మాచర్ల జగన్నాథం గౌడ్
మాచర్ల జగన్నాథం గౌడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాడు.[1][2][3] మాచర్ల జగన్నాథం గౌడ్ గారు మాజీ శాసనసభ్యులు ఉమ్మడి ఏపీ గీత పారిశ్రామిక సహకార సంస్థ మొట్టమొదటి చైర్మన్.
మాచర్ల జగన్నాథం గౌడ్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1978 నుండి 1988 | |||
నియోజకవర్గం | వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
మరణం | 30 ఏప్రిల్, 2021 హైదరాబాదు, తెలంగాణ | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
మతం | హిందూ |
రాజకీయం
మార్చుమాచర్ల జగన్నాథం గౌడ్ స్వాతంత్రం రాకముందు నిజాం నవాబుకి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలు జీవితం గడిపిన వ్యక్తి. స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి సామాన్య కార్యకర్త నుండి శాసనసభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ కల్లుగీత సహకార సంస్థ అధ్యక్షులుగా ఎన్నికైన మొట్టమొదట వ్యక్తి.
మాచర్ల జగన్నాథం గౌడ్ 1978లో వర్ధన్నపేట నియోజకవర్గం నుండి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి పురుషోత్తంరావు తక్కళ్లపల్లి పై 20118 ఓట్ల మెజారిటీతో శాసనసభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యాడు. 1983లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి బిజెపి అభ్యర్థి వన్నాల శ్రీరాములు పై 20960 ఓట్ల ఆధిక్యంతో గెలిచి రెండవసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు.[4]
మరణం
మార్చుజగన్నాథం గౌడ్ అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ 2021, ఏప్రిల్ 30న మరణించాడు.[5]
మూలాలు
మార్చు- ↑ Prabha News (30 April 2021). "వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథం గౌడ్ కన్నుమూత". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.
- ↑ Mana Telangana (30 April 2021). "వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కన్నుమూత... సిఎం కెసిఆర్ సంతాపం". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.
- ↑ Telangana Today. "CM KCR mourns death of former MLA Jagannadham Goud". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.
- ↑ Namasthe Telangana (30 April 2021). "వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే మృతికి సీఎం కేసీఆర్ సంతాపం". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.
- ↑ Andhrajyothy (30 April 2021). "మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథం కన్నుమూత". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.