మదురా ద్వీపం ఇండోనేషియా లోని ఒక ద్వీపం. ఇది జావా ఈశాన్య తీరంలో ఉంది. ఈ ద్వీపం వైశాల్యం సుమారు 4,078.67 చ.కిమీ (పరిపాలనాపరంగా 5,168 కిమీ² తూర్పు, ఉత్తరాన ఉన్న వివిధ చిన్న ద్వీపాలతో సహా) ఉంది. పరిపాలనాపరంగా మదుర తూర్పు జావాలో భాగంగా ఉంది. ఇది ఒక సన్నని జలసంధి ద్వారా జావా నుండి వేరు చేయబడింది. పరిపాలనా విభాగంలో జనసాంద్రత చ.కి.మీ.కు 702 మంది ఉండగా ద్వీపంలో జనసాంద్రత చ.కి.మీ. కి 817.

మధురా ద్వీపం
మధుర
مدورا
మధుర స్థలాకృతి (పైన)
తూర్పు జావా లో మధుర ఉనికి (క్రింద)
భూగోళశాస్త్రం
ప్రదేశంఆగ్నేయ ఆసియా
అక్షాంశ,రేఖాంశాలు7°0′S 113°20′E / 7.000°S 113.333°E / -7.000; 113.333
ద్వీపసమూహంగ్రేటర్ సుందా ద్వీపాలు
మొత్తం ద్వీపాలు127
ముఖ్యమైన ద్వీపాలుమధుకేరా, కంగేన్
విస్తీర్ణం4,078.67 కి.మీ2 (1,574.78 చ. మై.)
అత్యధిక ఎత్తు471 m (1,545 ft)
ఎత్తైన పర్వతంటెంబుకు శిఖరం
నిర్వహణ
ఇండోనేషియా
రాజ్యంతీర్పు జావా
అతిపెద్ద ప్రాంతముబేంగ్‌కలన్ పట్టణం (pop. 94.729)
జనాభా వివరాలు
జనాభా3,724,545 (2014 జనాభా లెక్కలు)
జన సాంద్రత720.9 /km2 (1,867.1 /sq mi)
జాతి సమూహాలుమదురెసె

చరిత్ర

మార్చు

1964 లో మాతురం సుల్తానేటుకు చెందిన సుల్తాన్ అగుంగు మదురా ద్వీపాన్ని జయించి ఈ ప్రాంతాన్ని కాక్రానింగ్రాట్సు రాచరికపాలన క్రిందకు తీసుకువచ్చాడు.[1] కాక్రానిన్గ్రాటు కుటుంబం జావాకేంద్ర పాలనను వ్యతిరేకిస్తూ అత్యకమైన మాతారాం భాగాలను జయించింది.[2]

మూడవ అమంగ్కురాటు, ఆయన మామ పంగేరన్ పుగర్ మధ్య జరిగిన మొదటి జావానీస్ యుద్ధం తరువాత 1705 లో డచ్చి మదురా తూర్పు భాగంలో నియంత్రణ సాధించింది. ప్యూగర్ డచ్చి గుర్తింపు లభించడం పశ్చిమ మదుర ప్రభువు( కాక్రానింగ్రాట్)ని ప్రభావితమైంది. మద్య జావాలో మొదలైన యుద్ధంలో మదురీయులు జోక్యం చేసుకుంటారన్న ఆశతో పశ్చిమ మదుర ప్రభువు పుగర్ వాదనలకు మద్దతు ఇచ్చాడు. అమంగ్కురాటు ఖైదుచేయబడి చేయబడి సిలోనుకు పంపబడిన సమయంలో పుగర్ మొదటి పకుబువోనో అనే బిరుదును స్వీకరించి డచ్తో ఒక ఒప్పందం మీద సంతకం చేసిన ఫలితంగా డచ్చి తూర్పు మదురమీద సాధికారత సాధించింది.

1740 లో చైనా ఊచకోత తరువాత మద్య జావాలో 1740 తిరుగుబాటును అరికట్టడానికి కాక్రానింగ్రాట్సు డచ్చికి సహాయం చేయడానికి అంగీకరించారు. డచ్ వారితో 1743 ఒప్పందంలో మొదటి పకుబువోనో డచ్చివారికి మధుర మీద పూర్తి సార్వభౌమత్వాన్ని ఇచ్చాడు. దీనిని నాలుగవ కాక్రానింగ్రాటు ఎదిరించి ఓడిపోయి బంజర్‌మాసిన్ ప్రాంతానికి పారిపోయి ఆంగ్లేయుల ఆశ్రయం పొందాడు. సుల్తాను మోసానికిగురై దోపిడి చేయబడి డచ్చి చేత బంధించబడి కేప్ ఆఫ్ గుడ్ హోప్‌కు బహిష్కరించబడ్డాడు.

