శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలైన అష్టమహిషులలో ఒకరు భద్ర. ఈమె శ్రుతకీర్తి అనే రాజు పుత్రిక, శ్రీకృష్ణుడికి మేనమరదలి వరుస. శ్రీకృష్ణుడు మేనరిక సంబంధం ద్వారా పెళ్ళి చేసుకున్న ఇద్దరు భార్యలలో ఈమె ఒకరు కాగా, మరొకరు మిత్రవింద.

శ్రీకృష్ణుడికి భద్రకు సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, శూరుడు, ప్రహరణుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు అనే పిల్లలు పుట్టారు.

భద్రాపరిణయంసవరించు

భద్రాదేవికి శ్రీకృష్ణునితో జరిగిన వివాహం గురించిన తెలుగు ప్రబంధం భద్రాపరిణయం లేదా ముకుందవిలాసము. దీనిని కాణాదం పెద్దన 18వ శతాబ్దంలో రచించాడు.

"https://te.wikipedia.org/w/index.php?title=భద్రాదేవి&oldid=2949100" నుండి వెలికితీశారు