెంబరు 1919లో ఆమోదించారు.[20] ఈ నూతన చట్టం ప్రాదేశిక మండలులను విస్తృత పరిచింది. ఇంపీరియల్ శాసన మండలిని విస్తృతమైన కేంద్ర శాసన సభగా మార్చింది. భారతీయ ప్రభుత్వానికి అననుకూల ఓట్లు వచ్చినప్పుడు, దానికి ఆలంబనగా ఉంటూ వచ్చిన "అధికారిక మెజారిటీ"ని కూడా ఇది రద్దు చేసింది.[20] అయినా, రక్షణ, విదేశీవ్యవహారాలు, క్రిమినల్ చట్టం, సమాచార ప్రసారం, ఆదాయపు పన్ను వంటి విభాగాలు వైస్రాయ్, కొత్త ఢిల్లీ లోని కేంద్రప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. ప్రజారోగ్యం, విద్య, భూమి రెవిన్యూ, స్థానిక స్వయం పరిపాలన వంటి ఇతర విభాగాలను మాత్రం ప్రాదేశిక ప్రభుత్వాలకు బదిలీ చేశారు.[20] ప్రాదేశిక ప్రభుత్వాలు నూతన ద్వంద్వ పాలనా విధానాన్ని నిర్వహించవలసి వచ్చింది. దీనివలన విద్య, వ్యవసాయం, మౌళిక వసతుల అభివృద్ధి, స్థానిక స్వయం పరిపాలన వంటి కొన్ని రంగాలు భారతీయ మంత్రులు, శాసన సభల ఆధీనంలోకి వచ్చాయి. అంతిమంగా భారతీయ ఓటర్లు, నీటి పారుదల, భూమి రెవిన్యూ, పోలీసు, జైళ్ళు, ప్రచార సాధనాల నియంత్రణ వంటివి మాత్రం బ్రిటీష్ గవర్నర్, అతని నిర్వహణా మండలి పరిధిలో ఉన్నాయి.[20] ఈ నూతన చట్టం భారతీయులను సివిల్ సర్వీస్, సైనికాధికార దళాలలో ప్రవేశించడాన్ని తేలిక చేసింది.

ఇప్పుడు భారతీయులలో అధిక సంఖ్యాకులు ఓటు హక్కు కలిగి ఉన్నప్పటికీ, వారు జాతీయ స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించగలిగినప్పటికీ, వారి సంఖ్య మొత్తం పురుషుల జనాభాలో 10% మాత్రమే ఉంది. వారిలో అధిక సంఖ్యాకులు నిరక్షరాస్యులు.[20] ప్రాదేశిక శాసన సభలలోని కొన్ని సీట్లను బ్రిటీష్ వారు తమకు సహకరించే వారికోసం, లేదా తమ ప్రయోజనాలను కాపాడే వారి కోసం అట్టిపెట్టి, శాసన సభలలో నియంత్రణను కొనసాగించారు. ముఖ్యంగా, గ్రామీణ ప్రాంతాలలో బ్రిటీష్ పరిపాలన పట్ల సానుభూతితో ఉండి, తక్కువ వ్యతిరేకత ఉన్న వారికి, పట్టణ ప్రాంతాలకు చెందిన వారి వ్యతిరేకుల కన్నా ఈ సభలలోఎక్కువ సీట్లను కేటాయించారు.[20] బ్రాహ్మణేతరులు, భూస్వాములు, వ్యాపారులు, కళాశాల పట్టభద్రులకు కూడా కొన్ని సీట్లను ప్రత్యేకించి కేటాయించారు. "మత ప్రాతినిధ్యము" అనేది మింటో మార్లే సంస్కరణలలో అంతర్భాగమైన ఒక నియమం. కాంగ్రెస్ - ముస్లిం లీగ్ పార్టీల లక్నో ఒప్పదం దీనిని తిరిగి ధృవీకరించింది. ఈ ఒప్పదం ముస్లింలకు, సిక్కులకు, భారతీయ క్రైస్తవులకు, ఆంగ్లో-ఇండియన్లకు, స్థిరనివాసం ఉంటున్న ఐరోపావారికి ప్రాదేశిక మరియు ఇంపీరియల్ శాసన మండలులలో ప్రత్యేక సీట్ల కేటాయింపును ధృవపరిచింది.[20] మాంటేగ్ చేమ్స్ ఫోర్డ్ సంస్కరణలు భారతీయులకు, ముఖ్యంగా ప్రాదేశిక స్థాయిలో శాసనాధికారాన్ని కలిగి ఉండే ముఖ్యమైన అవకాశాన్ని కల్పించింది. ఐనప్పటికీ, అర్హులైన ఓటర్లు తక్కువ సంఖ్యలో ఉన్న కారణంగా, ప్రాదేశిక శాసన సభలకు తక్కువ మొత్తంలో బడ్జెట్ కేటాయించడం ద్వారా, గ్రామీణ ప్రాంతం వారి కోసం, కొన్ని ప్రత్యేక అవసరాల కోసం కేటాయించిన సీట్లు బ్రిటీష్‍ వారి ఆధీనంలో ఉండి వారి ప్రయోజనాలకు అవి పనిముట్లుగా ఉపయోగపడుతుండడ వలన ఆ అవకాశం నియంత్రించబడింది.[20]