తరువాత డచ్చి వారు తమ సొంత ప్రతినిధితో మదురప్రాంతాన్ని నాలుగు రాష్ట్రాలుగా విభజించి పరిపాలనా కొనసాగించారు. ప్రారంభంలో ఈ ద్వీపం వలస దళాల మకాంగా ఉపయోగించబడింది. 19వ శతాబ్దం రెండవ భాగంలో ద్వీపసమూహంలోని డచ్-నియంత్రిత భూభాగాలకు ఉప్పు ప్రధాన ఆదాయవనరుగా మారింది.

గణాంకాలు

మార్చు

మదురాద్వీపం జనసంఖ్య సుమారు 30,65,000. వీరిలో జాతిపరంగా మదురీలు అధికసంఖ్యలో ఉన్నారు. మదురాద్వీపంలో మదురేస్ భాష ప్రధాన భాషగా ఉంది. ఇది ఆస్ట్రోనేషియన్ భాషాకుటుంబంలో ఒకదానికి చెందినది. ఇది తూర్పు జావాలో కొంత భాగం, వెలుపలి 66 ద్వీపాలలో కూడా వాడుకలో ఉంది.

మదురీలు ఇండోనేషియాలో పెద్దజాతి సమూహంగా (7 మిలియన్ల మంది) ఉంది. వారు మదురా ద్వీపం నుండి మాత్రమేకాక పరిసరాలలోని ఉన్న గిలి రాజా, సపుడి, రాస్, కంగేయన్ దీవుల నుండి వచ్చారు. అదనంగా, చాలా మంది మదురీస్ తూర్పు జావా యొక్క తూర్పు భాగంలో నివసిస్తున్నారు. సాధారణంగా దీనిని "హార్స్‌షూ" అని పిలుస్తారు. పసురువాన్ నుండి బన్యువాంగికి ఉత్తరం వరకు వ్యాపించి ఉంది. సితుబొండో, బొండోవోసో, ప్రోబోలింగ్గో, జెంబర్కు తూర్పున, ఉత్తర సురబయ ప్రాంతాలలో కూడా మదురీయులు ఉన్నారు. వీరిలో కొందరు మాలాంగా, జావానీస్ భాషలను కూడా మాట్లాడే సామర్ధ్యం కలిగి ఉన్నారు.

మదురాలో అధికసంఖ్యలో సున్నీ ముస్లింలు, స్వల్పసంఖ్యలో షియా ముస్లిములు ఉన్నారు. 2012 నుండి అంతర్గత విశ్వాసాల అసమ్మతి హింసకు దారితీసింది. దాడులు జరిగిన ప్రాంతాలలో జ్సంపంగ్ నగరం చుట్టూ అనేక షియా గ్రామాలు ఉన్నాయి. దాడుల కారణంగా ప్రజలు వారి నివాసాలను వదిలి ప్రభుత్వ శరణార్థి కేంద్రాలను ఆశ్రయించారు. 2013 లో ఐక్యరాజ్యసమితి కార్యాలయం సమన్వయ మానవతా వ్యవహారాల కార్యాలయం ఈ దాడుల దాడుల వివరాలను అందించింది.

పాలనావిభాగాలు

మార్చు

మదురా ద్వీపాలు తూర్పుజావాలో భాగంగా ఉన్నాయి. ఇవి 4 రీజెన్సీలుగా విభజించబడ్డాయి. ఇవి పడమర నుండి తూర్పుగా జాబితా చేయబడ్డాయి.

పేరు రాజధాని వైశాల్యం (చ.కి.మీ) జనసంఖ్య
2000 Census
జనసంఖ్య
2005 అంచనాలు
జనసంఖ్య
2010 అంచనాలు
జనసంఖ్య
2014 అంచనాలు
బంగ్కలన్ రీజెంసీ బంగ్కలన్ 1,001.4 8,05,048 8,89,590 9,06,761 9,32,232
పమెకాసన్ రీజెంసీ పమెకాసన్ 792.2 6,89,225 7,62,876 7,95,918 8,18,283
సంపంగ్ రీజెంసీ సంపంగ్(ఇండోనేషియా) 1,233.1 7,50,046 8,35,122 8,77,772 9,02,439
సుమెనెప్ రీజెంసీ సుమెనెప్ (నగరం) 1,998.5 9,85,981 10,04,758 10,42,312 10,71,591
మొత్తం 5,025.2 32,30,300 34,92,346 36,22,763 37,24,545

