భారతీ సింగ్

పంజాబీ టెలివిజన్, సినిమా నటి.

భారతీ సింగ్, [1] పంజాబీ టెలివిజన్, సినిమా నటి. కామెడీ షోలు, వివిధ అవార్డు షోలను హోస్ట్ చేసింది. ఝలక్ దిఖ్లా జా[3] (2012), నాచ్ బలియే 8[4] (2017), ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 9[5] (2019) వంటి ఆమె రియాల్టీ షోలలో పాల్గొన్నది.

భారతీ సింగ్
భారతీ సింగ్ (2017)
జననం (1984-07-03) 1984 జూలై 3 (వయసు 39)[1]
వృత్తినటి
జీవిత భాగస్వామిహర్ష్ లింబాచియా (2017)[2]
పిల్లలు1

జననం, విద్య మార్చు

భారతీ సింగ్ 1984, జూలై 3న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించింది. పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తిచేసి, తరువాత బిఏ డిగ్రీని సంపాదించింది. పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీ నుండి చరిత్రలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది.[6]

వ్యక్తిగత జీవితం మార్చు

2017 డిసెంబరు 3న రచయిత హర్ష్ లింబాచియాతో భారతి వివాహం జరిగింది.[2] ఆర్చరీ, పిస్టల్ షూటింగ్‌లో కూడా సింగ్ జాతీయ స్థాయిలో ర్యాంక్ సాధించాడు.[7]

సినిమాలు మార్చు

సంవత్సరం పేరు భాష
2011 ఏక్ నూర్ పంజాబీ
2012 యమ్లే జట్ట్ యమ్లే
ఖిలాడీ 786 హిందీ, పంజాబీ
2013 జాట్ & జూలియట్ 2 పంజాబీ
రంగన్ స్టైల్ కన్నడ
2014 ముండేయన్ టన్ బచ్కే రహిన్ పంజాబీ
2016 సనమ్ రే హిందీ

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Happy Birthday Bharti Singh: A woman who lives life queen size". 4 July 2018.
  2. 2.0 2.1 "Bharti Singh and Haarsh Limbachiyaa are wife and husband now. See pics and videos". 3 December 2017.
  3. "Bharti Singh eliminated from Jhalak Dikhhla Jaa". Retrieved 2022-04-14.
  4. "Nach Baliye 8 contestants: From Bharti-Harsh, Divyanka-Vivek to Sanaya-Mohit, Dipika-Shoaib; Get the final names of celebrity couples participating on Star Plus dance reality show". 30 March 2017.
  5. "Khatron Ke Khiladi 9: From Shamita Shetty to Bharti Singh, here are the confirmed list of contestants". 12 July 2018.
  6. "Bharti Singh, who lost her dad at two, says she has no photos of him at home: 'I don't allow anyone to put them up'". Hindustan Times (in ఇంగ్లీష్). 14 July 2021. Retrieved 2022-04-14.
  7. "Brave move". The Hindu. 14 June 2012.

బయటి లింకులు మార్చు