1930s: భారత ప్రభుత్వ చట్టం (1935)సవరించు

 
1931 అక్టోబరులో లండన్‌లో జరిగిన రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో మహాత్మాగాంధీకి కుడివైపున ఉన్న బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సే మెక్‌డొనాల్డ్

1935లో, రౌండ్ టేబుల్ సమావేశాల తర్వాత, బ్రిటిష్ పార్లమెంటు, బ్రిటిష్ ఇండియాలో ఉన్న అన్ని ప్రాంతాలలో స్వతంత్ర శాసనసభల స్థాపనకు బ్రిటిష్ ప్రాంతాలు మరియు రాజాస్థానాలతో కలిపిన కేంద్రప్రభుత్వ స్థాపన మరియు ముస్లిం మైనారిటీల పరిరక్షణకు అధికారమిస్తున్న, భారత ప్రభుత్వ చట్టం (1935) కు ఆమోదముద్ర వేసింది[3] భవిష్యత్తు స్వతంత్ర భారత రాజ్యాంగం ఈ చట్టం పాఠ్యానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వనుంది.[21] ఈ చట్టం ద్విసభాజాతీయ పార్లమెంట్‌ని, బ్రిటిష్ పార్లమెంటు పరిధిలో ఒక కార్యనిర్వాహక శాఖను కూడా అందించింది. జాతీయ సమాఖ్య ఎన్నడూ ఉనికిలోకి రానప్పటికీ, ప్రాదేశిక శాసనసభలకు 1937లో జాతీయ ఎన్నికలు నిర్వహించబడినవి. ప్రారంభంలో కాస్త ఊగిసలాట ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పాల్గొని బ్రిటిష్ ఇండియా[22] లోని పదకొండు ప్రాంతాల్లో ఏడింటిలో విజయాలు సాధించింది, ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు విస్తృత అధికారాలతో ఏర్పడ్డాయి. గ్రేట్ బ్రిటన్‌లో, ఈ విజయాలు తదనంతరం భారత స్వతంత్ర భావన వెల్లువను తీసుకొచ్చాయి.[22]

