భారత జాతీయతా సూచికలు

(భారతదేశము - జాతీయ చిహ్నాలు నుండి దారిమార్పు చెందింది)

భారతదేశం జాతీయతా సూచికలు ఈ దిగువనీయబడినవి.

భారతదేశం - జాతీయ చిహ్నాలు వ్యాసాన్ని, ఈ వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)

భారతీయ జాతీయ చిహ్నాలు మార్చు

శీర్షిక చిహ్నం చిత్రం వివరం
జాతీయ పతాకం మూడు రంగుల జెండా   భారత జాతీయ పతాకంలో మూడు రంగులు అడ్డంగా ఉంటాయి. పైన ముదురు కాషాయ రంగు, మధ్యలో తెలుపు, కింద ముదురు ఆకుపచ్చ సమాన నిష్పత్తిలో ఉంటాయి. జండా పొడవు వెడల్పుల నిష్పత్తి 3:2 గా ఉంటుంది. తెలుపు పట్టీ మధ్యలో నీలపు రంగులో చక్రం ఉంటుంది. సారనాథ్‌ లోని అశోకచక్రపు ప్రతిరూపమే ఈ చక్రం. ఈ చక్రం తెలుపు పట్టీ అంత వ్యాసంతో ఉండి, 24 ఆకులు కలిగి ఉంటుంది. ఈ జాతీయ పతాక నమూనాను రాజ్యాంగ సభ 1947 జూలై 22 న ఆమోదించి స్వీకరించింది.రూపొందించిన వారు పింగళి వెంకయ్య.
జాతీయగీతం జనగణమన (జనగణ మన అధినాయక జయహే.......") దీన్ని రవీంద్ర నాద్ టాగూర్ రచించాడు.
జాతీయగేయం వందేమాతరం దీనిని బంకించంద్ చటర్జీ రచించారు.
ప్రతిజ్ఞ
భారత జాతీయ చిహ్నం మూడు సింహాల చిహ్నం   దీనిని సారనాద్ లోని అశోకుని స్థంబం నుండి గ్రహించారు.
జాతీయ జంతువు పెద్దపులి  
జాతీయ పక్షి: నెమలి  
జాతీయ పుష్పం కలువ పువ్వు  
జాతీయ వృక్షం మర్రిచెట్టు  
జాతీయ ఫలం మామిడి   భారతదేశంలో, వివిధ పరిమాణాలు, ఆకారాలు రంగులలో 100 రకాల మామిడి పండ్లు ఉన్నాయి. మామిడి పండ్లను భారతదేశంలో ఎప్పటి నుంచో సాగు చేస్తున్నారు. కవి కాళిదాసు దానిని కీర్తించాడు. దాని రుచిని అలెగ్జాండర్, చైనీస్ యాత్రికుడు హ్యూన్ త్సాంగ్ లాగా ఆస్వాదించాడు. మొఘల్ చక్రవర్తి అక్బర్ 1,00,000 మామిడి చెట్లను బీహార్‌లోని దర్భంగాలో ఇప్పుడు లఖీ బాగ్ అని పిలవబడే ప్రదేశంలో నాటాడు..[1]
జాతీయ భాషలు 22 1. అస్సామీ, 2. బెంగాలి, 3. గుజరాతీ. 4. హిందీ., 5.కన్నడ., 6.కాశ్మీరి., 7.కొంకణి., 8. మళయాళం:, 9. మరాఠీ., 10. మణిపురి., 11. నేపాలి. 12. ఒరియా., 13. పంజాబి., 14. సంస్కృతం; 15. సింధి., 16., తమిళం, 17. తెలుగు, 18. ఉర్దూ 19. మిథలి, 20. సంథాలి, 21. బోడో. 22. డోగ్రీ
జాతీయ కరెన్సీ గుర్తు ఇండియన్ రూపీ   దేవనాగరి లిపిలోని (Ra) అక్షరం, రోమన్ లిపిలోని R అక్షరాల మిళితం. 2010 జూలై 15 న భారత ప్రభుత్వం ఈ గుర్తును అధికారికంగా స్వీకరించింది. దీనిని ఐ.ఐ.టి ముంబైకు చెందిన ఉదయకుమార్ రూపొందించాడు.భారత ఆర్థిక శాఖ జరిపిన పోటినుంచి ఈ గుర్తును ఎన్నిక చేశారు.[2]
జాతీయ క్రీడ హాకీ   అనధికారిక

