మాదాల రవి తెలుగు సినిమా నటుడు. తండ్రి మాదాల రంగారావు నిర్మించిన చిత్రాల్లో బాలనటుడిగా కనిపించిన రవి నేనుసైతం చిత్రం ద్వారా హీరో అయ్యాడు.[1]

నేనుసైతం సినిమా పోస్టర్

జీవిత విశేషాలు

మార్చు

అతను ప్రముఖ విప్లవ నటుడు మాదాల రంగారావు కుమారుడు. అతను 1981లో ధవళ సత్యం దర్శకత్వంలోని ఎర్రమల్లెలు సినిమాలో జనాదరణ పొందిన పాట "నాంపల్లి స్టేషన్ కాడ రాజాలింగో" పాటద్వారా బాలనటునిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఆ చిత్రం ద్వారా బాలనటునిగా అనేక పురస్కారాలు పొందాడు. అతను చెన్నైలోని మైలాపూర్లో ఉన్న కేసరి హయ్యర్ సెకండరీ స్కూలు లో చదివాడు. తరువాత రష్యా లోని రోస్తోవ్ స్టేట్ మెడికల్ విశ్వవిద్యాలయంలోవైద్య విద్యను అభ్యసించాడు. అతను గాస్ట్రో ఎంటరాలజిస్టుగా వైద్యునిగా తన సేవలందిస్తున్నప్పటికీ తన తండ్రిలా సినిమా నటుడు కావాలని కలలు కనేవాడు. అతను వైద్య విద్యార్థిగా, వైద్యవృత్తిని చేపట్టి 14 సంవత్సరాల పాటు రష్యాలో ఉన్నాడు. అతను ప్రోమినెంట్ ఫార్మాసిటికల్ కంపెనీకి మేనేజింగ్ డైరక్టరుగా ఉన్నాడు. తన వైద్య వృత్తిని కొనసాగిస్తూనే, తెలుగు సినిమా ప్రస్తుత ధోరణిని పర్యవేక్షించి, స్వదేశానికి తిరిగి వచ్చాడు. భరత్ ప్రొడక్షన్స్ అని పిలవబడే తన సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను భారత్, యూరప్, రష్యాలో 60 రంగస్థల ప్రదర్శనలు చేసాడు.

2004 లో, అతను తన స్వంత భ్యానర్ క్రింద దవళ సత్యం దర్శకత్వంలో "నేనుసైతం" సినిమాలో నటించడం ద్వారా తెలుగు చిత్రసీమలోనికి అడుగుపెట్టాడు. అతని ఇతర సినిమాలలో మా ఇలవేల్పు లో వైద్యునిగా నటించాడు. అతని మూడవ చిత్రం "వీరగాధ". ఈ సినిమా తరువాత, అతను కొన్ని వ్యక్తిగత వ్యాపారాలు, బాధ్యతల వలన నటన నుండి దూరంగా ఉన్నాడు. 2014 లో, అతను సినిమా పరిశ్రమకు తిరిగి వచ్చాడు. అతను బ్రోకర్ 2 చిత్రంలో పనిచేసాడు, అక్కడ అతను సానుకూల ప్రతిస్పందనను సంపాదించాడు. తరువాత పంచముఖి చిత్రంలో ప్రధానపాత్రలో నటించాడు. అతను యువతరం కదిలింది, స్వరాజ్యం, అలౌకిక, పంచముఖి వంటి సినిమాలలో నటించాడు. అతను హిందీలో "ఆజ్ కా ఇంక్విలాబ్", "నాగ లక్ష్మి" చిత్రాలలో నటించాడు. [2]

రాజకీయాల్లో

మార్చు

తండ్రి ఆదర్శాలను భుజాన ