మహంకాళి 2013 మార్చి 8న విడుదలైన తెలుగు చిత్రం. డా.రాజశేఖర్, మధురిమ ప్రధాన పాత్రధారులుగా జీవిత దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం. ఎస్.ఎస్.మూవీస్ పతాకంపై ఏలూరు సురేంద్ర రెడ్డి, ఎ. పద్మనా రెడ్డి, ఎస్.ఆర్.మురళి లు నిర్మించిన ఈ సినిమాకు ఎస్.చిన్నా సంగీతాన్నందించాడు.[1]

మహంకాళి
చిత్ర ప్రచార పత్రిక
దర్శకత్వంజీవిత
నిర్మాతఏలూరు సురేందర్ రెడ్డి, ఎ.పరంధామరెడ్డి
తారాగణండా.రాజశేఖర్
మధురిమ
జీవా
ప్రదీప్ రావత్
ఛాయాగ్రహణంమధు. ఎ. నాయుడు
సంగీతంఎస్. చిన్నా
నిర్మాణ
సంస్థ
ఎస్ .ఎస్ .మూవీస్
విడుదల తేదీ
8 మార్చి 2013 (2013-03-08)
సినిమా నిడివి
131 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

మహంకాళి (రాజశేఖర్) ఓ పోలీసు అధికారి. విదేశాల్లోఉండే అర్షద్ భాయ్ అన్ని రకాల విద్రోహకర వ్యాపారాలు నడుపుతూ తన భయంలో బతకాలని బాంబు పేలుళ్ళు కూడా జరుపుతుంటాడు. అలా ఆర్షద్ పై పట్టు సాధించి అతనిని పట్టుకొని చట్టం ముందు నిలబెట్టాలన్న దీక్షతో మహంకాళి పనిచేస్తుంటాడు. అర్షద్ బినామీ జయక్క (నళీని) సంఘంలో పెద్దమనిషిగా చెలామణి అవుతూ అతడు చెప్పిన పనులు చేయిస్తూ ఉంటుంది. మహంకాళి దొరికిన నేరస్థులను వదలకుండా ఎన్ కౌంటర్ చేస్తుంటాడు. అర్షద్ వ్యాపారాలన్నింటికీ అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తుంటాడు. హోం మినిస్టర్, సుదర్శన్ రెడ్డి ( జీవా) సహకారంతో అర్షద్ తో పోరాడు తుంటాడు. మహంకాళి, జయక్క ఇల్లు, ఫ్యాక్టరీలను సోదా చేసి ఆమెను అరెస్టు చేస్తాడు. జయక్క అరెస్టు ఆపకపోతే హోం మినిస్టర్ సొంత ఊరిలోని బంధువులను చంపుతానని అర్షద్ బెదిరిస్తాడు. హోం మినిస్టరు వద్దని వారించినా అరెస్టు చేసి తీసుకెళుతూ ఉండగా, జయక్క అనూయాయులు దాడి చేస్తారు. ఆ దాడిలో ఇద్దరు అమాయకులను ఎన్ కౌంటర్ చేశాడన్న నెపంతో మహంకాళిని సస్పెండ్ చేస్తారు. ముష్కరులతో కలిసి పనిచేస్తున్నాడనే అభియోగంతో జైలుకు పంపుతారు. మహంకాళి ప్రేయసి తనీషా (మధురిమ) హత్య చేసిన వారిని వేటాడి చంపుతాడు అర్షద్. అప్పటి నుండి మహంకాళి అర్షద్ తరపున పనిచేయడానికి పూనుకుంటాడు. పోయిన ఉద్యోగం వెంటనే అతడికితిరిగి వస్తుంది. తన శత్రువులైన నాయక్ ముఠాను నిర్మూలించమని అర్షద్ చెపగా, మహంకాళి అలాగే చేస్తాడు. అలా అలా అతడి నమ్మకాన్ని పొంది చివరికి అతడి పైనే తన ధ్యేయాన్ని ఎలా సాదించుకున్నాడనేది క్లైమాక్స్.

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • సంగీతం: చిన్నా
  • నిర్మాతలు: ఏలూరు సురేందర్ రెడ్డి, ఎ.పరంధామరెడ్డి
  • దర్శకత్వం; జీవితా రాజశేఖర్

మూలాలు

మార్చు
  1. "Mahankali (2013)". Indiancine.ma. Retrieved 2021-06-12.

బయటి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=మహంకాళి&oldid=4212140" నుండి వెలికితీశారు