భారతదేశం - ప్రధాన పర్వత శిఖరాలు

(భారత దేశము - ప్రధాన పర్వత శిఖరాలు నుండి దారిమార్పు చెందింది)

పర్వతం అనగా భూమిపై అతి ఎత్తుగా పైకి చొచ్చుక వచ్చిన భూభాగం అని స్థూలంగా చెప్పవచ్చు. ఎత్తైన దాని శిఖరమే పర్వత శిఖరం. ఇవి వాటి పరిమాణాన్ని బట్టి ఆకారాన్ని బట్టి చిన్న పెడ్డ తేడాలుంటాయి. అతి పెద్దది పర్వత మైతే, దాని తర్వాతది కొండ, ఆతర్వాత గుట్ట. చిన్న దానిని తిప్ప అని అంటారు. ఏ దేశంలోనైనాపర్వతాలు, కొండలు కలసి ఆదేశపు ఎక్కువ భూభాగాన్ని ఆక్రమించి వుంటాయి. ఈ పర్వతాలు జీవనదులకు పుట్టిళ్ళు, వనమూలికలకు నిలయాలు, అరణ్యాలకు ఆవాసాలు, ఖనిజ సంపదకు మూలాలు. పురాణ కాలంనుండి ఈ పర్వతాలతో రాజులకు, రాజకీయాలకు, మతాలకు, ఆద్యాత్మికతకు, నాగరికతకు అవినాభావ సంబందం ఉంది. ఇవి ప్రకృతి మానవాళికి ప్రసాదించిన విహార కేంద్రాలు. ఇలాంటి పర్వత శిఖరాలు భారత దేశంలో అనేకం ఉన్నాయి. ప్రధాన మైన పర్వత శిఖరాలు వాటి ఎత్తును బట్టి వరుసగా:................

కాంచన్ గంగా పర్వత శిఖరం
పర్వత శిఖరం...................... ఎత్తు మీటర్లలో
  1. K2 (గాడ్విన్ ఆస్టిన్)............... 8611
  2. కాంచన గంగ......................... 8598
  3. నంద ప్రభాత్......................... 8128
  4. గాషేర్ బ్రం ........................... 8068
  5. బ్రాడ్ శిఖరం.......................... 8047
  6. డిస్త్మెఫిలిల్ సార్.................... 7885
  7. మషేర్ బ్రం (E)...................... 7821
  8. నందాదేవి............................. 7817
  9. మషేర్ బ్రం (W)..................... 7806
  10. రాక్ పోషీ............................... 7788
  11. కామెట్................................ 7756
  12. ససేర్ కాంగ్రీ............................ 7672
  13. స్కాంగ్ కాంగ్రీ........................... 7544
  14. సియా కాంగ్రీ.......................... 7422
  15. బదరీ నాథ్ శిఖరం (చుకాంబా)..... 7338
  16. త్రిశూల్ (పశ్చిమం).................... 7138
  17. సుంకున్................................ 7135
  18. పౌహున్రీ................................ 7128
  19. కాంగ్టో................................... 7090
  20. దూనగిరి................................ 7066

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు