భువన్ షోమ్ (సినిమా)

భువన్ షోమ్ 1969, మే 12న మృణాళ్ సేన్ దర్శకత్వంలో విడుదలైన హిందీ చలనచిత్రం. బాలాయ్ చంద్ ముఖోపాధ్యాయ్ రచించిన బెంగాళీ కథ అధారంగా రూపొందిన ఈ చిత్రంలో ఉత్పల్ దత్, సుహాసిని ములే నటించారు. 1969 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ చిత్రం జాతీయ ఉత్తమ చిత్రం, జాతీయ ఉత్తమ దర్శకుడు (మృణాళ్ సేన్), జాతీయ ఉత్తమ నటుడు (ఉత్పల్ దత్) విభాగాల్లో బహుమతులను అందుకుంది.[1]

భువన్ షోమ్
దర్శకత్వంమృణాళ్ సేన్
రచనబాలాయ్ చంద్ ముఖోపాధ్యాయ్
నిర్మాతమృణాళ్ సేన్ ప్రొడక్షన్
తారాగణంఉత్పల్ దత్
సుహాసిని ములే
Narrated byఅమితాబ్ బచ్చన్
ఛాయాగ్రహణంకె.కె. మహజన్
సంగీతంవిజయ్ రాఘవ్ రావు
విడుదల తేదీ
1969, మే 12
సినిమా నిడివి
96 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

నటవర్గం మార్చు

  • ఉత్పల్ దత్
  • సుహాసిని ములే
  • శేఖర్ ఛటర్జీ
  • సాధు మెహర్
  • పున్య దాస్
  • రోచక్ పండిట్

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: మృణాళ్ సేన్
  • నిర్మాత: మృణాళ్ సేన్ ప్రొడక్షన్
  • రచన: బాలాయ్ చంద్ ముఖోపాధ్యాయ్
  • వ్యాఖ్యానం: అమితాబ్ బచ్చన్
  • సంగీతం: విజయ్ రాఘవ్ రావు
  • ఛాయాగ్రహణం: కె.కె. మహజన్

అవార్డులు మార్చు

  1. జాతీయ ఉత్తమ చిత్రం
  2. జాతీయ ఉత్తమ దర్శకుడు (మృణాళ్ సేన్)
  3. జాతీయ ఉత్తమ నటుడు (ఉత్పల్ దత్)

ఇతర వివరాలు మార్చు

  1. ఇది మృణాళ్ సేన్ తొలి హిందీ చిత్రం.
  2. ఈ చిత్రానికి అమితాబ్ బచ్చన్ నేపథ్య గాత్రాన్ని అందించాడు.[2][3]
  3. భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఇండియన్ ఆర్ట్ సినిమా లేదా న్యూవేవ్ సినిమాకు నాంది పలికింది.
  4. దైనందిన జీవితంలో తారసపడే పాత్రలు, సంఘటనలతో కూడా సినిమాలు నిర్మించి వాటిని కేవలం అవార్డులకే పరిమితం చేయకుండా ప్రేక్షకుల మన్ననలు పొందేలా తీర్చిదిద్దవచ్చని ఈ చిత్రం నిరూపించింది.[1]
  5. ఆధునిక భారతీయ చలనచిత్రాలలో ఒకటిగా గుర్తించబడింది.[4]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 నమస్తే తెలంగాణ, జాతీయ వార్తలు (31 December 2018). "సుప్రసిద్ధ సినీ దర్శకుడు మృణాల్‌సేన్ అస్తమయం". Archived from the original on 7 January 2019. Retrieved 7 January 2019.
  2. ఆంధ్రజ్యోతి, సంపాదకీయం (2 January 2019). "వెండితెరపై సామాజిక వ్యాఖ్యాత". Archived from the original on 7 January 2019. Retrieved 7 January 2019.
  3. "Before stardom: Amitabh Bachchan's drudge years are a study in perseverance and persona building".[permanent dead link]
  4. Mrinal Sen ucla

ఇతర లంకెలు మార్చు