మకరందు పండు (ప్రూనస్ పెర్సికా) అనేదొక కాలానుగుణంగా ఆకురాల్చేగుణమున్నచెట్లకు పండే పండు. ఇది వాయువ్య చీనా ప్రాంతములో తారిం ద్రోణికి మఱియు  కన్లన్ పర్వతాల ఉత్తర లోయలకు మధ్య తొలిసారిగా పెంచబడిన మఱియు సాగుచేయబడిన పండు. 

పెర్సికా అనే పదం పెర్షియాలో(ప్రస్తుత ఇరాన్) విస్తృతంగా వ్యాప్తిచేయబడిన సాగు కారణంగా వచ్చిన పేరు. అక్కడినుండి ఐరోపాకు ఈ పండు వ్యాప్తించింది. ఈ పండు ఇతర పండ్లైన చెఱీప్రీతిపండుబాదంఅల్లనేరేడు వలె "ప్రూనస్" అనే జన్యువుకు, గులాబీ పూవు కుటుంబానికి చెందిన పండు. ఈ పండులో గట్టి గింౙ ఉండటం వలన, ఇది బాదంతో కలిపి "ఏమిగ్డాలస్" అనే ఉపజన్యువులోకి వర్గీకరించబడింది. అందువలననే, ఈ పండులోని గింౙ యొక్క రుచి, బాదంపప్పు గింౙ రుచివలె ఉంటుంది. ఈ మకరందపండు గింౙను మార్జిపాన్ అనే ఒక రకం వనస్పతిని తయారుచేస్తారు.


చీనా ఒకటే ప్రపంచవ్యాప్తంగా 58 శాతం మకరంద పండ్లను 2016లో ఉత్పత్తి చేసింది. 

వర్ణన మార్చు

 
మకరంద పుష్పాలు

మకరంద పండ్ల చెట్లు 4 నుండి 10 మీటర్లు లేదా 13 నుండి 33 అడుగులు ఎత్తు ఎదుగుతుంది. Tదీని ఆకులు బాణపు కొస ఆకారంలో ఉండి, చివర్లలో సన్నగా, మధ్యలో వెడల్పుగానుంటాయి. అవి 7 నుండి 16 సెం.మీ||లు పొడవుంటాయి. పువ్వులు వసంతఋతువారంభంలో గుత్తులుగా లేదా ఒంటరిగా, 2.5 నుండి 3 cm అడ్డకొలతతో, గులాబి వర్ణంలో, ఐదుఱేకులతో పూస్తాయి. పండ్లుపసుపుగా లేదా తెలుపురంగులో, లేత గుబాళింపు కలిగి ఉంటాయి. వాటి చర్మం నునుపుగా ఉంటుంది. ఆ పండులోపలి గుజ్జు చాలా సున్నితంగా, గట్టిగా నొక్కితే రసంలా అయిపోతుంది. పండులోపలి గింౙశోణితవర్ణంలో, అండాకారంలో దాదాపు 1.3 నుండి 2 సెం.మీ||ల అడ్డకొలతగలిగి, ఒక రకమైన చెక్కరౙను వంటి పదార్థము చుట్టూగలిగి ఉంటుంది. చెఱీపండు, అల్లనేరేడు మఱియు ప్రీతిపండు వలె ఈ పండుకు లోపలి గింౙ పెద్దగా, గట్టిగా కలిగివుంటుంది. భారతదేశపు మకరంద పండ్లు వేసవికాలపు అంతంలో ఎఱుపు నుండి తెలుపు రంగులలో పండుతాయి. కొన్ని కొన్ని నీలలోహిత వర్ణంలోకూడా లభిస్తాయి.

సాగుచేయబడే మకరంద పండ్లు లోపలి గింౙలు గుజ్జుకు అతుక్కుంటాయా లేదా అన్నదానిబట్టి రెండురకాలుగా లభిస్తాయి. తెలుపు రంగు గుజ్జుగల మకరంద పండ్లు తీపిదనం ఎక్కువగలిగి,  ఆమ్లత్వం తక్కువగలిగి ఉంటాయి.పసుపు-తెలుపురంగు గుజ్జుగల మకరంద పండ్లు ఆమ్లత్వం కాస్తఎక్కువ ఉండటం వలన పుల్లగా, తీపిదనం కొంచెం తక్కువగలిగి ఉంటాయి.  రెండురకాల పండ్ల తోలు మాత్రము కాస్త ఎఱ్ఱగానుంటుంది. ఆమ్లత్వం తక్కువగలిగివున్నతెలుపుతోలు మకరంద పండ్లు చీనా, జపాను మఱియు పొరుగు ఆసియాదేశాలలో ప్రసిద్ధి. ఐరోపా మఱియు ఉత్తరామెరికా దేశాలలో కాస్త ఆమ్లత్వముగల, పసుపుతోలు మకరందపండ్లు ప్రసిద్ధి.

