మహాజనానికి మరదలుపిల్ల

మహాజనానికి మరదలుపిల్ల 1990 లో విడుదలైన తెలుగు హాస్య చిత్రం. వల్లభనేని జనార్ధన్ దర్శకత్వంలో విజయ బాపినీడు పర్యవేక్షణలో [1] రాశి మూవీ క్రియేషన్స్ పతాకంపై ఎం నరసింహారావు నిర్మించాడు [2] రాజేంద్ర ప్రసాద్, నిరోషా ముఖ్య పాత్రల్లో నటించారు, ఉపేంద్ర కుమార్ సంగీతం సమకూర్చాడు.[3] 1989 నాటి కన్నడ చిత్రం నంజుండి కల్యాణకు రీమేక్.[4] ఒరిజినల్ మూవీకి పాటలు కంపోజ్ చేసిన ఉపేంద్ర కుమార్, ఒరిజినల్ లోని మొత్తం ఆరు పాటలనూ తెచ్చాడు.

మహాజనానికి మరదలుపిల్ల
(1990 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం వల్లభనేని జనార్ధన్
నిర్మాణం ఎం. నరసింహారావు
కథ ఉదయ్ కుమార్
చిత్రానువాదం విజయ బాపినీడు
తారాగణం రాజేంద్రప్రసాద్
సంగీతం కె. చక్రవర్తి
సంభాషణలు కాశీ విశ్వనాథ్
కూర్పు త్రినాథ్
నిర్మాణ సంస్థ రాశి మూవీ క్రియేషన్స్
భాష తెలుగు

కథ మార్చు

డాక్టర్ రామ్మూర్తి (సత్యనారాయణ) తన బావ నారాయణరావు (శ్రీధర్) కుటుంబంతో (భార్య సీత (శుభ), వారి ముగ్గురు కుమార్తెలు) పాటు నివసిస్తూంటాడు. ఒకసారి తీవ్రమైన ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి మందుల కోసం రామ్మూర్తికి డబ్బు అవసరమై, నారాయణరావును అడగ్గా అతడు నిరాకరిస్తాడు. రోగి మరణిస్తాడు. ఫలితంగా, కుటుంబం రెండుగా విడిపోతుంది. రామ్మూర్తి తన భార్య, పిల్లలతో ఇంటి నుండి వెళ్ళిపోతాడు. 20 సంవత్సరాల తరువాత, నారాయణరావు తన కుమారుడు రవి (రాజేంద్ర ప్రసాద్) కి ఏమి జరిగిందో చెబుతాడు. రవికి తన పెద్ద మేనకోడలు దేవి (నిరోషా) తో వివాహం చెయ్యాలని అనుకున్నామని కూడా చెబుతాడు. ఇప్పుడు, రవి దేవిని వివాహం చేసుకుని రెండు కుటుంబాలను తిరిగి కలపాలని నిర్ణయించుకుంటాడు. అత్తకు తాను కిష్టయ్యనని చెప్పి దగ్గరకు చేరతాడు. 20 సంవత్సరాల క్రితం మరణించిన తన తండ్రి చిన్న కుమారుడు కిష్టయ్యగా నటిస్తాడు. రామ్మూర్తి, అతని కుటుంబం అతను నిజంగానే కిష్టయ్య అని నమ్ముతారు. దేవి గర్విష్ఠి. అహంకారి. పెళ్ళి పట్ల ఆసక్తి లేదు. కిష్టయ్య చివరికి దేవిని వివాహం చేసుకునేందుకు ఒప్పిస్తాడు. వారు తిరిగి తన గ్రామానికి వెళతారు. అక్కడ అతను తన తల్లిదండ్రుల ఇంట్లో సేవకుడిగా పనిచేస్తాడు. చివరికి, దేవి తన అహంకారాన్ని వదిలించుకుంటుంది. వారి చిన్న ఇంట్లో తన భర్తతో సరళమైన జీవితంతో సంతృప్తి చెందుతుంది. చివరికి నిజం బయటకు వస్తుంది. చివరగా, కిష్టయ్య రవేననే నిజం అందరికీ తెలుస్తుంది.

నటీనటులు మార్చు

పాటలు మార్చు

ఒక రామ కధ , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

కోక తడిసిన , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , మంజుల గురురాజ్

ఇస్పెట్ పాప , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

మహాజనానికి మరదలు పిల్ల , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

మనువే మధురం , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

తప్ప తాగితే , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , మంజుల గురురాజ్ .

భువన చంద్ర రాసిన పాటలకు ఉపేంద్ర కుమార్ సంగీతం అందించాడు.[5]అన్ని పాటల రచయిత భువన చంద్ర, ఈ చిత్రం లోని అన్ని పాటలు స్వరపరిచి సంగీతం అందించింది ఉపేంద్ర కుమార్.

క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. ""ఒక రామ కథ""  ఎస్.పి. బాలసుబ్రహమణ్యం 5:01
2. ""కోక తడిపిన""  ఎస్.పి. బాలసుబ్రహమణ్యం, మంజులా గురురాజ్ 4:25
3. ""ఇస్పేటు పాపా""  ఎస్.పి. బాలసుబ్రహమణ్యం 3:30
4. ""మహాజనానికి మరదలు పిల్లా""  ఎస్.పి. బాలసుబ్రహమణ్యం 4:04
5. ""మనువే మధురం""  ఎస్.పి. బాలసుబ్రహమణ్యం 3:30
6. ""తప్ప తాగితే""  మంజులా గురురాజ్ 4:20

మూలాలు మార్చు

  1. "Mahajananiki Maradalu Pilla (Direction)". Spicy Onion.
  2. "Mahajananiki Maradalu Pilla (Banner)". Know Your Films.
  3. "Mahajananiki Maradalu Pilla (Review)". The Cine Bay. Archived from the original on 2018-10-04. Retrieved 2020-08-06.
  4. "Mahajananiki Maradalu Pilla (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-10-04. Retrieved 2020-08-06.
  5. "Mahajananiki Maradalu Pilla (Songs)". Cineradham.