మహ్మద్ జమా తెలుగు రంగస్థల, టీవీ, సినీ నటుడు. ఇప్పటివరకు వందకు పైగా నాటకాలు, యాభైకి పైగా సీరియల్స్, యాభైకి పైగా సినిమాల్లో నటించాడు.[1]

మహ్మద్ జమా
జననంఫిబ్రవరి 27, 1951
తెలంగాణ
ప్రసిద్ధిరంగస్థల, టీవీ, సినీ నటుడు

జననం - ఉద్యోగం మార్చు

జమా 1951, ఫిబ్రవరి 27న మహ్మద్‌ మూసా సాహె బ్‌, అమీరున్సీసాబేగం దంపతులకుఖమ్మం జిల్లాలో జన్మించాడు. చిన్నతనమంతా ఖమ్మం, రాజమండ్రి ప్రాంతాల్లో గడిచింది.

జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ (ఖమ్మం)లో సూపర్‌వైజర్‌గా 35 ఏళ్లు పనిచేసి, 2005లో పదవి విరమణ చేశాడు.

రంగస్థల ప్రస్థానం మార్చు

జమా తండ్రి రాజమండ్రిలో టైలర్ గా పనిచేసే సమయంలో నాటకాలు ప్రదర్శించడమేకాకుండా హైదరాబాదుకు వచ్చిన తరువాత నిజాంకాలంలో వీధి నాటకాల్లో నటించాడు. చిన్నతనంలోనే నాటక ప్రదర్శనలు చూసిన జమాకు నాటకాలపై ఆసక్తి కలిగి, తానుకూడా నటించాలని అనుకున్నాడు. వీలున్నప్పుడు చిన్నచిన్న నాటికల్లో నటిస్తూ ఉండేవాడు.

ఉద్యోగ విరమణ తరువాత హైదరాబాదుకు వచ్చి నటనలో అవకాశాల కోసం వివిధ సినిమా ఆఫీసులు, నాటక సంస్ధల దగ్గరకు వెళ్లాడు. మిత్రుల సహకారంతో నాటకాల్లో నటించడం ప్రారంభించాడు. 2010నుండి అనేక ప్రదర్శనలు చేశాడు.

టీవిరంగ ప్రస్థానం మార్చు

ముద్దబిడ్డ, మనసు మమత, మాయాబజార్‌, అత్తారింటికి దారేది, కుంకుమ పువ్వు వంటి దాదాపు 50కి పైగా సీరియల్స్‌లో నటించాడు. 2012లో దూరదర్శన్‌లో ప్రసారమైన జ్ఞాపకాలు అనే టెలిఫిలింలో జమా నటనకు నంది అవార్డు లభించింది.

సినిమారంగ ప్రస్థానం మార్చు

అంకురం, వీర తెలంగాణ, పోరు తెలంగాణ, కుబుసం, నేనింతే, ఓయ్! వంటి యాభైకి పైగా సినిమాల్లో నటించాడు.

బహుమతులు - పురస్కారాలు మార్చు

  1. నంది పురస్కారం, ఉత్తమ హాస్య నటుడు - శతృవు (నాటకం) 2011
  2. నంది పురస్కారం - జ్ఞాపకాలు (టెలిఫిలిం, దూరదర్శన్‌, 2012)

మూలాలు మార్చు

  1. ఆంధ్రజ్యోతి, నవ్య-ఓపన్ పేజీ (3 February 2019). "60 ఏళ్ల తర్వాత యాక్షన్". Archived from the original on 4 February 2019. Retrieved 27 February 2019.