వర్గీకరణం మార్చు

శాస్త్రీయనామమైన "పెర్సికా" మఱియు దీని ఆంగ్లనామమైన "పీచు" ఐరోపాభాషలనుండి పుట్టింది. తొలినాళ్లలో ఐరోపాదేశస్థులు ఈ పండు పెర్షియా దేశం నుండి వచ్చిందని భావించేవారు. ప్రాచీన రోమన్లు కూడా మకరందపండును "మ్యాలం పెర్షికం"(అనగా పెర్షియా సీమఱేగుపండు) అనేవారు, పరాసులు దీనిని "పేచె" అంటారు. శాస్త్రీయనామమైన "ప్రూనస్ పెర్సికా"అంటే పెర్షియా అల్లనేరేడు.

శిలాజాల కవిలలు మార్చు

నేటి మకరంద పండులాగనే ఎటువంటి మార్పులేకుండా ఉన్న మకరందపండ్ల శిలాజాలు అతినూతన యుగం యొక్క చివరిభాగానికి చెందినవి, కన్మింగ్, నైఋత్య చీనాలో 26 లక్షల సంవత్సరాల ముందువి బయటబడ్డాయి.

చరిత్ర మార్చు

 
ఎండు ఖర్జూరం, మకరందపండు, ప్రీతిపండ్ల గింౙలు. ఈజిప్టుదేశానివి. ఈజిప్టు శిలాజశాస్త్ర పెట్రీ సంగ్రహాలయము, లండను.

దీని వృక్షశాస్త్రనామమైన  "ప్రూనస్ పెర్సికా" నేటి ఇరాన్ దేశానికి చెందినట్టున్నా, జన్యుపరిశోధనలు ఈ పండు చీనాదేశానికి చెందినవని చెబుతున్నాయి. అవి చీనా ప్రాంతంలో నవపాషాణ యుగకాలం నుండి పెరిగి పండుతున్నాయట. పరిశోధనలో తేలిందంటే, ఈ పండ్లను తొలిసారిగా క్రీ.పూ 2000లో సాగుచేశారు. ఈ మధ్యపరిశోధనలో ఈ పండ్లు చీనా జీజియాంగ్ పరిధిలో క్రీ.పూ 6000లోనే సాగుచేసేవారని తేలింది. పురాతత్త్వశాస్త్రవేత్తలు యాంగ్జీ నదీ లోయలలో ఒకప్పుడు మకరంద పండ్లు బాగా పండేవని చెబుతున్నారు. మకరంద పండ్ల ప్రస్తావన క్రీ.పూ 1వ శతాబ్దంలో చీనాదేశ సాహిత్యంలో మొట్టమొదటిగా ఉంది.

భారతదేశంలో మకరంద పండు, తొలిసారిగా క్రీ.పూ1700లో హరప్పా ప్రాంతంలో ఉపయోగించబడింది.

మకరంద పండ్లు అమెరికా దేశంలోకి 16వ శతాబ్దంలో, స్పన(స్పెయిన్)దేశస్థుల ద్వారా పరిచయమయ్యాయి. అక్కడినుండి ఆంగ్లభూమికి మఱియు పరాసదేశముకు 17వ శతాబ్దంలోకి వెళ్ళాయి. కాకపోతే క్రొత్తలలో ఈ పండ్లు ఆయా దేశాలలో బాగా ఖరీదుండేవి. 

సాగు మార్చు

 
మకరంద పూవుపై మకరందం కోసం వాలిన ఒక మధుపం

మకరంద పండ్లు పొడిగా, సమశీతోష్ణ స్థలాలపై ఉష్ణమండల మఱియు ఉపోష్ణమండల ప్రాంతాలలో సాధారణంగా సముద్రమట్టానికి ఎత్తులో 0 నుండి 10 డిగ్రీల సెల్సియస్ వాతావరణంలో పెరుగుతాయి. ఆ చల్లదనంలోనే ఈ పండ్లచెట్లకు మొగ్గలు వేస్తాయి. తర్వాతకాలంలో ఆ మొగ్గలు సరైన వేడిమికి విచ్చుకొని పూస్తాయి. 

ఈ పండ్లచెట్లు -26 నుండి -30 డిగ్రీల సెల్సియస్ వాతావరణాన్ని సహించగలవు.

 
తెలుపు మకరందాలు, పూర్తి పండు మఱియు కోసినది, 

చిత్రజాలం మార్చు

సూచికలు మార్చు

మరింత చదవడానికి మార్చు

  • Okie, William Thomas. The Georgia Peach: Culture, Agriculture, and Environment in the American South (Cambridge Studies on the American South, 2016).

బాహ్య లంకెలు మార్చు