రెండో ప్రపంచ యుద్ధంసవరించు

1939లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమవగానే, వైస్రాయ్ లార్డ్ లిన్‌లిత్‌గో, భారతీయ నేతలతో చర్చలు జరపకుండానే భారత్ తరపున యుద్ధం ప్రకటించాడు, దీనికి నిరసనగా కాంగ్రెస్ ప్రాదేశిక మంత్రులు రాజీనామా చేశారు. దీనికి భిన్నంగా ముస్లింలీగ్, బ్రిటన్ యుద్ధ ప్రయత్నాలకు మద్దతు పలికింది. అయితే కాంగ్రెస్ ఆధిపత్యంలోని స్వతంత్ర భారత్‌లో ముస్లింలపట్ల వివక్షత ఉంటుందనే దృక్పథాన్ని ముస్లింలీగ్ చేపట్టింది. బ్రిటిష్ ప్రభుత్వం— తన క్రిప్స్ రాయబారం— ద్వారా, యుద్ధానంతరం స్వాతంత్ర్యం ఇచ్చే షరతుతో, యుద్ధ ప్రయత్నాలకు భారత జాతీయవాదుల సహకారాన్ని పొందడానికి ప్రయత్నించింది; కాని, వీరికి, కాంగ్రెస్‌కి మధ్య చర్చలు విఫలమయ్యాయి. దీని ఫలితంగా బ్రిటిష్ వారు భారత్ నుంచి వెంటనే వెళ్లిపోవాలని లేదంటే జాతీయవ్యాప్తంగా సహాయ నిరాకరణను ఎదుర్కోవలసి ఉంటుందని డిమాండ్ చేస్తూ గాంధీ 1942 ఆగస్టులో "క్విట్ ఇండియా"ను ప్రారంభించారు. ఇతర కాంగ్రెస్ నేతలతోపాటు గాంధీని కూడా వెంటనే నిర్బంధించారు, విద్యార్థుల నాయకత్వంలో దేశంలో హింసాత్మక ప్రదర్శనలు చెలరేగాయి వీటిని తర్వాత ప్రత్యేకించి తూర్పు యునైటెడ్ ప్రాంతాలు, బీహార్, మరియు పశ్చిమ బెంగాల్‌లలోని రైతాంగ రాజకీయ బృందాలు చేపట్టాయి. భారత్‌లో యుద్ధకాలంలో పెద్ద సంఖ్యలో బ్రిటిష్ సైన్యం ఉనికి కారణంగా ఉద్యమం చాలా వరకు ఆరువారాల లోపే అణిచివేయబడింది;[23] కాకుంటే ఉద్యమంలో ఒక భాగం నేపాల్‌తో సరిహద్దు ప్రాంతంలో అజ్ఞాత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పర్చింది.[23] భారత్ లోని ఇతర ప్రాంతాల్లో, ఉద్యమం సహజసిద్ధంగా పెరగలేదు, నిరసనలు కూడా తీవ్రరూపంలో లేవు, కాని ఇది కూడా 1943 వేసవిలో చెదురుమదురు ఘటనలతో ముగిసిపోయింది.[24]

కాంగ్రెస్ నేతలు జైళ్లలో ఉండగా, అందరి దృష్టీ సుభాష్ బోస్ వైపు మళ్లింది, ఇతడు మరీ సాంప్రదాయికంగా ఉన్న అధినాయకత్వంతో విభేదాల కారణంగా 1939లో బహిష్కరించబడినాడు;[25] బోస్ అప్పుడు బలప్రయోగంతో భారత్‌ను విముక్తి చేయడంలో సహకరించమని కోరుతూ అక్ష రాజ్యాల వైపుకు మళ్లాడు.[26] జపాన్ సహాయంతో అతడు భారత జాతీయ కాంగ్రెస్‌ని స్థాపించాడు, ఇది చాలావరకు జపనీయులచే సింగపూర్‌లో పట్టుబడిన బ్రిటిష్ భారత సైన్యంలోని భారతీయ సైనికులతో కూడి ఉండేది. యుద్ధం ప్రారంభమైనప్పటినుంచి జపనీస్ సీక్రెట్ సర్వీస్ బ్రిటిష్ యుద్ధ ప్రయత్నాలను[27] అస్థిరపర్చటానికి ఆగ్నేయాసియాలో అశాంతిని ప్రేరేపించింది. మరియు బర్మా, ఫిలిప్పైన్స్ మరియువియత్నాం మరియు బోస్ నేతృత్వంలోని అజాద్ హింద్ (స్వతంత్ర భారత్) యొక్క తాత్కాలిక ప్రభుత్వంతో సహా, తాను చేజిక్కించుకున్న ప్రాంతాలలోని అనేక తోలుబొమ్మ, తాత్కాలిక ప్రభుత్వాలకు మద్దతు తెలుపుతూ వచ్చింది.[28] అయితే బోస్ ప్రయత్నాలు స్వల్పకాలం మాత్రమే మనగలిగాయి, 1944లో యుద్ధ పరిస్థితి తిరగబడ్డాక, 1945లో శక్తిని తిరిగి సముపార్జించుకున్న బ్రిటిష్ భారత సైన్యం, 1945లో మొదటగా U గో అపెన్సివ్ని అడ్డుకుని తర్వాత తిప్పికొట్టింది, బర్మా కేంపెయిన్‌లో విజయవంతమైన భాగానికి ఇది నాంది. బోస్ యొక్క ఇండియన్ నేషనల్ ఆర్మీ సింగపూర్ తిరిగి బ్రిటిష్ వారి స్వాధీనమవడంతో లొంగిపోయింది, బోస్ వెనువెంటనే జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. 1945 చివర్లో ఎర్రకోట వద్ద INA సైనికుల విచారణ ప్రజలలో తీవ్రంగా అశాంతిని రెచ్చగొట్టి భారత్‌లో జాతీయవాద హింసను ప్రేరేపించింది[29]

