మద్వీరాంజనేయ సమేత కోదండరామస్వామి దేవాలయం

మద్వీరాంజనేయ సమేత కోదండరామస్వామి దేవాలయం గుంటూరు జిల్లా, సీతానగరం గ్రామంలో ఈ దేవాలయం ఉంది.

మద్వీరాంజనేయ సమేత కోదండరామస్వామి దేవాలయం
మద్వీరాంజనేయ సమేత కోదండరామస్వామి దేవాలయం is located in Andhra Pradesh
మద్వీరాంజనేయ సమేత కోదండరామస్వామి దేవాలయం
మద్వీరాంజనేయ సమేత కోదండరామస్వామి దేవాలయం
ఆంధ్రప్రదేశ్ లో ఆలయ ఉనికి
భౌగోళికాంశాలు :16°17′20″N 80°15′46″E / 16.28889°N 80.26278°E / 16.28889; 80.26278
పేరు
ప్రధాన పేరు :మద్వీరాంజనేయ సమేత కోదండరామస్వామి దేవాలయం
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:గుంటూరు
ప్రదేశం:సీతానగరం
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:మద్వీరాంజనేయ సమేత కోదండరామస్వామి దేవాలయం

ఆలయ చరిత్ర మార్చు

పూర్వం ప్రకాశం జిల్లాకి చెందిన అంకమ్మ శ్రేష్టివారి తల్లి కుటుంబం గడవక విజయవాడకు వచ్చి ఒక షావుకారు ఇంట్లో వంట చేయడానికి వచ్చారు.కొడుకుని తల్లి గుగ్గుళ్ళు అమ్ముకురమ్మని చెప్పగా విజయవాడ నుంచి రైల్వేబ్రిడ్జి ద్వారా బయలుదేరి అలసి సీతానగరం వైపు వచ్చి ఒక చెట్టుక్రింద నిద్రపోయాడు. తనని ఎవరో పిలిచినట్లుగా అనిపించి లేచి చూస్తే శ్రీమద్వీరాంజనేయ స్వామి వారు దర్శనమిచ్చి భక్తులు వచ్చుటకై ముళ్ళపొదలు తొలగించాల్సిందిగా ఆదేశించారు. అప్పట్లో ఆ ప్రాంతమంతా అడవిలా ఉండేది శ్రేష్ఠి విజయవాడ వెళ్ళి స్వామి దర్శన విధానం, గురించి తల్లికి, షావుకారుకి చెప్పాడు. వీరాంజనేయస్వామి విగ్రహం దేదీప్యమానంగా ఉండటం తెలుసుకుని షావుకారు ముళ్ళపొదలు తొలగించి మార్గాన్ని ఏర్పాటు చేశారు.1911 సంవత్సరంలోనే దేవాలయాన్ని నిర్మించారు. 1913లో ముఖమండపం నిర్మాణం పూర్తి చేశారు. భక్తులు వీరాంజనేయస్వామి ఉగ్రరూపం తట్టుకోలేక పోయేవారని చెబుతున్నారు.ఎవరైనా తప్పులు చేసి ఆలయానికి వస్తే వస్త్రాలు తగలబడటం వంటి అనర్ధాలు జరిగేవి.ఈ విషయాన్ని పండితుల దృష్టికి తీసుకెళ్లారు.1919లో కోదండరామస్వామిని ప్రతిష్ఠింపజేశారు. స్వామి వారి పవళింపు సేవనిమిత్తం సుందరమైన అద్దాల మండపాన్నిలో నిర్మించారు.[1]

రవాణా సౌకర్యం మార్చు

మూలాలు మార్చు

  1. గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి దేవాలయాలు. ఎన్ ఎస్ నాగిరెడ్డి. 2004. pp. 6, 7 పేజీలు.