భారత రక్షణ దళాలు

సంయుక్త భారత సాయుధ రక్షణ దళాలు
(భారత రక్షణ వ్యవస్థ నుండి దారిమార్పు చెందింది)

భారత సాయుధ దళాలు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా యొక్క సైనిక దళాలు. ఇది మూడు వృత్తిపరమైన యూనిఫాం సేవలను కలిగి ఉంటుంది: భారత సైన్యం, ఇండియన్ నేవీ, భారత వైమానిక దళం. అదనంగా, భారత సాయుధ దళాలకు సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్, అస్సాం రైఫిల్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్, స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్, అండమాన్, నికోబార్ కమాండ్, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ వంటి వివిధ ఇంటర్-సర్వీస్ కమాండ్‌లు, సంస్థలు మద్దతు ఇస్తున్నాయి. . భారత రాష్ట్రపతి భారత సాయుధ దళాలకు సుప్రీం కమాండర్ అయితే జాతీయ భద్రతకు సంబంధించిన కార్యనిర్వాహక అధికారం, బాధ్యత భారత ప్రధానమంత్రి, వారి ఎంపిక చేసిన క్యాబినెట్ మంత్రులకు అప్పగించబడింది. భారత సాయుధ దళాలు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహణలో ఉన్నాయి. 1.4 మిలియన్లకు పైగా క్రియాశీల సిబ్బంది బలంతో, ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సైనిక దళం, ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సైన్యాన్ని కలిగి ఉంది. ఇది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద రక్షణ బడ్జెట్‌ను కూడా కలిగి ఉంది. గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ నివేదిక దీనిని నాల్గవ అత్యంత శక్తివంతమైన మిలిటరీగా పేర్కొంది.

భారతదేశం సైనిక దళాలు
भारतीय सशस्‍त्र सेनाएँ
భారతీయ సాయుధ బలగాలు
Emblem of Indian Armed Forces
Emblem of Indian Armed Forces
శాఖలుIndian Army seal Indian Army
Indian Navy seal Indian Navy
Indian Air Force Seal Indian Air Force
ప్రధాన కార్యాలయంఢిల్లీ
Leadership
సర్వ సైన్యాధ్యక్షుడురాష్ట్రపతి ద్రౌపతి ముర్ము
Minister of DefenceManohar Parrikar
Chairman of the Chiefs of Staff Committeeఎయిర్ ఛీఫ్ మార్షల్ అరూప్ రాహా[1][2]
Manpower
ఉద్యోగార్హత  వయసు18[3]
తప్పనిసరి సైనికోద్యోగంలేదు
పని చేస్తున్న ఉద్యోగులు1,481,953[4] (ranked 3rd)
రిజర్వు ఉద్యోగులు1,155,000[5]
Expenditures
బడ్జెట్టుFY 2016: US$51.3 billion (ranked 6th)[6] (excl. Paramilitary and CAPF)
స్థూల జాతీయోత్పత్తిలో శాతంFY 2016: 2%
Industry
దేశీయ సరఫరాదారులుభారత ఆర్డినెన్స్ కర్మాగారాలు
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్
భారత్ డైనమిక్స్ లిమిటెడ్
మజగాన్ డాక్స్ లిమిటెడ్
గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్
గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్
మిశ్ర ధాతు నిగమ్[7]
విదేశీ సరఫరాదారులుమూస:Country data రష్యా[8]
 Israel[8]
మూస:Country data ఫ్రాన్స్[8]
మూస:Country data అమెరికా[8]
మూస:Country data చెక్ రిపబ్లిక్[9]
వార్షిక దిగుమతులుUS$ 24 billion (2000–2011)[10][11][12]
వార్షిక ఎగుమతులుUS$ 167 million (2000–2011)[10]
US$ 184 million (2010–12)[13]  Afghanistan
 Maldives
 Nepal
 Bhutan
 Israel
 Oman
Related articles
చరిత్రMilitary history of India
Presidency armies
British Indian Army
భారత సైన్యం
ర్యాంకులుArmy
Air Force
Navy

భారత సైనిక బలగాలలో 3 ప్రధాన విభాగాలున్నాయి.[14]:[15]

14 లక్షల పైబడిన సైన్యంతో,[16] భారత రక్షణ బలగాలు ప్రపంచంలోకెల్లా మూడవ అతిపెద్ద సైన్యం.[17] ఈ దళాలన్నిటికీ సర్వసైన్యాధ్యక్షుడు, భారత రాష్ట్రపతి. ఈ సైనిక దళాల నిర్వహణ భారత ప్రభుత్వపు రక్షణ మంత్రిత్వ శాఖ చూస్తుంది. పై మూడు ప్రధాన దళాలకు వాటివాటి అధిపతులు ఉండగా, మూడింటినీ సమన్వయ పరుస్తూ సంయుక్త ప్రధాన సైన్యాధికారి ఉంటారు. త్రివిధ దళాధిపతులు ముగ్గురిలోకీ సీనియరు అధికారి ఈ బాధ్యతలు నిర్వహిస్తారు.