అధికార బదలాయింపుసవరించు

 
1909 వ్యాప్తిలో ఉన్న మతాలు, బ్రిటిష్ ఇండియా సామ్రాజ్య మ్యాప్, 1909, వివిధ జిల్లాల జనాభాలో వ్యాప్తిలో ఉన్న మెజారిటీ మతాలు.

1946 జనవరిలో సైనిక దళాలలో అనేక తిరుగుబాట్లు జరిగాయి. RAFలో సైనికునిగా పనిచేసున్న ఒక వ్యక్తి, తన స్వదేశానికి తిరిగి పోవడం ఆలస్యమవడం వల్ల నిరాశ చెంది తిరుగుబాటు చేయడంతో ఇవి మొదలయ్యాయి.[30] 1946 ఫిబ్రవరి, బొంబాయిలోని రాయల్ ఇండియన్ నేవీలో తిరుగుబాట్లు, కలకత్తా, మద్రాసు, కరాచీలకు వ్యాపించాయి. ఈ తిరుగుబాట్లన్నిటినీ త్వరలోనే అణచివేసినప్పటికీ, వాటికి ప్రజల మద్దతు ఉండడం వలన, అవి కొత్తగా అధికారంలోకి వచ్చిన లేబర్ ప్రభుత్వంపై ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా భారత దేశ కార్యదర్శి, లార్డ్ పెథిక్ లారెన్స్ ఆధ్వర్యంలో క్యాబినేట్ మిషన్‍ను భారత దేశానికి పంపించారు. దీనిలో అప్పటికి నాలుగు సంవత్సరాల ముందర భారత దేశాన్ని సందర్శించిన సర్ స్టాఫర్డ్ క్రిప్స్ కూడా ఉన్నాడు.[30]

1946 తొలి రోజులలో కొత్తగా జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ, మొత్తం పదకొండు ప్రాదేశికాలకుగాను, ఎనిమిదింటిని గెలుచుకున్నది.[31] దేశ విభజన విషయమై కాంగ్రేస్, ముస్లీంలీగ్‍ల నడుమ జరిగిన చర్చలు సాఫీగా సాగలేదు. బ్రిటీష్ ఇండియాలో ముస్లీముల మాతృభూమిని శాంతియుతంగా సాధించే లక్ష్యంతో 1946 ఆగస్టు16ను, జిన్నా ప్రత్యక్ష చర్యా దినంగా ప్రకటించాడు. ఆ తర్వాత రోజున కలకత్తాలో హిందూ-ముస్లీముల నడుమ అల్లర్లు చెలరేగాయి. అవి అతి త్వరగా దేశమంతటా పాకాయి. ఈ సంఘటనల పరంపరతో భారత ప్రభుత్వము, కాంగ్రేస్ పార్టీ రెండూ కదిలిపోయాయి. సెప్టంబరులో కాంగ్రేస్ ఆధ్వర్యంలో, జవహర్‌లాల్ మంత్రిగా మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది.