ప్రతి దేశానికి కొన్ని ప్రత్యేక చిహ్నాలున్నట్లే మనదేశానికి కూడా ప్రత్యేక చిహ్నాలున్నాయి

జాతీయ పతాకం మార్చు

త్రివర్ణ పతాకంగా పిల్వబడుతున్న మన దేశ జాతీయ పతాకంలో అడ్డంగా 3 రంగులుండి మధ్యలో ధర్మచక్రం కల్గు ఉంటుంది. పైన కషాయం, మధ్యలో తెలుపు, క్రింద ఆకుపచ్చ రంగులను కల్గి 24 ఆకులు కల ధర్మ చక్రం నీలపు రంగులో ఉంటుంది. పతాకపు పొడువు, వెడల్పులు 3:2 నిష్పత్తిలో ఉండి ధర్మ చక్రం పైన ఉండే కషాయం రంగుకు, క్రిందనుండే ఆకుపచ్చ రంగుకు తాకుతూ ఉంటుంది. పైన ఉండే కషాయం రంగు సాహసం, త్యాగానికి చిహ్నం, మధ్యలో ఉండే తెలుపు రంగు శాంతి, స్వచ్ఛతలకు గుర్తు, చివరన ఉండే ఆకుపచ్చ రంగు విశ్వాసానికి చిహ్నం. ధర్మ చక్రం నిరంతరాయమైన చలనానికి చిహ్నం.

జాతీయ ముద్ర మార్చు

సారనాథ్ లోని అశోక చక్రవర్తి చెక్కించిన 4 తలల సింహపు చిహ్నమే మనదేశ జాతీయ చిహ్నం. సారనాథ్ స్థూపంలో వాస్తవానికి 4 సింహాల స్థూపం ఉన్ననూ మనకు బొమ్మలో వెనక వైపు మరో తల కన్పించక 3 తలలే దర్శనమిస్తాయి. సింహాల క్రింద పీటం మధ్యలో ఒక చక్రం ఉంటుంది. జాతీయ పతాకంలో ఉన్నది ఈ చక్రమే. ఈ చక్రానికి కుడివైపున వృషభ చిహ్నం, ఎడమ వైపున గుర్రపు చిహ్నం ఉన్నాయి. పీటం అడుగున సత్యమేవ జయతే అనే అక్షరాలు దేవనాగరి లిపిలో కన్పిస్తాయి. సత్యమే జయించును అని దీని భావం.

భారత రాజ్యాంగం అసలు కాపీని అందంగా తీర్చిదిద్దే పనిని కాంగ్రెస్ నందలాల్ బోస్ (అప్పటి శాంతినికేతన్ లోని కళా భవన్ శాంతి నికేతన్ ప్రిన్సిపాల్) కు ఇచ్చింది. బోస్ తన విద్యార్థుల సహాయంతో ఈ పనిని పూర్తి చేయడానికి బయలుదేరాడు, వారిలో ఒకరు 21 సంవత్సరాల వయసున్న దిననాథ్ భార్గవ. అశోక లయన్ కాపిటల్ ను రాజ్యాంగం యొక్క ప్రారంభ పేజీలలో చేర్చడానికి బోస్ ఆసక్తి చూపించాడు. సింహాలను వాస్తవికంగా చిత్రీకరించాలని కోరుకుంటూ, కోల్‌కతా జంతుప్రదర్శనశాలలో సింహాల ప్రవర్తనను అధ్యయనం చేసిన భార్గవను ఎన్నుకున్నాడు.

జాతీయ గీతం మార్చు

జాతీయ గేయం మార్చు

జాతీయ సెలవలు మార్చు

  • డా. బి ఆర్ అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14)

జాతీయ భాష మార్చు

భారతదేశానికి జాతీయ భాషగా ఏ భాష లేదు. కేవలం అధికార భాషగా ఆంగ్లం, హిందీ ఉన్నాయి. అనగా వీటిని కేవలం ప్రభుత్వం సందేశాలకి వాడుతుంది. అంతే కానీ ఇవే జాతీయ భాషలు కావు. పైగా ప్రతి రాష్ట్రానికి అధికారిక భాషలు వేరు వేరుగా ఉన్నాయి.

