భాయ్ నంద్ లాల్ (1633–1713), 17శతాబ్దానికి చెందిన కవి. ఆయన పర్షియన్, అరబిక్, పంజాబీ భాషల్లో కవితలు రాశారు. గురు గోబింద్ సింగ్ దర్బార్ లోని 52 కవుల్లో ఒకరు. ఆఫ్గనిస్థాన్ లో పుట్టిన  నంద్ లాల్, ముల్తానీ ప్రాంతంలో ఉండేవారు. తరువాత పదవ సిక్కు గురువు గురు గోబింద్ సింగ్ దర్బారులో కవిగా చేరారు.

బాల్యం మార్చు

అఫ్ఘనిస్థాన్ లోని ఘజినీ ప్రాంతంలో జన్మించారు నంద్ లాల్. ఆయన తండ్రి చాజ్జు రామ్ ప్రసిద్ధ పర్షియన్ కవి, పండితుడు. ఆయన 17వ ఏట తల్లి, తరువాతి రెండేళ్ళకు తండ్రి మరణించాకా ఆయన ఘజిని ప్రాంతాన్ని వదిలి, ముల్తానీకి వెళ్ళిపోయారు. మొదట్లో వారిది హిందూ కుటుంబమే, కానీ ముల్తానీలో సిక్కు మహిళను పెళ్ళి చేసుకున్నాకా సిక్కు మతానికి ఆకర్షితులైన నంద్ లాల్ ఆ మతం స్వీకరించారు. ఆ తరువాత గురు గోబింద్ సింగ్ ను దర్శించి, వారి ఆస్థాన కవి అయ్యారు. ఆయనను భాయ్ నంద లాల్ సింగ్ అనీ, భాయ్ సాబ్ అని కూడా పిలిచేవారు.

జీవితం మార్చు

నంద్ లాల్ చిన్నతనంలోఅరబిక్, పర్షియన్ భాషలు, గణిత శాస్త్రం నేర్చుకున్నారు. ఆయన 12వ ఏట గోయా అనే కలం పేరుతో పర్షియా భాషలో కవిత్వం రాశారు. ఆయన 17వ ఏట తల్లి చనిపోయారు. తరువాతి రెండేళ్ళకు ఆయన తండ్రి కూడా మరణించారు. 1652లో ముల్తాన్ ప్రాంతానికి వెళ్ళి, అక్కడ ఒక సిక్కు మహిళను వివాహం చేసుకున్నారు. అప్పట్నుంచే సిక్కు మతంపై మక్కువ పెంచుకున్న నంద్ లాల్ 1682లో గురు గోబింద్ సింగ్ ను కలిసి, అమృతధారీ అయ్యారు. 1707లో ప్రిన్స్ మయుజ్జం వద్ద ఉద్యోగం మానేసి, గురు గోబింద్ సింగ్ దగ్గరకు వచ్చారు. ఆయన నంద్ లాల్ ను తన ఆస్థాన కవిగా తీసుకున్నారు. 1712లో బహద్దుర్ షా 1 చనిపోయిన తరువాత తిరిగి ముల్తాన్ ప్రాంతం వచ్చిన ఆయన అరబిక్, పర్షియన్ భాషలు నేర్పే పాఠశాల ప్రారంభించారు. కానీ అతి కొద్ది సమయంలోనే 1713లో ముల్తాన్ ప్రాంతంలోనే మరణించారు.

సాహిత్యం మార్చు

ఆయన రాసిన వాటిలో కొన్ని పుస్తకాలు:

  1. దీవాన్-ఎ-గోయా
  2. జిందగినామా
  3. గంజ్ నామా
  4. తంఖహ్నామా
  5. జోట్ బిగాస్
  6. అర్జ్-ఉల్-అల్ఫాజ్
  7. టౌసిఫ్-ఓ-సన
  8. ఖైమాత్
  9. దస్తూర్-ఉల్-ఇన్షా

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు