ప్రధాన మెనూను తెరువు

భూషణము

(భూషణం నుండి దారిమార్పు చెందింది)

భూషణము అనగా ఆభరణం. నాగభూషణుడు అనగా నాగుబామును ఆభరణంగా కలవాడు - శివుడు అని అర్ధం.

పద్యంసవరించు

కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు రచించిన ఒక పద్యం.

మునికిన్ శాంతము భూషణంబగు; సుధాపూరంబు వర్షించు సో

మునికిన్ కౌముది భూషణంబగు; జగమ్మున్ కాచి రక్షించు రా

మునికిన్ ధర్మమె భూషణంబగు; దురాత్ముండౌ బకుం గూల్చు భీ

మునికిన్ కోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్.

అర్ధం : మునులకు శాంతమే ఆభరణం. అమృతాన్ని వర్షించే చంద్రునికి వెన్నెల భూషణం, శ్రీరామచంద్రుడికి ధర్మమే ఆభరణం. బకాసురుడి లాంటి రాక్షసులను సంహరించి, జనులకు ఆనందం కలిగించే భీముడికి కోపమే ఆభరణం.

ఇవి కూడా చూడండిసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=భూషణము&oldid=2161376" నుండి వెలికితీశారు