ప్రధానమైన పై మూడు దళాలతో పాటు తీర రక్షక దళం, ఇతర పారామిలిటరీ దళాలు కూడా రక్షణ దళాలలో భాగంగా ఉన్నాయి.[18] వ్యూహాత్మక బలగాల కమాండ్, అండమాన్, నికోబార్ కమాండ్ వంటి ప్రత్యేక కమాండ్లు కూడా భారత రక్షణ వ్యవస్థలో భాగం.

భారత సాయుధ దళాలు అనేక సైనిక చర్యల్లో పాలుపంచుకున్నాయి. 1947, 1965, 1971 నాటి భారత పాక్ యుద్ధాలు, 1963 భారత చైనా యుద్ధం, భారత పోర్చుగీసు యుద్ధం, 1987 భారత చైనా ఘర్షణ, కార్గిల్ యుద్ధం, సియాచిన్ ఘర్షణ వీటిలో కొన్ని. ప్రతి సంవత్సరం డిసెంబరు 7 న భారత్ సాయుధ దళాల దినోత్సవం జరిపి వీరోచిత సైనికులను సత్కరించుకుంటుంది. 1962 నుండి భారతీయ వాయుసేన రష్యాతో దగ్గరి సంబంధాలు నెలకొల్పుకుంది. ఐదవ తరం ఫైటరు విమానం, సైనిక రవాణా విమానాల అభివృద్ధి ఈ సహకారంలో భాగం. అణుత్రయ సామర్థ్యాన్ని సాధించిన భారత్[19] తన సాయుధ బలగాలను నిరంతరం ఆధునికీకరిస్తూ ఉంది.[20] క్షిపణి రక్షణ వ్యవస్థ, రేపటి సైనిక వ్యవస్థ ఈ ఆధునికీకరణలో కొన్ని భాగాలు.[21][22][23]

మూలాలు

మార్చు
 1. "Arup Raha takes over as new chiefs of staffs committee". The Times of India. 30 July 2014.
 2. "Arup Raha is new chief of staff". 30 July 2014.
 3. "Categories of Entry". Indian Army. Retrieved 23 August 2011.
 4. http://pib.nic.in/newsite/erelease.aspx?relid=(Release%20ID%20:148814)
 5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; IISS 2012 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 6. "At $51.3 bn, Indian Defence Expenditure World's 6th Highest". The New Indian Express. 6 April 2016. Archived from the original on 11 మే 2016. Retrieved 6 April 2016.
 7. http://mod.nic.in/product&supp/welcome.html
 8. 8.0 8.1 8.2 8.3 "India / Aircraft / Jianjiji / Fighter". Stockholm International Peace Research Institute. Archived from the original on 2012-01-19. Retrieved 2016-10-26.
 9. "Czech Tatra becoming into Indian Armed Forces". MAFRA a.s. Retrieved 19 February 2015.
 10. 10.0 10.1 "Arms Transfers Database". SIPRI. Archived from the original on 14 ఫిబ్రవరి 2013. Retrieved 20 February 2013.
 11. "India is world's 'largest importer' of arms, says study". BBC. 14 March 2011. Retrieved 20 February 2013.
 12. "Enter the Elephant: India Looks to Overhaul Its Military". 3 April 2012. Retrieved 20 February 2013.
 13. "Indian defence exports valued at Rs.997 crore". Yahoo News. 12 December 2012. Archived from the original on 15 డిసెంబరు 2012. Retrieved 20 February 2013.
 14. "Indian Armed Forces". Know India Portal. NIC, GoI. Archived from the original on 25 సెప్టెంబరు 2015. Retrieved 17 September 2015.
 15. "CIC Order" (PDF). Right to Information. CIC, GoI. Archived from the original (PDF) on 25 సెప్టెంబరు 2015. Retrieved 17 September 2015.
 16. "Press Information Bureau". Retrieved 15 September 2016.
 17. John Pike. "India - Army".
 18. Matters, Professional (12 July 2011). "Report My Signal- Professional Matters: The Central Police Forces and State Armed Police". Reportmysignalpm.blogspot.com. Retrieved 17 August 2012.
 19. Peri, Dinakar (17 October 2016). "Now, India has a nuclear triad". The Hindu. Retrieved 17 October 2016.
 20. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-12-04. Retrieved 2016-10-26.
 21. "End of an era: Israel replaces Russia as India's top military supplier". World Tribune. Retrieved 18 March 2011.
 22. "Russia Competing to Remain India's Top Military Supplier". India Defence. Archived from the original on 18 ఆగస్టు 2017. Retrieved 18 March 2011.
 23. Cohen, Stephen and Sunil Dasgupta. "Arms Sales for India". Brookings Institution. Archived from the original on 9 మార్చి 2011. Retrieved 18 March 2011.