మల్లికార్జున్ గౌడ్
మల్లికార్జున్ గౌడ్ (14 మే 1941 - 24 డిసెంబరు 2002) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి.[1] ఆయన ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేశాడు.[2] కొంతకాలం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కూడా ఉన్నాడు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున 5వ లోకసభ, 6వ లోక్‌సభ, 7వ లోక్‌సభ, 9వ లోక్‌సభ, 10వ లోక్‌సభ, 11వ లోక్‌సభలలో పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[3] మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు, మెదక్ లోకసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎన్నికయ్యాడు. రైల్వేలు, విద్య, సాంఘిక సంక్షేమం, సమాచార - ప్రసార, రక్షణశాఖలకు కేంద్ర డిప్యూటీ మంత్రి, కేంద్ర రాష్ట్ర మంత్రి హోదాలో భారత కేంద్ర ప్రభుత్వంలో పనిచేశాడు.[4]
మల్లికార్జున్ గౌడ్ | |||
మాజీ పార్లమెంటు సభ్యుడు
| |||
పదవీ కాలం 1980-1984, 1989-1998 | |||
ముందు | జానంపల్లి రామేశ్వరరావు | ||
---|---|---|---|
తరువాత | ఎస్.జైపాల్‌రెడ్డి | ||
నియోజకవర్గం | మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం | ||
మాజీ పార్లమెంటు సభ్యుడు
| |||
పదవీ కాలం 1971-1980 | |||
ముందు | సంగం లక్ష్మీబాయి | ||
తరువాత | ఇందిరా గాంధీ | ||
నియోజకవర్గం | మెదక్ లోకసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | నల్లగండ్ల, మెదక్ జిల్లా, తెలంగాణ | 1941 మే 14||
మరణం | 2002 డిసెంబరు 24 హైదరాబాదు, తెలంగాణ | (వయసు 61)||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
సంతానం | ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె | ||
మతం | హిందూ మతం |
జననం, విద్యాభాస్యం మార్చు
మల్లికార్జున్ గౌడ్ 1941, మే 14న తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా, నల్లగండ్ల గ్రామంలో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి విద్యాభాస్యం పూర్తి చేశాడు.
ఉద్యమ జీవితం మార్చు
ఆయన 1969లో జరిగిన తొలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ముల్కీ, నాన్ ముల్కీ ఉద్యమంలో పాల్గొన్నాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్‌లోనే తెలంగాణ నాయకుల బృందాన్ని ఏర్పాటు చేశాడు.
రాజకీయ జీవితం మార్చు
మల్లికార్జున్ గౌడ్ తెలంగాణ ఉద్యమం సమయంలో ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితిలో కీలక నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆయన 1971లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నర్సింహా రెడ్డి పై 53431 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎంపీగా పార్లమెంట్ లో అడుగు పెట్టాడు. ఆయన 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు. 1980లో ఇందిరాగాంధీ మెదక్ లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేయగా, మల్లికార్జున్ గౌడ్ మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచి, కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.ఆయన అనంతరం 1989, 1991, 1996 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ ఎంపీగా గెలిచాడు. మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ, పివి నరసింహారావుల మంత్రి వర్గాలలో కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి, సమాచారశాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా 1996 నుంచి 1998 వరకు పనిచేశాడు.
నిర్వర్తించిన పదవులు మార్చు
- జూన్ 1980 - ఫిబ్రవరి 1983: కేంద్ర రైల్వే డిప్యూటీ మంత్రి
- నవంబర్ 1981 - ఫిబ్రవరి 1983: కేంద్ర విద్య, సాంఘిక సంక్షేమశాఖ ఉప మంత్రి
- ఫిబ్రవరి 1983 - ఫిబ్రవరి 1984: కేంద్ర సమాచార, బ్రాడ్‌కాస్టింగ్, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ ఉప మంత్రి
- ఫిబ్రవరి 1984 - అక్టోబర్ 1984: కేంద్ర వర్క్స్ అండ్ హౌసింగ్, స్పోర్ట్స్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఉప మంత్రి
- జనవరి 1990-ఆగస్టు 1990: ప్రివిలేజెస్ కమిటీ సభ్యుడు
- మే 1990-91: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు
- 1990-91: కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
- జూన్ 1991-జనవరి 1993: కేంద్ర రైల్వే రాష్ట్ర మంత్రి
- ఏప్రిల్ 1992-మే 1996: కేంద్ర రాష్ట్ర రక్షణ పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి
మరణం మార్చు
మల్లికార్జున్ గౌడ్ 2002 డిసెంబర్ 24న గుండెపోటుతో మరణించాడు.[5][6] 2002 డిసెంబర్ 25న మెదక్ జిల్లా నల్లగండ్ల గ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.[7]ఇతనికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
మూలాలు మార్చు
- ↑ Former Union minister Mallikarjun dead
- ↑ Sakshi (21 March 2019). "తొలి ఉద్యమ సైరన్". Sakshi. Archived from the original on 8 June 2021. Retrieved 8 June 2021.
- ↑ Mallikarjun,Dr. I.N.C., Lok Sabha Members Archived 2008-02-10 at the Wayback Machine
- ↑ "Biographical Sketch of Member of XI Lok Sabha (MALLIKARJUN, DR.)". loksabhaph.nic.in. Archived from the original on 2020-11-27. Retrieved 2021-12-15.
- ↑ Rediff (25 December 2002). "Former Union minister Mallikarjun dead". www.rediff.com. Archived from the original on 8 June 2021. Retrieved 8 June 2021.
- ↑ Mallikarjun Cremated with State Honours
- ↑ Mallikarjun Cremated with State Honours