బ్లూవేల్ లేదా బ్లూ వేల్ ఛాలెంజ్ అనునది సోషల్ మీడియా ఆధారిత ఆట.[1][2] ఇది ఆటగాళ్ళను ఆత్మహత్య చేసుకునేటట్లుగా ప్రేరేపించి వారి జీవితాన్ని బలితీసుకుంటుంది. మనదేశంలో దీనిని నిషేధించినా అనేక మంది అనధికారికంగా ఈ ఆట ఆడుతూ తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

నేపధ్యముసవరించు

బ్లూవేల్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఆడే ఆటకాదు. సాఫ్ట్‌వేర్‌ కూడా కానేకాదు. ఇంటర్నెట్‌కు ఆకర్షితులై ఒంటరితనంతో బాధపడుతున్న పిల్లలకు ప్రత్యేక స్నేహితులుగా పరిచయం చేసుకుని రహస్యంగా ఆన్‌లైన్‌ ఛాలెంజ్‌లు నిర్వహిస్తుంటారు. పిల్లలు, యువతను గుర్తించి వారిని ప్రత్యేక లింకుల ద్వారా గ్రూపులోకి తీసుకుంటున్నారు. వారు తమంతట తామే తనువు చాలించేలా గేమ్‌ పేరిట ప్రోత్సహిస్తుంటారు. 50 వరకు పోటీలు నిర్వహించి ఆత్మహత్యతో ముగిసేలా ఛాలెంజ్‌ సిద్ధం చేస్తుంటారు.

బాధితులుసవరించు

బాధితులంతా 12-19 ఏళ్లలోపు పిల్లలే. ఈ క్రీడకు ఆకర్షితులు కావడానికి మానసిక ఆందోళనే ప్రధాన కారణం. ఒత్తిడి, చదువు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మందలింపు కారణాలతో కొందరు జీవితంపై విరక్తిని పెంచుకుంటుంటారు. ఇలాంటివారు ఎవరితోనూ కలివిడిగా మాట్లాడరు. ఎప్పుడూ ఒంటరిగా గడుపుతుంటారు. ఆ ఒంటరితనాన్ని దూరం చేసుకునేందుకు ఇంటర్నెట్‌లో ఛాటింగ్‌లు చేస్తుంటారు.

ఆటలో వివిధ లక్ష్యాలుసవరించు

ఈ క్రీడలో పిల్లలకు ఇచ్చే లక్ష్యాలు (టాస్క్‌లు) హింసతో కూడుకున్నవి.

  • బ్లేడుతో చేతిపై చిత్రాలను గీసుకుంటారు. ఆంగ్ల అక్షరాలు రాసుకుంటారు. ఉదయాన్నే 4.20కి లేచి ఆన్‌లైన్‌ గ్రూపు నిర్వాహకుడు పంపించే వీడియోలు చూస్తుంటారు.
  • తిమింగలం చిత్రాన్ని కాగితాలపై వేస్తుంటారు. వాటిని ఫోన్‌ద్వారా ఫొటోలు తీస్తుంటారు. తానూ ఒక వేల్‌గా మారానుకుని కాలిపై ఎస్‌ లాంటి అక్షరాలు రాసుకుంటారు. తప్పుకోవాలని చూస్తే నిర్వాహకులు బ్లాక్‌మెయిల్‌ చేస్తుంటారు. వారికి తిరిగి తలొగ్గితే శిక్షగా చేతిపై వీలైనన్ని ఎక్కువసార్లు కోసుకోవాలి.
  • ఉదయాన్నే లేచి ఇంటి పైకప్పు వరకు వెళ్లడం, చేతిపై తిమింగలం బొమ్మను చిత్రించుకోవడం, పెదవులు కోసుకోవడం, చేతిపై గుండుసూదితో అనేకసార్లు గుచ్చుకోవడం, సొంతగా గాయపరచుకోవడం లాంటి ప్రయత్నాలు కనిపిస్తాయి.
  • వంతెనలపైకి వెళ్లడం, ఇంటి పైకప్పు చివరలో నిల్చోవడం, అక్కడే కాళ్లను ఆడించడం చేస్తారు. వివిధ రకాలైన పరీక్షల తరువాత క్రీడలో యాక్టివ్‌గా ఉన్నారో.. లేదో.. నిర్వాహకులు పరిశీలిస్తారు.
  • చివరగా ఒకరోజు క్రీడలోని బాలుడికి చావు తేదీని గ్రూపు నిర్వాహకులే ఖరారు చేస్తారు. ఉదయమే లేచి రోడ్డు, రైలు మార్గాల్లో నడవాలని చెబుతారు. ఒకరోజంతా ఎవరితోనూ మాట్లాడకుండా ఉండాలని ఆదేశిస్తారు. భయంగొలిపే వీడియోలు చూడాలని చెబుతారు. ప్రతిరోజు తన శరీరంలో ఏదో ఒక భాగంపై గాయాలు చేసుకోవాలని సూచిస్తారు. చివరగా భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకోవాలని ఆదేశిస్తారు.

మూలాలుసవరించు

  1. "Blue Whale: Should you be worried about online pressure groups?". Archived from the original on 2017-05-12.
  2. "Teen 'Suicide Games' Send Shudders Through Russian-Speaking World". RadioFreeEurope/RadioLiberty. Archived from the original on 2017-06-20. Retrieved 2017-06-23.

బయటి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=బ్లూవేల్‌&oldid=2987321" నుండి వెలికితీశారు