మణి కృష్ణస్వామి

మణి కృష్ణస్వామి, ( 1930 ఫిబ్రవరి 3 – 2002 జూలై 12) తమిళనాడుకు చెందిన కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసురాలు.

మణి కృష్ణస్వామి
జననం
మణి పేరిందేవి

(1930-02-03)1930 ఫిబ్రవరి 3
మరణం2002 జూలై 12(2002-07-12) (వయసు 72)
వృత్తికర్ణాటక గాత్ర విద్వాంసురాలు

జీవిత విశేషాలు

మార్చు

ఈమె జన్మనామం మణి పేరిందేవి. ఇతని తండ్రి లక్ష్మీనరసింహాచారి వెల్లూర్ సంగీత సభకు కార్యదర్శిగా పనిచేశాడు. ఈమెకు 6 ఏళ్ళ వయసులో ఈమె తల్లి మరగతవల్లి ఈమెకు వయోలిన్ నేర్పించింది. ఈమె భర్త కృష్ణస్వామి కళోద్ధారకుడు.[1]

కర్ణాటక సంగీతంలో శిక్షణ

మార్చు

ఈమె ప్రథమ గురువు గోపాలాచారి ఈమె కుటుంబ స్నేహితుడు. ఈమె బాల్యంలోనే 500కు పైగా పాటలను నేర్చుకుంది. ఈమె హైస్కూలు చదువు ముగిసిన తర్వాత చెన్నై, అడయార్‌లోని "కళాక్షేత్ర"లో "సంగీత శిరోమణి" కోర్సులో చేరింది. కళాక్షేత్రలో ఈమె రుక్మిణీదేవి అరండేల్, టైగర్ వరదాచారి, పాపనాశం శివన్ వంటి దిగ్గజాలనుండి ప్రభావితమయ్యింది. ఈమె కళాక్షేత్రలో మైసూరు వాసుదేవాచార్య, బడలూర్ కృష్ణమూర్తిశాస్త్రి, టైగర్ వరదాచారి, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, పాపనాశం శివంల వద్ద శిక్షణ పొంది సంగీతంలో రాటుదేలింది. ఈమె "ముసిరి సంప్రదాయా"న్ని పాటిస్తూ తన గురువు ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ కృతులను ప్రచారం చేసింది.[1]

సంగీత ప్రస్థానం

మార్చు
 
ఎం.ఎస్. సుబ్బులక్ష్మితో మణి కృష్ణస్వామి.

భారత ప్రభుత్వం సోవియట్ యూనియన్‌(1989)లో, జర్మనీ(1991)లో జరిగిన భారతీయ ఉత్సవాలలో సంగీత ప్రదర్శనలు ఇవ్వడానికి ఈమెను ఎంపిక చేసింది. ఈమె భారతదేశంలో, విదేశాలలో అనేక సంగీత కచేరీలను నిర్వహించింది. శాన్‌ఫ్రాన్సిస్కో విశ్వవిద్యాలయంలో కొంత కాలం విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసురాలిగా ఈమె సేవలను అందించింది. ఈమె ఆలపించిన "సౌందర్యలహరి" కర్ణాటక సంగీత విమర్శకులచేత ఒక "సంగీత నిధి"గా కొనియాడబడింది. ఈమె ప్రాకృతభాషలో దేశికర్ రచించిన అచుత్య శతకాన్ని శ్రావ్యంగా ఆలపించింది.

పురస్కారాలు

మార్చు
 
2002లో భారత రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ నుండి పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరిస్తున్న మణి కృష్ణస్వామి

ఈమె 2002, జూలై 12వ తేదీన గుండెపోటుతో మరణించింది.[1]

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు