భలే రంగడు 1969 ఆగస్టు 14న విడుదలైన తెలుగు సినిమా. దీనికి తాతినేని రామారావు దర్శకత్వం వహించారు.

భలే రంగడు
(1969 తెలుగు సినిమా)
దర్శకత్వం తాతినేని రామారావు
నిర్మాణం ఎన్.ఎన్.భట్
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
వాణిశ్రీ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ విజయ భట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

రాజా రాజశేఖరం ఆస్తికి ఏకైక వారసురాలు మనుమరాలు అనురాధ. అదే ఊళ్లో 30 లక్షల ఆస్తి కలిగిన అమ్మాయి తనను వరిస్తుందనే జాతకం భ్రమలో, గుండె ధైర్యంతో హుషారుగా కాలం గడుపుతుంటాడు స్థిరమైన వృత్తిలేని రంగడు. ఒకరోజు అనురాధను సముద్ర ప్రమాదంనుంచి రక్షించి ఆమె అభిమానం పొందుతాడు. రాజశేఖరం ఆస్తి వ్యవహారాలు చూసే దివాన్ తన కుమారుడు పాపాయితో అనురాధ వివాహం జరిపించి ఆస్తి కబళించాలన్న వ్యూహంలో ఉంటాడు. అతని తమ్ముడు శేషు, భీమరాజు వంటి అనుచరులతో అక్రమ వ్యాపారాలు, నేరాలు చేస్తుంటాడు. రాధకు, పాపాయికి పెళ్లి చేయటం కోసం -రాజావారి చేతిలో గుండు దెబ్బకు నౌకరు నర్సయ్య చచ్చిపోయినట్టు నాటకం ఆడించి, రాజావారికి మతిభ్రమించేలా చేస్తాడు దివాన్. రాధతో తన కొడుక్కి పెళ్లి చేయాలని రావికొండలరావు, ఆండాళ్లు, దివాన్.. ఇలా ముగ్గురూ పథకాలు, ప్రయత్నాలు చేస్తుంటారు. రాధ తన అసహాయస్థితిని రంగడికి వివరిస్తుంది. తాతగారి స్నేహితుడి కొడుకుగా రంగడు ఆమె ఇంట ప్రవేశిస్తాడు. రంగడి మేనకోడలు గంగ, రంగడు సాయంతో దుర్మార్గుల కుట్రలనుంచి తాతగారిని రక్షించుకుంటుంది రాధ. కుట్రలను బయటపెట్టి దివాన్, శేషులను పోలీసులకు అప్పగించటం, రంగడు-రాధ, గంగ -పాపాయిల పెళ్లి జరగటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది[1].

పాటలు

మార్చు
పాట రచయిత సంగీతం గాయకులు
అబ్బబ్బబ్బ చలి అహఊహుఉహూ: గిలి నీప్రేమకు కొసరాజు కె.వి.మహదేవన్ పిఠాపురం నాగేశ్వరరావు, ఎల్. ఆర్. ఈశ్వరి
ఏమిటో ఇది ఏమిటో పలుకలేని మౌనగీతి తెలియరాని అనుభూతీ ఏమిటో ఇది ఏమిటో సి.నారాయణరెడ్డి కె.వి.మహదేవన్ ఘంటసాల, పి.సుశీల
నిన్న నాదే నేడు నాదే రేపు నాదేలే ఎవరేమన్నా ఎన్నటికైనా గెలుపు దాశరథి కృష్ణమాచార్య కె.వి.మహదేవన్ ఘంటసాల
పగటికలలు కంటున్న మావయ్య గాలిమేడలెన్ని నువ్వు కట్టావయ్య కొసరాజు కె.వి.మహదేవన్ ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి
పరువు నిచ్చేది దొరను చేసేది పట్టపగ్గం లేని పదవి తెచ్చేదీ పైసా హై దేవులపల్లి కె.వి.మహదేవన్ ఘంటసాల
పైసా పైసా పైసా హైలెస్సా ఓలెస్సా .. కాసుంటే కలకటేరు దేవులపల్లి కె.వి.మహదేవన్ ఘంటసాల
మెరిసిపోయె ఎన్నెలాయే పరుపులాంటి తిన్నెలాయి నన్ను విడిసి దాశరథి కె.వి.మహదేవన్ పి.సుశీల
చేయి చేయి కలగలుపు నీది నాది తొలిగెలుపు గెలుపే మెరుపై తెలపెను బ్రతుకు బాటలో మలుపు ఆరుద్ర కె.వి.మహదేవన్ ఘంటసాల, పి.సుశీల

మూలాలు

మార్చు
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
  1. సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (10 August 2019). "ఫ్లాష్ బ్యాక్ @ 50 భలే రంగడు". ఆంధ్రభూమి దినపత్రిక. Archived from the original on 13 ఆగస్టు 2019. Retrieved 10 June 2020.

బయటి లింకులు

మార్చు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో భలే రంగడు

"https://te.wikipedia.org/w/index.php?title=భలే_రంగడు&oldid=4209398" నుండి వెలికితీశారు