ప్రధాన మెనూను తెరువు

మాడభూషి అనంతశయనం అయ్యంగారు

మాడభూషి అనంతశయనం అయ్యంగారు స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు మరియు లోక్‌సభ స్పీకరు. ఇతడు 1891, ఫిబ్రవరి 4 తేదీన చిత్తూరు జిల్లా, తిరుచానూరు లో వెంకట వరదాచారి దంపతులకు జన్మించాడు. పచ్చయప్ప కళాశాల నుండి బి.ఏ.పట్టా పొందిన పిదప మద్రాసు లా కాలేజీ నుండి 1913లో బి.ఎల్. పట్టా పొందారు. ఇతని స్వస్థలం తిరుపతి లో గణిత ఉపాధ్యాయునిగా పనిచేసి, తరువాత న్యాయవాదిగా 1915 -1950 వరకు నిర్వహించాడు. మహాత్మా గాంధీ సందేశం మేరకు స్వాతంత్ర్య సమరంలో (వ్యక్తి సత్యాగ్రహం మరియు క్విట్ ఇండియా) పాల్గొని రెండు సార్లు కఠిన కారాగార శిక్ష అనుభవించాడు.

మాడభూషి అనంతశయనం అయ్యంగారు
మాడభూషి అనంతశయనం అయ్యంగారు


2 వ లోకసభ స్పీకరు
పదవీ కాలము
మార్చి 8, 1956 – ఏప్రిల్ 16, 1962
ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ
ముందు గణేష్ వాసుదేవ్ నావలంకర్
తరువాత సర్దార్ హుకుం సింగ్

తిరుపతి లోక్ సభ సభ్యులు.
పదవీ కాలము
1951 – 1962
ముందు None
తరువాత C. Dass

వ్యక్తిగత వివరాలు

జననం ఫిబ్రవరి 4, 1891
Thiruchanoor
మరణం మార్చి 19, 1978
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకులు
మతం హిందూ మతము

1934లో మొదటిసారిగా కేంద్ర శాసనసభలో సభ్యునిగా ఎన్నుకోబడ్డాడు. భారత స్వాతంత్ర్యం అనంతరం జరిగిన మొదటి సాధారణ ఎన్నికలలో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం నుండి మరియు రెండవ లోక్‌సభ ఎన్నికలలో చిత్తూరు నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు.

1948లో మొదటి లోక్‌సభలో డిప్యూటీ స్పీకరుగా తరువాత 1956లో స్పీకరుగా ఎన్నుకోబడ్డాడు. 1962లో బీహార్ గవర్నరుగా నియమితులై 1967 వరకు ఆ పదవిలో ఉన్నాడు.

కేంద్రీయ సంస్కృత విద్యాపీఠానికి అధ్యక్షులుగా 1966లో ఎన్నుకోబడి చివరిదాకా ఆ పదవి నిర్వహించాడు.

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఇతడు 1978 మార్చి 19న తిరుపతిలో పరమపదించాడు. ఇతని జ్ఞాపకార్ధం 2007 సంవత్సరంలో కంచు విగ్రహాన్ని తిరుపతి పట్టణంలో నెలకొల్పారు.[1]

ఇతని కుమార్తె పద్మా సేథ్ ఢిల్లీ బాలభవన్ అధ్యక్షురాలిగా, మహిళా కమిషన్ సభ్యురాలిగా, సుప్రీం కోర్టు న్యాయవాదిగా, యునిసెఫ్ సలహాదారుగా పనిచేసినది.

మూలాలుసవరించు

  • http://speakerloksabha.nic.in/former/ayyangar.asp
  • 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
  • ఢిల్లీ ఆంధ్ర ప్రముఖులు, డా.ఆర్.అనంత పద్మనాభరావు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2000.