పడవ స్కంధం ⇠ ఉపోద్ఘాతము⇢ 10.1-1-క. కంద పద్యము

శ్రీకంఠచాప ఖండన! పాకారిప్రముఖ వినుత భండన! విలస త్కాకుత్స్థవంశమండన! రాకేందు యశోవిశాల! రామనృపాలా! ప్రతిపదార్ధము భావం ⇠ పరీక్షిత్తు కృష్ణలీలలడుగుట⇢ 10.1-3-క. కంద పద్యము

"తెలిపితివి సోమసూర్యుల కులవిస్తారంబు; వారి కులము ధరిత్రీ శుల నడవళ్ళును వింటిమి; కలరూపము లెల్ల మాకుఁ గడు వెఱఁగులుగన్. ప్రతిపదార్ధము భావం ⇠ పరీక్షిత్తు కృష్ణలీలలడుగుట⇢ 10.1-4-క. కంద పద్యము

శీలముగల యదుకులమున నేలా పుట్టెను మహాత్ముఁ డీశుఁడు విష్ణుం? డే లీల మెలఁగె? నెయ్యే వేళల నే మేమి చేసె? వివరింపు తగన్. ప్రతిపదార్ధము భావం ⇠ పరీక్షిత్తు కృష్ణలీలలడుగుట⇢ 10.1-5-క. కంద పద్యము

భవములకు మందు; చిత్త శ్రవణానందము; ముముక్షుజన పదము; హరి స్తవము పశుఘ్నుఁడు దక్కను జెవులకుఁ దని వయ్యె ననెడి చెనఁటియుఁ గలఁడే. ప్రతిపదార్ధము భావం ⇠ పరీక్షిత్తు కృష్ణలీలలడుగుట⇢ 10.1-6-క. కంద పద్యము

మా పెద్దలు మును వేల్పులు నోపని భీష్మాది కురుకులోత్తమ సేనా కూపారము నే కోలము ప్రాపున లంఘించి రొక్క బాలపదముగాన్. ప్రతిపదార్ధము భావం ⇠ పరీక్షిత్తు కృష్ణలీలలడుగుట⇢ 10.1-7-క. కంద పద్యము

మా యమ్మ కుక్షి గురుసుత సాయక పీడితుఁడ నైన జడు నన్నుం గౌం తేయ కురుకులము నిలుపఁగ నా యుత్తముఁ డాత్త చక్రుఁడై రక్షించెన్. ప్రతిపదార్ధము భావం ⇠ పరీక్షిత్తు కృష్ణలీలలడుగుట⇢ 10.1-7-క. కంద పద్యము

మా యమ్మ కుక్షి గురుసుత సాయక పీడితుఁడ నైన జడు నన్నుం గౌం తేయ కురుకులము నిలుపఁగ నా యుత్తముఁ డాత్త చక్రుఁడై రక్షించెన్.

⇠ పరీక్షిత్తు కృష్ణలీలలడుగుట⇢ 10.1-9-సీ. సీస పద్యము

ఊహించి రాముఁడు రోహిణి కొడు కంచు; నప్పుడు యోగీంద్ర! చెప్పి తీవు దేవకి కడుపున నే వెరవున నాతఁ; డుండెను దేహంబు నొండులేక? తన తండ్రి యిలువాసి వనజాక్షుఁ డేరీతి; మందకుఁ బోయె? నే మందిరమున నుండి యెయ్యది చేయుచుండెను? దన మేన; మామ కంసుని నేల నామ మడఁచె? 10.1-9.1-ఆ. నెన్ని యేండ్లు మనియె నిలమీఁద మనుజుఁడై? యెంద ఱైరి భార్య? లెట్లు మెలఁగె? మఱియు నేమి చేసె? మాధవు చారిత్ర మెంత గలదు? నాకు నేర్పరింపు. " ప్రతిపదార్ధము భావం ⇠ పరీక్షిత్తు కృష్ణలీలలడుగుట⇢ 10.1-10-వ. వచనము అని మఱియు ని ట్లనియె. ప్రతిపదార్ధము భావం ⇠ పరీక్షిత్తు కృష్ణలీలలడుగుట⇢ 10.1-11-ఆ. ఆటవెలది