జాతీయ పక్షి మార్చు

భారతదేశ జాతీయ పక్షి నెమలి.

ఇండియన్ పీఫౌల్ అని పిలువబడే నెమలి 1963 నుండి భారతదేశ జాతీయ పక్షిగా పరిగణించబడుతుంది. పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన సూచనా ద్వారా ఇది ధృవీకరించబడింది.

టోక్యోలో ‘ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ బర్డ్ ప్రిజర్వేషన్’ పన్నెండవ సమావేశం 1960 మే లో జరిగింది. ఇక్కడే ప్రతి దేశంకు జాతీయ పక్షిను నియమించాలనే ఆలోచన సిఫార్సు చేయబడింది.

సారుస్ క్రేన్, స్వాన్ (హంస), గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, బ్రహ్మీని కైట్, గరుడ పక్షి మొదలైన ఇతర పక్షులు కొన్ని జాతీయ పక్షి గౌరవాన్ని కొరకు పోటీ పడ్డాయి. నేషనల్ బర్డ్ ఎంచుకోవడానికి ప్రమాణాలు:

  1. జాతీయ ఉనికిని కలిగి ఉండటం అంటే దేశవ్యాప్తంగా విస్తృతంగా వీటి సంఖ్య వ్యాపించబడి ఉండాలి అంతే కాకుండా సామాన్యులు సైతం వీటిని సులభంగానే గుర్తించగలగాలి.
  2. ప్రభుత్వ ప్రచురణలపై నైరూప్య కళ తేవగలగాలి.
  3. ఇతర దేశాల జాతీయ పక్షులతో అయోమయం చెందనీయకుండా ప్రత్యేకంగా ఉండాలి.

నిజానికి టోక్యోలో జరిగిన సమావేశంలో ఇచ్చిన ఈ ఆలోచన అసలు ఉద్దేశ్యం ఆ దేశంలో చాలా రక్షణ అవసరాన్ని ఉన్న కొన్ని ప్రత్యేక పక్షి జాతుల పట్ల ప్రజల ఆసక్తి, దృష్టిని తీసుకెళ్లడం. జాతీయ పక్షి నిర్ధారణ కేవలం ఈ పరిశీలనపై మాత్రమే ఆధారపడి తీసుకోవాలిసినది అని విఖ్యాత పక్షిశాస్త్రవేత్త డాక్టర్ సలీం అలీ అభిప్రాయపడుతూ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్‌ను భారతదేశపు ‘జాతీయ పక్షి’ గా సిఫారసు చేశారు. కానీ దాని పేరు వినే సామాన్యులకు 'మనకు భారతీయ పక్షి ఉన్నప్పుడు, బాస్టర్డ్ కోసం ఎందుకు వెళ్ళాలి'? అనే ప్రశ్న వస్తుందేమో అని ఆ పక్షిని ఎంచుకో లేదు.

నెమలి వాళ్ళ ప్రమాణాలన్నింటికీ సరిపోయింది. ఇంకా, నెమలి భారతీయ పురాణాలు, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలలో ముఖ్యమైన భాగం కనుక వాళ్ళు నెమలిని ఎంచుకున్నారు.

జాతీయ జంతువు మార్చు

  • బెంగాల్ టైగ్రిస్ పులి.

1948 లో గుజరాత్ నేచురల్ హిస్టరీ సొసైటీ చేసిన ఒక ఉద్యమం పండిట్ జవహర్‌లాల్ నెహ్రూను ఆసియా సింహాన్ని జాతీయ జంతువుగా ప్రకటించవలసి వచ్చింది. కానీ 1972 లో, భారత వన్యప్రాణి బోర్డు సమావేశంలో బెంగాల్ పులిని జాతీయ జంతువుగా స్వీకరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతయినా పులి దేశంలోని 16 రాష్ట్రాలలో ఉండగా, ఆసియా సింహం గుజరాత్‌లోని గిర్‌లో మాత్రమే ఉండడమే దీని ప్రధాన కారణం. వేట కారణంగా పులి జనాభా తగ్గుముఖం పట్టడంతో, దీనిని జాతీయ జంతువుగా ప్రకటించడం ప్రజావగాహన పెంచడానికి, దాని పరిరక్షణకు సహాయపడుతుంది అని ఇంకా పులి భారతదేశం యొక్క వన్యప్రాణుల సంపదకు చిహ్నం అని కూడా కొన్ని కారణాలు.

