భోగరాజు నారాయణమూర్తి

తెలుగు రచయిత

భోగరాజు నారాయణమూర్తి (అక్టోబర్ 8, 1891 - ఏప్రిల్ 12, 1940) ప్రముఖ నవలా రచయిత, నాటక కర్త.

జననంసవరించు

ఈయన 1891, అక్టోబర్ 8గజపతినగరం బొండపల్లి మండలం లోని దేవుపల్లి గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు బాల ప్రసాద రావు, జోగమ్మ. విజయనగరం మహారాజా ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడుగా పనిచేశాడు.

రచనలుసవరించు

నవలలుసవరించు

 • విమలాదేవి (1915)
 • ఆంధ్ర రాష్ట్రము (1918)[1]
 • అస్తమయము : ఆంధ్రుల ప్రాచీన వైభవాన్ని తెలిపే నవల
 • ఆంగ్ల రాజ్య స్థాపన (1917) : దేశభక్తి ప్రబోధాత్మకమైన నవల
 • ప్రచండ పాండవము
 • చంద్రగుప్త
 • కాలచక్రము (1949)[2] : సమకాలీన సాంఘిక జీవనాన్ని ప్రతిబింబించే నవల
 • అల్లాహో అక్బర్ : కాకతీయులకు, మహమ్మదీయులకు మధ్యగల మతరాజకీయాలను వివరించే నవల.
 • ఉషఃకాలము : శివాజీ జీవితం ఇతివృత్తంగా సాగిన నవల
 • పండుగ కట్నము (1927)

పద్య కావ్యాలుసవరించు

 • కంకణము : నీటిబొట్టు చెప్పిన ఆత్మకథ[3]
 • కృష్ణకుమారి : రాజపుత్ర స్త్రీ జీవిత చరిత్ర
 • వాసవీ పరిణయము : విజయనగరంలోని కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆశువుగా చెప్పిన పద్యకావ్యం
 • ప్రత్యక్ష రాఘవము : భద్రాచల రామదాసు కథ
 • పార్థివలింగ శతకము

నాటకాలుసవరించు

 • లక్షణ (సాంఘిక నాటకము) [4]
 • లతాంగి (1915)
 • ఉషా పరిణయము (1909)
 • ఆంధ్ర భారతి (1911)
 • నౌరోజ్ (1926)

మరణంసవరించు

1940, ఏప్రిల్ 10 న పరమపదించాడు.

మూలాలుసవరించు