నీ ముఖాంబుజాత నిర్ముక్త హరికథా మృతముఁ ద్రావఁ ద్రావ మేను వొదలె; వంత మానె; నీరుపట్టు నాఁకలియును దూరమయ్యె; మనము తొంగలించె. ప్రతిపదార్ధము భావం ⇠ పరీక్షిత్తు కృష్ణలీలలడుగుట⇢ 10.1-12-వ. వచనము అని పలుకుచున్న రాజు మాటలు విని, వైయాసి యిట్లనియె. ప్రతిపదార్ధము భావం ⇠ పరీక్షిత్తు కృష్ణలీలలడుగుట⇢ 10.1-13-క. కంద పద్యము

"విష్ణు కథా రతుఁ డగు నరు విష్ణుకథల్ చెప్పు నరుని వినుచుండు నరున్ విష్ణుకథా సంప్రశ్నము విష్ణుపదీ జలము భంగి విమలులఁ జేయున్. ప్రతిపదార్ధము భావం ⇠ పరీక్షిత్తు కృష్ణలీలలడుగుట⇢ 10.1-14-సీ. సీస పద్యము

రాజేంద్ర! విను తొల్లి రాజలాంఛనముల; వేలసంఖ్యల దైత్యవిభులు దన్ను నాక్రమించిన భార మాఁగఁజాలక భూమి; గోరూపయై బ్రహ్మఁ జేరఁ బోయి కన్నీరు మున్నీరుగా రోదనము సేయఁ; గరుణతో భావించి కమలభవుఁడు ధరణి నూఱడఁ బల్కి ధాత్రియు వేల్పులుఁ; గదలిరా విష్ణునిఁ గాన నేఁగి 10.1-14.1-తే. పురుష సూక్తంబుఁ జదివి యద్భుత సమాధి నుండి యొకమాట విని వారిజోద్భవుండు వినుఁడు వేల్పులు ధరయు నే విన్నయట్టి పలుకు వివరింతు నని ప్రీతిఁ బలికెఁ దెలియ. ప్రతిపదార్ధము భావం ⇠ పరీక్షిత్తు కృష్ణలీలలడుగుట⇢ 10.1-15-క. కంద పద్యము

యాదవకులమున నమరులు! మేదినిపైఁ బుట్టఁ జనుడు; మీ యంశములన్ శ్రీదయితుఁడు వసుదేవున కాదరమునఁ బుట్టి భార మంతయుఁ బాపున్. ప్రతిపదార్ధము భావం ⇠ పరీక్షిత్తు కృష్ణలీలలడుగుట⇢ 10.1-16-క. కంద పద్యము

హరి పూజార్థము పుట్టుఁడు సురకన్యలు! భూమియందు సుందరతనులై హరి కగ్రజుఁడై శేషుఁడు హరికళతోఁ బుట్టు దత్ప్రియారంభుండై. ప్రతిపదార్ధము భావం ⇠ పరీక్షిత్తు కృష్ణలీలలడుగుట⇢ 10.1-17-ఆ. ఆటవెలది

ఈ ప్రపంచ మెల్ల నే మాయచే మోహి తాత్మ యగుచు నుండు నట్టిమాయ కమలనాభు నాజ్ఞఁ గార్యార్థమై నిజాం శంబు తోడఁ బుట్టు జగతి యందు. ప్రతిపదార్ధము భావం ⇠ పరీక్షిత్తు కృష్ణలీలలడుగుట⇢ 10.1-18-వ. వచనము అని యిట్లు వేల్పుల నియ్యకొలిపి పుడమిముద్దియ నొడంబఱచి తమ్మిచూలి దన మొదలి నెలవునకుం జనియె; నంత యదు విభుం డయిన శూరసేనుం డనువాఁడు మథురాపురంబు తనకు రాజధానిగా మాథురంబులు శూరసేనంబు లనియెడు దేశంబు లేలెం; బూర్వకాలంబున. ప్రతిపదార్ధము భావం

⇠ పరీక్షిత్తు కృష్ణలీలలడుగుట⇢ 10.1-19-క. కంద పద్యము

ఏ మథుర యందుఁ నిత్యము శ్రీమన్నారాయణుండు చెలఁగుఁ బ్రియముమై నా మథుర సకల యాదవ భూమీశుల కెల్ల మొదలి పురి యయ్యె నృపా! ప్రతిపదార్ధము భావం