భారతీయ మహిళా ముఖ్యమంత్రుల జాబితా
భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు 2018 నాటికి మొత్తంగా 16 మంది మహిళలు ముఖ్యమంత్రులుగా పనిచేశారు.[1] ప్రస్తుతం వారిలో వసుంధరా రాజే, మమతా బెనర్జీ, మెహబూబా ముఫ్తీలు ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు. ఈ 13 రాష్ట్రాల్లో కేవలం ఒకసారే మహిళా ముఖ్యమంత్రులు ఎన్నిక అవ్వగా, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్లలో రెండుసార్లు మహిళా అభ్యర్థులు ఎన్నికవడం విశేషం. ఈ పదహారు మంది మహిళా ముఖ్యమంత్రుల్లో కాంగ్రెస్కు చెందిన వారు అయిదుగురు, బిజెపి ముఖ్యంత్రులు నలుగురు, ఇద్దరు ఏఐడిఎంకె కు చెందినవారు ఉన్నారు. భారతదేశ మొట్ట మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేతా కృపలానీ 1963-67 వరకు అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుచేతా కృపలానీ నైపుణ్యం, పారదర్శక పరిపాలనను నిరూపించారు. తన పదవీ కాలం లో దిగజారిపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నియంత్రించింది. రాష్ట్ర ఉద్యోగులు వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ 62 రోజుల సమ్మె నిర్వహించారు. కృపలానీ తన నిర్ణయంలో దృఢంగా ఉండి, కార్మికులు రాజీకి సిద్ధంగా ఉన్నప్పుడు వారి అభ్యర్థనను అంగీకరించినట్లు భావిస్తున్నారు[2] . సుచేతా కృపలానీ రాజకీయ జీవితములో ఆమె అఖిల భారత మహిళా కాంగ్రెస్ ను స్థాపించారు. 1949లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి ప్రతినిధిగా ఉన్న ఆమె 1961లో అంతర్జాతీయ కార్మిక సంస్థకు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. 1971లో సుచేతకృపలానీ రాజకీయాల నుంచి విరమించారు. ఆమె 1974లో మరణించింది. సుచేతకృపలానీ స్వతంత్ర గణతంత్రానికి అంకితమైన జీవితం.
మహిళా ముఖ్యమంత్రుల జాబితా మార్చు
- సూచీ
- * ప్రస్తుతం పదవిలో ఉన్నవారు
- † పదవిలో ఉండగా మరణించినవారు
క్ర.సం | పేరు | చిత్రం | రాష్ట్రం | టర్మ్ | పదవి కాలం (రోజులలో ) | పార్టీ | |
---|---|---|---|---|---|---|---|
1 | సుచేతా కృపలానీ
(25 జూన్ 1908 – 1 డిసెంబరు 1974) |
ఉత్తర ప్రదేశ్ | 2 అక్టోబరు 1963 – 13 మార్చి 1967 | 1258 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
2 | నందిని సత్పతీ
(9 జూన్ 1931 – 4 ఆగస్టు 2006) |
ఒడిశా | 14 జూన్ 1972 – 3 మార్చి 1973
6 మార్చి 1974 – 16 డిసెంబరు 1976 |
1278 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
3 | శశికళ కకొడ్కర్
(7 జనవరి 1935 – 28 అక్టోబరు 2016) |
గోవా | 12 ఆగస్టు 1973 – 27 ఏప్రిల్ 1979 | 2084 | మహారాష్ట్రవాదీ గోమాంతక్ పార్టీ | ||
4 | అన్వారా తైమూరు
(24 నవంబరు 1936 – 28 సెప్టెంబరు 2020) |
అసోం | 6 డిసెంబరు 1980 – 30 జూన్ 1981 | 206 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
5 | వి.ఎన్.జానకి రామచంద్రన్
(30 నవంబరు 1923 – 19 మే 1996) |
తమిళనాడు | 7 జనవరి 1988 – 30 జనవరి 1988 | 23 | ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం | ||
6 | జె. జయలలిత
(24 ఫిబ్రవరి 1948 – 5 డిసెంబరు 2016) |
తమిళనాడు | 24 జూన్ 1991 – 12 మే 1996
14 మే 2001 – 21 సెప్టెంబరు 2001 2 మార్చి 2002 – 12 మే 2006 16 మే 2011 – 27 సెప్టెంబరు 2014 23 మే 2015 – 5 డిసెంబరు 2016[†] |
5238 | ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం | ||
7 | మాయావతి
(b. 15 జనవరి 1956) |
ఉత్తర ప్రదేశ్ | 13 జూన్ 1995 – 18 అక్టోబరు 1995
21 మార్చి 1997 – 21 సెప్టెంబరు 1997 3 మే 2002 – 29 ఆగస్టు 2003 13 మే 2007 – 15 మార్చి 2012 |
2562 | బహుజన్ సమాజ్ పార్టీ | ||
8 | రాజేంద్ర కౌర్ భట్టల్
(b. 30 సెప్టెంబరు 1945) |
పంజాబ్ | 21 నవంబరు 1996 – 12 ఫిబ్రవరి 1997 | 83 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
9 | రబ్రీదేవి
(b. 1 జనవరి 1959) |
బీహార్ | 25 జూలై 1997 – 11 ఫిబ్రవరి 1999
9 మార్చి 1999 – 2 మార్చి 2000 11 మార్చి 2000 – 6 మార్చి 2005 |
2746 | రాష్ట్రీయ జనతాదళ్ | ||
10 | సుష్మాస్వరాజ్
(14 ఫిబ్రవరి 1953 – 6 ఆగస్టు 2019) |
ఢిల్లీ | 13 అక్టోబరు 1998 – 3 డిసెంబరు 1998 | 51 | భారతీయ జనతా పార్టీ | ||
11 | షీలా దీక్షిత్
(31 మార్చి 1938 – 20 జూలై 2019) |
ఢిల్లీ | 4 డిసెంబరు 1998 – 27 డిసెంబరు 2013 | 5502 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
12 | ఉమాభారతి
(b. 3 మే 1959) |
మధ్యప్రదేశ్ | 8 డిసెంబరు 2003 – 23 ఆగస్టు 2004 | 259 | భారతీయ జనతా పార్టీ | ||
13 | వసుంధర రాజే
(b. 8 మార్చి 1953) |
రాజస్థాన్ | 8 డిసెంబరు 2003 – 18 డిసెంబరు 2008
8 డిసెంబరు 2013 – 17 డిసెంబరు 2018 |
3667 | భారతీయ జనతా పార్టీ | ||
14 | మమతా బెనర్జీ
(b. 5 జనవరి 1955) |
పశ్చిమ బెంగాల్ | 20 మే 2011 – present | 4708 | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ | ||
15 | ఆనందిబెన్ పటేల్
(b. 21 నవంబరు 1941) |
గుజరాత్ | 22 మే 2014 – 7 ఆగస్టు 2016 | 808 | భారతీయ జనతా పార్టీ | ||
16 | మెహబూబా ముఫ్తీ
(b. 22 మే 1959) |
జమ్మూ, కాశ్మీర్ | 4 ఏప్రిల్ 2016 – 20 జూన్ 2018 | 807 | జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ |
మూలాలు మార్చు
- ↑ "From Sucheta Kriplani to Mehbooba Mufti: List of women chief ministers in India". livemint.com/. Archived from the original on 23 ఏప్రిల్ 2021. Retrieved 23 April 2021.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Sucheta Kripalani: India's first woman chief minister, chartered her own independent course". indianexpress.com/. Archived from the original on 23 ఏప్రిల్ 2021. Retrieved 23 April 2021.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)