మరో ప్రస్థానం 2021లో తెలుగులో విడుదలైన సినిమా. ఉదయ్ కిరణ్ సమర్పణలో హిమాలయ స్టూడియో మాన్షన్స్ బ్యానర్ పై మిర్త్ మీడియా నిర్మించిన ఈ సినిమాకు జాని దర్శకత్వం వహించాడు. తనీష్, భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2021 సెప్టెంబర్ 24న విడుదలైంది.[1][2]

మరో ప్రస్థానం
దర్శకత్వంఎన్. రాఘవన్
నిర్మాతమిర్త్ మీడియా
తారాగణంతనీష్, భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర
ఛాయాగ్రహణంఎంఎన్ బాల్ రెడ్డి
సంగీతంసునీల్ కశ్యప్
నిర్మాణ
సంస్థ
హిమాలయ స్టూడియో మాన్షన్స్
విడుదల తేదీ
2021 సెప్టెంబరు 24 (2021-09-24)
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

క‌బీర్ దుహాన్ సింగ్ అత‌ని గ్యాంగ్ క‌లిసి ముంబైలో వ‌ర‌స నేరాల‌కు పాల్ప‌డుతుంటారు. ఈ గ్యాంగ్‌లో శివ ( త‌నీష్‌) ఓ స‌భ్యుడు. అయితే, ఒక‌రోజు నైని (అర్చ‌నా సింగ్‌) అనే అమ్మాయిని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. ఆ అమ్మాయి కూడా శివ‌ను ఇష్ట‌ప‌డుతుంది. అయితే, గ్యాంగ్‌స్ట‌ర్ వృత్తిలో ఉన్న శివ ఆ వృత్తిని వ‌దిలేద్దామ‌ని అనుకోని క్రైమ్ గ్యాంగ్ నేర‌సామ్రాజ్యాన్ని ప్ర‌పంచానికి చూపించాల‌ని అనుకుంటాడు. గ్యాంగ్ చేస్తున్న నేరాల‌ను సీక్రెట్ కెమేరాలో చిత్రీక‌రిస్తుంటాడు. విల‌న్ చేయ‌బోయే ఓ పెద్ద బాంబ్ బ్లాస్ట్ ను ఆపేందుకు ప్ర‌య‌త్నిస్తుంటాడు. శివ ఈ బాంబ్ బ్లాస్ట్‌ను ఆప‌గ‌లిగాడా లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[3][4]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: హిమాలయ స్టూడియో మాన్షన్స్
  • నిర్మాత:మిర్త్ మీడియా
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: జాని
  • సంగీతం: సునీల్ కశ్యప్
  • సినిమాటోగ్రఫీ: ఎం.ఎన్ బాల్ రెడ్డి
  • ఎడిటింగ్‌: క్రాంతి (ఆర్కే)
  • మాటలు:వసంత కిరణ్, యానాల శివ
  • పాటలు: ప్రణవం

మూలాలు మార్చు

  1. Sakshi (11 September 2021). "డిఫరెంట్ కాన్సెఫ్ట్‌తో తనీష్‌ 'మరో ప్రస్థానం'". Archived from the original on 12 September 2021. Retrieved 12 September 2021.
  2. Andhrajyothy (11 September 2021). "తనీష్ 'మరో ప్రస్థానం' సినిమా స్పెషల్ ఇదే". Archived from the original on 12 September 2021. Retrieved 12 September 2021.
  3. Andrajyothy (24 September 2021). "'మరో ప్రస్థానం' మూవీ రివ్యూ". Archived from the original on 24 September 2021. Retrieved 24 September 2021.
  4. Sakshi (23 September 2021). "'మరో ప్రస్థానం' మూవీ రివ్యూ". Archived from the original on 24 September 2021. Retrieved 24 September 2021.