మండలి వెంకటకృష్ణారావు
మండలి వెంకట కృష్ణారావు (ఆగస్టు 4, 1926 - సెప్టెంబర్ 27, 1997) అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం నుంచి 1972 లో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యుడు, గాంధేయవాది. మాజీ రాష్ట్రమంత్రి మండలి బుద్ధప్రసాద్ ఈయన కుమారుడు. 1938 ఆగస్టు 4 న కైకలూరు మండలం పల్లెవాడలో జన్మించారు. వీరి స్వస్థలం నాగాయలంక మండలంలోని భావదేవరపల్లి గ్రామం.
మండలి వెంకటకృష్ణారావు | |
---|---|
![]() మండలి వెంకటకృష్ణారావు | |
జననం | మండలి వెంకటకృష్ణారావు ఆగస్టు 4, 1926 కృష్ణా జిల్లా కైకలూరు తాలూకా, పల్లెవాడ గ్రామం |
మరణం | సెప్టెంబర్ 27, 1997 |
వృత్తి | 1974 లో ఆయన విద్యా – సాంస్కృతిక వ్యవహారాల మంత్రి |
ప్రసిద్ధి | శాసన సభ్యుడు, గాంధేయవాది |
Notes అంతర్జాతీయ తెలుగు కేంద్రం పేరును ‘మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం’గా మార్చారు. |
1926 ఆగస్టు 4న కృష్ణా జిల్లా కైకలూరు తాలూకా, పల్లెవాడ గ్రామంలో మండలి వేంకట కృష్ణారావు ‘దివిసీమ గాంధీ’గా ప్రజల మన్ననలనందుకున్నారు. 1997 సెప్టెంబర్ 27న తుదిశ్వాస విడిచారు. ‘బాధలలో ఉన్న వారిని మనమే ముందు వెల్లి ఓదార్చాలని’ వారు ఆచరించి చెప్పిన మాటలు దివిసీమ ప్రజలకు భగవద్గీతలా వినిపిస్తూనే ఉంటాయి.
మండలి వేంకట కృష్ణారావు కృషి వల్లే దివిసీమలోని నిరుపేదలకు బంజరు భూములను పంచె కార్యక్రమం 1955లో ప్రారంభమైంది. 15 వేల ఎకరాల బంజరు భూములను పేదలకు పంచారు. 1974 లో ఆయన విద్యా – సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1975 రాక్షస నామ సంవత్సరం ఉగాదినాడు ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమ నిర్వహణ కమిటీకి మండలి వెంకట కృష్ణారావు కార్యనిర్వాహక అధ్యక్షునిగా వ్యవహరించారు.[1] ‘అంతర్జాతీయ తెలుగు కేంద్రం’ సంస్థను 1975లో నాటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్ ప్రారంభించారు. మండలి వేంకటకృష్ణారావు ఈ సంస్థకు ప్రథమ అధ్యక్షులుగా వ్యవహరించారు.
ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల కార్యనిర్వాహక అధ్యక్షులుగా, అంతర్జాతీయ తెలుగు కేంద్రం ప్రథమ అధ్యక్షులుగా వ్యవహరించిన మండలి వేంకట కృష్ణారావు కృషిని గుర్తించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంతర్జాతీయ తెలుగు కేంద్రం పేరును ‘మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం’గా మార్చారు. దివిసీమ లోని పులిగడ్డ – పెనుమూడి వంతెనకు మండలి వేంకట కృష్ణారావు పేరు పెట్టారు.
మూలాలుసవరించు
- ↑ రామానుజరావు, దేవులపల్లి (17 మార్చి 1975). తెలుగు నవల (ముందుమాట). హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ. p. iii.