మదన్‌రావ్ పిసల్
మదన్‌రావు గణపతిరావు పిసల్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన వాయ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మార్కెటింగ్ & స్వయం ఉపాధి శాఖ మంత్రిగా పని చేశాడు.[2]
మదన్‌రావు పిసల్ | |||
మార్కెటింగ్ & స్వయం ఉపాధి శాఖ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2003 - 2004 | |||
పదవీ కాలం 1985 – 2009 | |||
ముందు | ప్రాత ప్రావో భోసలే | ||
---|---|---|---|
తరువాత | మకరంద్ జాదవ్ పాటిల్ | ||
నియోజకవర్గం | వాయ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
మరణం | 2012 అక్టోబర్ 23[1] | ||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | స్వతంత్ర | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ |
రాజకీయ జీవితం
మార్చుమదన్రావు పిసల్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పోటీ చేసి 1985 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వాయ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1990, 1995 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
మదన్‌రావు పిసల్ ఆ తరువాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరి 1999 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా ఐదవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
మూలాలు
మార్చు- ↑ "Former minister Madanrao Pisal dies". The Times of India. 23 October 2012. Archived from the original on 18 January 2025. Retrieved 18 January 2025.
- ↑ "Ministers in Maharashtra's jumbo cabinet fight for office space in overcrowded secretariat" (in ఇంగ్లీష్). India Today. 9 June 2003. Archived from the original on 18 January 2025. Retrieved 18 January 2025.