సుమేనేప్ రీజెన్సీలో అనేక ద్వీపాలు ఉన్నాయి - ముఖ్యంగా మదురాకు తూర్పున ఉన్న కంగేయన్ దీవులు (487 చకిమీ), మదురా, కంగేయన్ ద్వీపాల మధ్య ఉన్న చిన్న సపుడి ద్వీపాలు, ఉత్తరాన చిన్న మసలేంబు దీవులు (40.85 చకిమీ) (మద్య మదురా, కలిమంతన్). ప్రధాన భూభాగం (అనగా మదుర ద్వీపంలోని ప్రాంతం)లో 17 జిల్లాలను ఉన్నాయి. వీటి వైశాల్యం 11,46.93 చకిమీ (2010 లో వీటిలో నివసించిన నివాసుల సంఖ్య 7,51,833). ద్వీపాల వైశాల్యం 946.53 చకిమీ (2010 లో నివాసుల సంఖ్య 2,90,479) కలిగిన 128 ద్వీపాలలో 9 జిల్లాలను ఉన్నాయి. ఈ ద్వీపాలలో 46 మంది మాత్రమే నివసిస్తున్నారు.[3] [4] 2014 అంచనాలు [5]

ఆర్థికం

మార్చు
 
Salt making in Madura in 1948

తూర్పు జావా ప్రావిన్స్‌లోని అత్యంత పేద ప్రాంతాలలో మదురా ఒకటి.[6] జావా మాదిరిగా ఇక్కడి మట్టి వ్యవసాయానికి అనుకూలమైనంత సారవంతమైనది కాదు. పరిమిత ఆర్థిక అవకాశాలు దీర్ఘకాలిక నిరుద్యోగం ద్వీపవాసులను పేదరికానికి నెట్టడానికి దారితీశాయి. ఇక్కడి పరిస్థితులు ద్వీపవాసులు దీర్ఘకాలం నుండి ద్వీపం నుండి వెలుపలి ప్రాంతాలకు వలసవెళ్ళడానికి కారణంగా మారాయి. జాతిపరంగా మధుర ప్రజలుగా భావించబడుతున్న ప్రజలు ప్రస్తుతం మదురాలో నివసించడం లేదు. ప్రజలు చాలామంది మదురా నుండి ఇండోనేషియాలోని ఇతర ప్రాంతాలకు వెళ్లి ప్రభుత్వ ట్రాన్స్మిగ్రేషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం ప్రధాన జీవనాధారంగా ఉంటుంది. వ్యవసాయం ఒక ప్రధాన జీవనాధార పంట మొక్కజొన్న. ద్వీపంలో అనేక చిన్న భూస్వాములు ఉన్నారు. ఆర్థిక వ్యవస్థలో పశువుల పెంపకం కీలకమైన భాగంగా ఉంది. ఇది రైతు రైతు కుటుంబాలకు అదనపు ఆదాయాన్ని అందిస్తుంది. మదురలో ప్రసిద్ధ బుల్-రేసింగ్ పోటీలు నిర్వహించబడుతుంటాయి. జీవనాధారాని చిన్న తరహాలో చేపలు పట్టడం కూడా ముఖ్యవనరుగా ఉంది.

ద్వీపం ఆర్థిక వ్యవస్థ పొగాకు ఎగుమతులు కూడా ప్రధాన వనరుగా ఉన్నాయి. మదుర నేల అనేక ఆహార పంటలకు మద్దతు ఇవ్వలేక పోయినప్పటికీ ఇక్కడి వ్యవసాయక్షేత్రాలు దేశీయ క్రెటెక్ (లవంగం సిగరెట్) పరిశ్రమకు అవసరమైన పొగాకు, లవంగాల వంటి మూలపదార్ధాలను ఉత్పత్తిచేయడానికి సహకరిస్తున్నాయి. డచ్ కాలం నుండి ఈ ద్వీపం ఉప్పును ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే ప్రాంతంగా ఉంది.

ద్వీపం పశ్చిమ తీరంలో ఉన్న బంకళన్ 1980 ల నుండి గణనీయంగా పారిశ్రామికీకరణ చేయబడింది. ఇండోనేషియాలోని అతిపెద్ద నగరాలలో ద్వీతీయస్థానంలో ఇన్న ఈ నగరంలో చిన్న ఫెర్రీ రైడ్‌ (సురబయ) నిర్వహించబడుతుండి. అందువల్ల శివారు ప్రాంతం సురబయ రైడ్ ప్రయాణికులకు సేవలు అందిస్తున్న ప్రాంతంగా ఒక ప్రధాన్యత సంతరించుకుంది.

2009 లో ప్రారంభమైన సురబయ-మదుర (సురమడు) వంతెన ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలో బ్యాంకలన్ ప్రాంతం ప్రాధాన్యతను మరింత పెంచుతుందని భావిస్తున్నారు.