జాతీయ పుష్పం మార్చు

  • తామర పువ్వు

జాతీయ క్రీడ మార్చు

  • హాకి

జాతీయ వృక్షం మార్చు

  • మర్రి చెట్టు

జాతీయ క్యాలెండరు మార్చు

భారతదేశ జాతీయ క్యాలెండర్ శక క్యాలెండర్.

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో 1952 లో భారత ప్రభుత్వం నియమించిన క్యాలెండర్ సంస్కరణ కమిటీకి మేఘనాధ్ సాహా చైర్మన్ గా నియుక్తులయ్యారు. సాహా యొక్క ప్రయత్నం కమిటీ ఏర్పాటుకు దారితీసింది. భారతదేశం అంతటా శాస్త్రీయ అధ్యయనం ఆధారంగా ఒకే విధంగా అవలంబించగల ఖచ్చితమైన పంచాంగం‌ను సిద్ధం చేయడం కమిటీ ముందు ఉన్న పని. ఇది పెద్ద పని. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రబలంగా ఉన్న వివిధ పంచాంగాలపై కమిటీ సమగ్ర అధ్యయనం చేపట్టాల్సి వచ్చింది. అలాంటివి ముప్పై వేర్వేరు క్యాలెండర్లు ఉన్నాయి. ప్రతి పంచాంగానికి మత, స్థానిక మనోభావాలతో సంబంధం ఉండటం వలన ఈ పని మరింత వారికీ క్లిష్టంగా మారింది. 1955లో ప్రచురించబడిన కమిటీ నివేదికకు నెహ్రూ తన ముందుమాటలో ఇలా వ్రాశారు: “అవి (వేర్వేరు క్యాలెండర్లు) దేశంలోని గత రాజకీయ విభజనలను సూచిస్తున్నాయి… ఇప్పుడు మనం స్వాతంత్ర్యం పొందాము, స్పష్టంగా చుస్తే మనకు మన పౌర, సామాజిక, ఇతర ప్రయోజనాల కోసం పంచాంగంలో ఏకరీతి ఉండాలి. ఈ సమస్యను శాస్త్రీయ విధానమే తొలిగిస్తుంది. ” కమిటీ చివరగా వీటిని ముఖ్య మార్గదర్శక సూత్రాలుగా నిర్ణయించుకుంది.

1.ఏకీకృత జాతీయ క్యాలెండర్ శక శకాన్ని ఉపయోగించాలి. (2020 సంవత్సరం ౧౯౪౧-1942 యొక్క శక శకానికి అనుగుణంగా ఉంటుంది.) అంటే డెబ్బయి ఎనిమిది ఏళ్ళు వెనుక.

2.సంవత్సరం మేషసంక్రాంతి/ వసంతారంభము నుంచి (మార్చి 21 గురించి జరుగుతుంది) ప్రారంభం కావాలి.

౩. సాధారణంగా సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి, లీపువత్సరములో 366 రోజులు ఉంటుంది. మొత్తం ఉంటే, శక యుగానికి డెబ్బై ఎనిమిది జోడించిన తరువాత నాలుగు ద్వారా భాగించగలిగితే అప్పుడు అది లీపువత్సరము. అదే 100 యొక్క గుణకం అయి అది 400 ద్వారా కూడా భాగించబడినప్పుడు అది లీపువత్సరము అవుతుంది, లేకుంటే అది సాధారణ సంవత్సరం అవుతుంది.

4. సంవత్సరంలో మొదటి నెల చైత్రనే ఉండాలి. చైత్ర నుండి భాద్రపదం వరకు ప్రతి నెలా ముప్పై ఒకటి రోజులు, మిగితా నెల ముప్పై రోజులు ఉంటాయి.

జాతీయ ఫలం మార్చు

  • మామిడిపండు

మూలాలు మార్చు

  1. https://police.py.gov.in/Re-Notification%20of%20Tiger%20and%20Peocock%20as%20National%20animal%20and%20bird.PDF#page=2
  1. "National Fruit". Government of India. Archived from the original on 22 January 2013. Retrieved 3 April 2012.
  2. "Currency Symbol". Government of India. Archived from the original on 22 January 2013. Retrieved 12 November 2012.

యితర లింకులు మార్చు