మంత్రిప్రెగడ భుజంగరావు
మంత్రిప్రెగడ భుజంగరావు (1876 - 1941) సాహిత్యపోషకుడు. శతాధికగ్రంథ రచయిత. పశ్చిమ గోదావరి జిల్లా లక్కవరం జమీందారు.
మంత్రిప్రెగడ భుజంగరావు | |
---|---|
![]() రాజా మంత్రిప్రెగడ భుజంగరావు బహద్దూర్ | |
జననం | మంత్రిప్రెగడ భుజంగరావు 1876 ఏప్రిల్ 13 పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు |
మరణం | 1941 ఏప్రిల్ 28 ఏలూరు | (వయసు 65)
ప్రసిద్ధి | లక్కవరం జమీందారు, రచయిత, అవధాని, సాహిత్య పోషకుడు |
Notable work(s) | చారుమతీ పరిణయము, ఆధునిక కవిజీవితములు, ఆంధ్రీకృతోత్తరరామచరిత్రము |
మతం | హిందూ |
తండ్రి | మల్లయామాత్యులు (కన్నతండ్రి), మల్లికార్జున ప్రసాదరావు (పెంపుడు తండ్రి) |
తల్లి | వెంకమాంబ (కన్నతల్లి), విజయలక్ష్మమ్మ (పెంపుడు తల్లి) |
జీవిత విశేషాలుసవరించు
ఇతడు 1876, ఏప్రిల్ 13వ తేదీకి సరియైన ధాత నామ సంవత్సర చైత్ర బహుళ పంచమి, గురువారం నాడు ఏలూరు పట్టణంలో జన్మించాడు[1]. వెంకమాంబ, మల్లయామాత్యులు ఇతని కన్న తల్లిదండ్రులు కాగా విజయలక్ష్మమ్మ, మల్లికార్జున ప్రసాదరావులు ఇతడిని దత్తత తీసుకుని పెంచారు. ఇతనికి సంస్కృతాంధ్రములతో పాటుగా ఆంగ్లంలో కూడా మంచి ప్రవేశం ఉంది. మంజువాణి అనే మాసపత్రికను ప్రచురించాడు. ఇతడు కావ్యాలు,నాటకాలు, ప్రహసనాలు, కథలు, నవలలు, శతకాలు, ప్రబంధాలు, జీవితచరిత్రలు, వాఙ్మయ చరిత్రలు, చాటువులు, అవధానాలు, ఆశుకవిత్వం మొదలైన ప్రక్రియలను నిర్వహించాడు.
ఇతని ఆస్థానంలో ప్రముఖ విద్వత్కవులు, పండితులు ఉండేవారు. వారిలో శొంఠి భద్రాద్రిరామశాస్త్రి,కోన వేంకటరాయశర్మ,కొత్తపల్లి సుందరరామయ్య,ఆకొండి వ్యాసమూర్తిశాస్త్రి, నోరి సీతాకాంతశాస్త్రి,దేవరకొండ మాణిక్యశాస్త్రి, నందిరాజు చలపతిరావు, కూచి సత్యనారాయణ, రామరాజు శోభనాచలము మొదలైనవారు ఉన్నారు. ఇతడు 1941, ఏప్రిల్ 28వ తేదీన ఏలూరులో మరణించాడు.[2]
అవధానాలుసవరించు
ఇతడు వినోదార్థము అవధానాలు నిర్వహించాడు. ఇతని అవధానాలలో వెలువడిన పద్యాలు కొన్ని[2]:
- సమస్య: కప్పం గని ఫణివరుండు గడగడ వణకెన్
పూరణ:
చెప్పెడిదేమిక బెత్తము
నప్పప్పా చేతబట్టి యతి రయమున సౌ
రొప్పగ ముందుగ జను వెం
కప్పం గని ఫణివరుండు గడగడ వణకెన్
- వర్ణన: కాటన్ దొర
పూరణ:
సూటిగ నల గోదావరి
దాటుచు దా నానకట్ట దద్దయు గట్టన్
మేటి మగండన వలదే
కాటను నెన్నంగ తరమె దా ధన్యుడగున్
- న్యస్తాక్షరి:
శ్రీల నొసంగుచు నన్నుం
బాలన జేయుచు బ్రోవం
జాలిన లక్ష్మిని గొల్వం
బోలదె నెమ్మది లోనన్
రచనలుసవరించు
- చిత్ర హరిశ్చంద్ర
- చారుమతీ పరిణయము[3]
- శశిరేఖ
- ఆంధ్రీకృతాభిజ్ఞానశాకుంతలము
- ఆధునిక కవిజీవితములు
- వాసంతిక
- ఆంధ్రీకృతోత్తరరామచరిత్రము[4]
- వారకాంత[5]
- గానామృతము[6]
- దిలీపచరిత్రము
- స్తవరాజము
- మైరావణుడు
- మోహలేఖావళి
- మాల్కిసువార్త
- మార్కండేయేశ్వర చరిత్రము
- పాండవాజ్ఞాతవాసము
- పరమ పురుషాన్వేషణము
- పదార్థ విజ్ఞాన శాస్త్రము
- వ్యవసాయము
- నిరపవాద ప్రహసనము
- కలియుగ నటనామృతము
- విజయాంక సాహసము
- వచననైషధము
- రాజహంస
- మధుప విహారము
- తత్త్వమీమాంస
- ఆంధ్ర కథా సరిత్సాగరము
- గోఖలే చరిత్ర
- లూకా సువార్త
- క్రైస్తవగూడార్థ దీపిక
- యోహానుసువార్త
- దీనరక్షామణి శతకము
- అగ్గిరాముని మరణావేదనము
- బాలనీతికథలు
- వసంతకుసుమము
- చారుమతి పద్యములు
- సుశీల పద్యములు
- విక్టోరియా స్వర్గయాత్ర
- విక్టోరియాతారావళి
- చమత్కారస్నేహ ప్రహసనము
- మహాయోగరహస్య ప్రహసనము
- విధవావివాహ ప్రహసనము
- మార్కాండేయ శతకము
- శ్రీహరి శతకము
- ఈశ్వర శతకము
- శృంగార రసవాహిని
- A History of Telugu Literature
- విద్యున్మాల (నాటకం, 1920) ఆర్కీవు.కాంలో విద్యున్మాల పుస్తకం.
మూలాలుసవరించు
- ↑ [1]ఆంధ్ర రచయితలు - మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి - పేజీలు 373-377
- ↑ 2.0 2.1 రాపాక, ఏకాంబరాచార్యులు. "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 135–138.
- ↑ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో చారుమతీ పరిణయము పుస్తక ప్రతి
- ↑ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో ఆంధ్రీకృత్తోత్తర రామచరిత్రము పుస్తక ప్రతి
- ↑ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో వారకాంత పుస్తక ప్రతి
- ↑ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో గానామృతము పుస్తక ప్రతి