సంస్కృతి

మార్చు

ఎద్దుల పరుగుపందాలు

మార్చు
 
సుమెనెప్‌లో ఎద్దుల పందాలు;మదురా

ముదురాలో నిర్వహించబడే ఎద్దుల పోటీ (కరాపాన్ సాపి అని పిలుస్తారు)కి జాకీగా సాధారణంగా ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు. దీనికి పది నుంచి పదిహేను సెకన్ల వ్యవధిలో 100 మీటర్ల దూరాన్ని అధిగమించగల ఒక జత ఎద్దులచే లాగబడే చెక్క స్లెడ్‌ను నడుపుతాడు.

సంగీతకచేరీశాల

మార్చు

మదురాలో అనేక రకాల సంగీతం, నాటకాలు ప్రాచుర్యం పొందాయి. కళాకారులు తమ ప్రతిభతో ముఖ్యంగా పేద ప్రజలకు చవకైన వినోదం, సమాజ నిర్మాణానికి అవసరమైన సందేశాన్ని అందిస్తారు. తాంపెంగు థియేటరులో ప్రదర్శించబడే ప్రాంతీయ సంస్కృతిక ప్రదర్శనలలో మదురీ కళాకారులు ముఖానికి ముసుగులను ధరించి ప్రదర్శించే రామాయణం, మహాభారతం వంటి ఇతిహాస కథలు బాగాప్రాచుర్యం పొందాయి. అయినప్పటికీ ఈ ప్రదర్శనలు మదురాలో చాలా అరుదుగా నిర్వహించబడుతుంటాయి. సాధారణంగా ఇవి పెద్ద అధికారిక కార్యక్రమాలలో వినోదానికి మాత్రమే పరిమితం చేయబడతాయి. ఫార్మల్ లాడ్రోక్ థియేటరులో ప్రదర్శనలకు ప్రదర్శకులు ముసుగులు ధరించనప్పటికీ విస్తృతమైన ఇతివృత్తాలను ప్రదర్శిస్తారు. ఈ ద్వీపంలో ఇవి ఎక్కువ ప్రాచుర్యం పొందాయి.

క్లాసికల్ జావానీస్ వాయిద్యం అని పిలువబడే గేమెలాన్ ఆర్కెస్ట్రా మదురాలో కూడా ప్రదర్శిస్తారు. ఇక్కడ మాజీ రాజ న్యాయస్థానాలు, బంకళన్, సుమేనేప్ లలో ఉన్న విస్తృతమైన వేదికలలో ప్రదృశించబడుతుంటాయి. టోంగ్టాంగ్ సంగీతం, మదురాకు మాత్రమే ప్రత్యేకమైనది. ఇందుకు అనేక చెక్క లేదా వెదురు డ్రమ్‌లను వాయిద్యాలుగా ఉపయోగిస్తారు. ఇవి తరచుగా బుల్-రేసింగ్ పోటీలతో పాటు ప్రదర్శించబడుతుంటాయి.

వాణిజ్యం

మార్చు

మదురీలు తమనుతాము అద్భుతమైన నావికులుగా భావిస్తారు. మదురీ నావికులు బోర్నియో వంటి ఇతర ద్వీపాల నుండి బొగ్గులతో నిండిన తమ నౌకలతో ఇండోనేషియా, రష్యా, సింగపూరు మధ్య తమ వాణిజ్యాన్ని నడిపించేవి. మదుర సాంప్రదాయ నౌకలలో గోలెకాన్, లెటి లెటి (లేదా లెతే-లెతే), లిస్-అలిస్, జంగోలన్ ప్రాధాన్యత కలిగి ఉన్నాయి.[7]

మూలాలు

మార్చు
  1. Ricklefs 2008, p. 47.
  2. Akhmad Saiful Ali 1994, p. 62.
  3. BPS Kabupaten Sumenep Archived 2013-01-07 at Archive.today
  4. 2010 Population Census - Jawa Timur Province
  5. http://www.depkes.go.id/downloads/Penduduk%20Kab%20Kota%20Umur%20Tunggal%202014.pdf Archived 2014-02-08 at the Wayback Machine Estimasi Penduduk Menurut Umur Tunggal Dan Jenis Kelamin 2014 Kementerian Kesehatan
  6. JawaPos.com (2017-07-18). "4 Kabupaten di Madura Masuk Daerah Termiskin". radarmadura.jawapos.com (in ఇండోనేషియన్). Jawa Pos Group. Archived from the original on 2020-08-20. Retrieved 2020-08-20.
  7. Clifford W. Hawkins, Praus of Indonesia ISBN 0-333-31810-2 / 0-333-31810-2

బాహ్య లంకెలు

మార్చు