ఆ సంవత్సరానంతరం, అప్పుడే రెండవ ప్రపంచ యుద్ధం ముగియడంతో, అప్పటికే అలసిపోయిన బ్రిటన్ లేబర్ ప్రభుత్వము, దాని ఆర్థిక శాఖామాత్యుడు భారత దేశంలో బ్రిటీష్ పాలనకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. 1947 తొలి నాళ్ళలో అధికార బదిలీ ఉద్దేశాన్నితెలియజేస్తూ, 1948 జూన్ కన్నా ముందుగానే ఆ ప్రక్రియను ముగించనున్నట్లుగా బ్రిటన్ ప్రకటించింది

స్వాతంత్ర్యం రాబోతూ ఉన్న సమయంలోనే పంజాబ్, బెంగాల్ ప్రాదేశికాలలో హిందూ, ముస్లీంల మధ్యన ఉధృత స్థాయిలో హింస చెలరేగింది. హింసను చల్లార్చడానికి తగిన సంసిద్ధత బ్రిటీష్ సైన్యానికి లేకపోవడంతో, కొత్తగా పదవిలోకి వచ్చిన వైస్రాయ్, లూయిస్ మౌంట్‍బాటన్ స్వాతంత్ర్యం కోసం పరస్పర అంగీకార యోగ్యమైన ప్రణాళికను ఆరునెలలలోగా అమలుచేయడానికి వీలుగా అధికార బదిలీ తేదీని ముందుకు జరిపాడు. 1947 జూన్‌లో కాంగ్రేస్ పార్టీ తరుపున నెహ్రూ, అబుల్ కలామ్ ఆజాద్, ముస్లీంలీగ్ తరపున జిన్నా, అస్పృశ్య కులాల తరుపున బి.ఆర్. అంబేద్కర్, సిక్కుల తరుపున మాస్టర్ తారాసింగ్లు మత ప్రాతిపదికన దేశాన్ని విడగొట్టడానికి అంగీకరించారు. హిందువులు, సిక్కులు అధికంగా ఉన్న ప్రాంతాలు నూతన భారతదేశానికి చెందేటట్లుగా, ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాలు పాకిస్తాన్కు చెందేటట్లుగా నిర్ణయించారు. పంజాబ్, బెంగాల్‍లలో ముస్లీముల జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలను కూడా విడగొట్టాలని కూడా ఈ ప్రణాళికలో చేర్చారు.

కొత్తగా ఏర్పరచిన సరిహద్దుల గుండా మిలియన్ల సంఖ్యలో ముస్లీములు, సిక్కులు, హిందువులు పయనించారు. పంజాబ్‍లో, సిక్కుల ప్రాంతాలను కొత్తగా ఏర్పరచిన సరిహద్దు రేఖ సగానికి విడగొట్టగానే పెద్ద ఎత్తున రక్తపాతం జరిగింది. బెంగాల్‍లో గాంధీ ప్రభావంతో మత విద్వేషం తగ్గింది. హింస అతి కొద్దిగా మాత్రమే చోటు చేసుకున్నది. కొత్తగా ఏర్పడిన సరిహద్దుల కిరువైపులా జరిగిన హింసలో 2,50,000 నుండి 500,000 వరకూ ప్రజలు చనిపోయారు.[32] 1947 ఆగస్టు14న, నూతన పాకిస్తాన్ అధినివేశ రాజ్యంగా ఉనికిలోనికి వచ్చింది. దీనికి మొదటి గవర్నర్ జనరల్‍గా మహమ్మద్ ఆలీ జిన్నా కరాచీలో ప్రామాణ స్వీకారం చేసాడు. ఆ తర్వాత రోజు 1947 ఆగస్టు15న, ఇప్పుడు చిన్నగా ఉన్న భారత సమాఖ్య, కొత్తఢిల్లీలో అధికార లాంచనాలతో స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. జవహర్‌లాల్ నెహ్రూప్రధాన మంత్రి బాధ్యతలను తీసుకోగా, వైస్రాయ్, లూయిస్ మౌంట్‍బాటన్ మొదటి గవర్నర్ జనరల్‌గా కొనసాగారు.

