భాగల్పూర్

బీహార్ రాష్ట్రం లోని పట్టణం

భాగల్పూర్ చారిత్రక ప్రాముఖ్యత కలిగిన నగరం. బీహార్ రాష్ట్రం, భాగల్పూర్ జిల్లాలో గంగా నదికి దక్షిణపు ఒడ్డున ఉంది. ఇది బీహార్ లోని 3 వ అతిపెద్ద నగరం. ఇది భాగల్పూర్ జిల్లాకు ముఖ్యపట్టణం, భాగల్పూర్ డివిజనుకు ప్రధాన కార్యాలయం. "సిల్క్ సిటీ" గా పేరున్న ఈ నగరం ఒక ప్రధాన విద్యా, వాణిజ్య, రాజకీయ కేంద్రం. స్మార్ట్ సిటీ ప్రోగ్రాం కింద అభివృద్ధి చేసే నగరాల జాబితాలో ఇది కూడా ఉంది. నగరం చుట్టూ ఉన్న గంగా మైదానాలు చాలా సారవంతమైనవి. ఇక్కడి ప్రధాన పంటలలో వరి, గోధుమ, మొక్కజొన్న, బార్లీ, నూనె గింజలు ఉన్నాయి. ఇక్కడ గంగానదిలో డాల్ఫిన్‌లు ఎక్కువగా ఉంటాయి. వీటి సంరక్షణ కోసం పట్టణానికి సమీపంలో విక్రమశిల గాంజెటిక్ డాల్ఫిన్ అభయారణ్యాన్ని స్థాపించారు.

భాగల్పూర్
నగరం
గడియార స్థంభం
గడియార స్థంభం
భాగల్పూర్ is located in Bihar
భాగల్పూర్
భాగల్పూర్
బీహార్ పటంలో నగర స్థానం
నిర్దేశాంకాలు: 25°15′N 87°0′E / 25.250°N 87.000°E / 25.250; 87.000Coordinates: 25°15′N 87°0′E / 25.250°N 87.000°E / 25.250; 87.000
దేశం India
రాష్ట్రంబీహార్
జిల్లాభాగల్పూర్
మునిసిపల్ కార్పొరేషనుభాగల్పూర్ మునిసిపల్ కార్పొరేషను
విస్తీర్ణం
 • మొత్తం30.17 కి.మీ2 (11.65 చ. మై)
విస్తీర్ణపు ర్యాంకు2nd
సముద్రమట్టం నుండి ఎత్తు52 మీ (171 అ.)
జనాభా
(2011)[1]
 • మొత్తం4,10,210[1]
భాష
 • అధికారికహిందీ[4]
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
812001-81XXXX
STD Code0641
వాహనాల నమోదు కోడ్BR-10
జాలస్థలిbhagalpurnagarnigam.in

జనాభాసవరించు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, భాగల్పూర్ నగర సముదాయ ప్రాంత జనాభా 4,10,210, వీరిలో 2,18,284 మంది పురుషులు, 1,91,926 మంది మహిళలు ఉన్నారు. పట్టణ జనాభా పరంగా ఇది బీహార్‌లో 3 వ అతిపెద్ద నగరం. ఆరేళ్ళ లోపు పిల్లల సంఖ్య 55,898. మొత్తం అక్షరాస్యుల సంఖ్య 2,86,125 కాగా, వీరిలో 1,60,720 మంది పురుషులు, 1,25,405 మంది మహిళలు. ఏడేళ్ళకు పైబడిన వారిలో అక్షరాస్యత 80.76%. ఇందులో పురుషులలో అక్షరాస్యత 84.95% కాగా, మహిళలలో ఇది 75.95%.

వాతావరణంసవరించు

Bhagalpur (1981–2010, extremes 1901–2012)-వాతావరణం
నెల జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబరు సంవత్సరం
అత్యధిక °C (°F) 31.9 35.8 42.6 45.3 46.4 46.0 42.3 39.7 38.6 40.0 37.4 32.2 46.4
(nil)
సగటు అధిక °C (°F) 23.0 27.1 33.4 37.6 37.5 36.4 33.3 33.4 33.2 32.7 29.6 24.9 31.9
సగటు అల్ప °C (°F) 12.4 15.4 20.6 24.2 26.0 27.2 26.9 26.9 26.4 23.9 19.1 14.2 21.9
అత్యల్ప °C (°F) 4.2 5.0 10.8 13.1 14.5 19.5 22.4 20.1 21.5 15.4 11.1 3.9 3.9
(nil)
వర్షపాతం mm (inches) 13.6 9.4 9.4 23.9 75.6 201.7 300.8 256.5 217.2 85.5 5.2 7.5 1206.3
స. వర్షపు రోజులు 1.1 1.2 0.9 1.8 4.7 8.9 14.0 11.7 9.6 3.4 0.5 0.7 58.5
తేమ % 70 58 47 45 55 68 78 77 77 71 67 70 65
Source: India Meteorological Department[5][6]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Office of the Registrar General & Census Commissioner, India. Archived (PDF) from the original on 17 అక్టోబరు 2013. Retrieved 12 మే 2014.
  2. "Welcome to Bhagalpur Municipal Corporation(BMC)". bhagalpurnagarnigam.in. Retrieved 22 November 2020.
  3. "Geographic coordinates of Bhagalpur, India. Latitude, longitude, and elevation above sea level of Bhagalpur". Dateandtime.info. Archived from the original on 11 May 2018. Retrieved 7 May 2016.
  4. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 4 October 2019.
  5. "Station: Bhagalpur Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 127–128. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 18 August 2020.
  6. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M32. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 18 August 2020.


"https://te.wikipedia.org/w/index.php?title=భాగల్పూర్&oldid=3121916" నుండి వెలికితీశారు