మల్లేపల్లి లక్ష్మయ్య
మల్లేపల్లి లక్ష్మయ్య, తెలంగాణకు చెందిన జర్నలిస్టు, సామాజికవేత్త.[1][2] 2009 వరకు వార్త, ఆంధ్రజ్యోతి వంటి అనేక మీడియా సంస్థలలో పనిచేశాడు. హెచ్.ఎం.టి.వి. తెలుగు న్యూస్ ఛానల్ వ్యవస్థాకులలో ఒకడు.[3] ప్రస్తుతం బుద్ధవనం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
మల్లేపల్లి లక్ష్మయ్య | |
---|---|
![]() | |
జననం | |
వృత్తి | జర్నలిస్టు, సామాజికవేత్త. |
జీవిత విషయాలుసవరించు
మల్లేపల్లి లక్ష్మయ్య 1961, జూలై 16న తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనిలో జన్మించాడు. అణగారిన వర్గాల వారిపై భూస్వాముల అణచివేతను ధిక్కరించిన తన మేనమామను చూసి చిన్నతనంలోనే లక్ష్మయ్య ప్రేరణ పొందాడు. దాంతో తన 26 ఏళ్ళ వయసులో 1987లో వామపక్ష భావజాలానికి కట్టుబడి భారతీయ కమ్యునిస్టు పార్టీ (ఎంఎల్)లో భాగమయ్యాడు. జైలుకు కూడా పంపించబడ్డాడు. విడుదలైనప్పుడు తరువాత, న్యాయవాద వృత్తిని ఆపివేసి జర్నలిజాన్ని ఎంచుకున్నాడు. తన రచనల ద్వారా దౌర్జన్యాలను, దళిత వర్గాల దయనీయ స్థితిని బయటపెట్టాడు.
వృత్తిరంగంసవరించు
మల్లేపల్లి లక్ష్మయ్య తెలుగులో ఉన్న ప్రముఖ దినపత్రికల్లో పనిచేశాడు. ప్రత్యేక తెలంగాణ, దళితవాదం, ఇతర సామాజిక అంశాలపై పత్రికలలో అనేక వ్యాసాలు రాశాడు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2009లో తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఉద్యమంలో చేరాడు. కొంతమంది తో కలిసి హెచ్‌ఎమ్‌టివిని స్థాపించి, కొంతకాలం ఇన్‌పుట్ ఎడిటర్ గా పనిచేశాడు. 2016, మే నెలలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్మయ్యను బుద్ధవనం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ గా నియమించాడు.
తెలంగాణ ఉద్యమంసవరించు
తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిననాటినుండి పార్టీకి సలహాదారుడిగా ఉన్నాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఏర్పాటయిన జాయింట్ యాక్షన్ కమిటీ కో-ఛైర్మెన్ కూడా పనిచేశాడు.[4] సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్‌కు సమన్వయకర్తగా కూడా ఉన్నాడు.
నిర్వహించిన పదవులుసవరించు
- విద్యావంతుల వేదిక స్టీరింగ్ కమిటీ చైర్మన్
- సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్
మూలాలుసవరించు
- ↑ "Archive News". The Hindu. 2011-03-14. Archived from the original on 2011-03-18. Retrieved 2022-01-17.
- ↑ "'Political set-up responsible for SCSP fund diversion' - ANDHRA PRADESH". The Hindu. 2011-03-14. Retrieved 2022-01-17.
- ↑ "Archive News". The Hindu. 2011-04-11. Archived from the original on 2011-04-16. Retrieved 2022-01-17.
- ↑ http://www.siasat.com/english/news/%E2%80%98political-set-responsible-scsp-fund-diversion