గమనికలుసవరించు

 1. (Stein 2001, p. 259), (Oldenburg 2007)
 2. (Oldenburg 2007)(Stein 2001, p. 258)
 3. 3.0 3.1 (Oldenburg 2007)
 4. (Stein 2001, p. 258)
 5. (Stein 2001, p. 159)
 6. 6.0 6.1 6.2 (Stein 2001, p. 260)
 7. (Bose & Jalal 2003, p. 117)
 8. 8.0 8.1 8.2 8.3 Brown 1994, pp. 197–198
 9. Olympic Games Antwerp 1920: అధికారిక నివేదిక, Nombre de bations representees, p. 168. ఉల్లేఖన: "31 దేశాలు avaient accepté l'invitation du Comité Olympique Belge: ... la Grèce - la Hollande Les Indes Anglaises - l'Italie - le Japon ..."
 10. 10.0 10.1 10.2 10.3 10.4 10.5 10.6 10.7 10.8 Brown 1994, pp. 203–204
 11. 11.0 11.1 11.2 Metcalf & Metcalf 2006, p. 166
 12. 12.0 12.1 12.2 12.3 Brown 1994, pp. 201–203
 13. Lovett 1920, pp. 94, 187–191
 14. Sarkar 1921, p. 137
 15. Tinker 1968, p. 92
 16. 16.0 16.1 16.2 Spear 1990, p. 190
 17. 17.0 17.1 17.2 Brown 1994, pp. 195–196
 18. 18.0 18.1 18.2 Stein 2001, p. 304
 19. Ludden 2002, p. 208
 20. 20.0 20.1 20.2 20.3 20.4 20.5 20.6 20.7 20.8 Brown 1994, pp. 205–207
 21. (Low 1993, pp. 40, 156)
 22. 22.0 22.1 (Low 1993, p. 154)
 23. 23.0 23.1 (Metcalf & Metcalf 2006, pp. 206–207)
 24. Bandyopadhyay 2004, pp. 418–420
 25. Nehru 1942, p. 424
 26. (Low 1993, pp. 31–31)
 27. Lebra 1977, p. 23
 28. Lebra 1977, p. 31, (Low 1993, pp. 31–31)
 29. Chaudhuri 1953, p. 349, Sarkar 1983, p. 411,Hyam 2007, p. 115
 30. 30.0 30.1 (Judd 2004, pp. 172–173)
 31. (Judd 2004, p. 172)
 32. (Khosla 2001, p. 299)

సూచనలుసవరించు

సమకాలిక సాధారణ చరిత్రలుసవరించు

మోనోగ్రాఫ్‌లు మరియు సంగ్రహాలుసవరించు

పత్రికలు లేదా సంగ్రహాలలోని వ్యాసాలుసవరించు

ప్రామాణిక చరిత్రలు మరియు గెజెటీర్లుసవరించు

 • Imperial Gazetteer of India vol. IV (1907), The Indian Empire, Administrative, Published under the authority of His Majesty's Secretary of State for India in Council, Oxford at the Clarendon Press. Pp. xxx, 1 map, 552.
 • Lovett, Sir Verney (1920), A History of the Indian Nationalist Movement, New York, Frederick A. Stokes Company, ISBN 81-7536-249-9
 • Majumdar, R. C.; Raychaudhuri, H. C.; Datta, Kalikinkar (1950), An Advanced History of India, London: Macmillan and Company Limited. 2nd edition. Pp. xiii, 1122, 7 maps, 5 coloured maps..
 • Smith, Vincent A. (1921), India in the British Period: Being Part III of the Oxford History of India, Oxford: At the Clarendon Press. 2nd edition. Pp. xxiv, 316 (469-784).

మూడో వనరులుసవరించు

బాహ్య లింకులుసవరించు

వీటిని కూడా చూడండిసవరించు

 • బ్రిటిష్ రాజ్
 • భారతదేశంలో కంపెనీవారి ఆంక్షలు
 • బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