భూ శాస్త్రం అనగా భూ గ్రహమునకు సంబంధించిన శాస్త్రాలన్నింటినీ స్వీకరించే పదం. భూ శాస్త్రం జియోసైన్స్ అని కూడా పిలవబడుతుంది. ఇది భూగర్భ శాస్త్రం కంటే విస్తృతమైన పదం, ఎందుకంటే దీనిలో ప్లానెటరీ సైన్స్ అంశాలుంటాయి, ఇది ఖగోళశాస్త్రం యొక్క భాగం. భూ శాస్త్రాలలో వాతావరణ అధ్యయనం, సముద్రాలు మరియు జీవావరణం, అలాగే ఘన భూమి ఉంటాయి. సాధారణంగా భూ శాస్త్రవేత్తలు భూమిని అర్థం చేసుకోవడానికి, మరియు దాని ప్రస్తుత స్థితికి ఎలా అభివృద్ధి జరిగినదని తెలుసుకోవడానికి భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, కాలక్రమం మరియు గణిత శాస్త్రం నుండి టూల్స్ ఉపయోగిస్తారు.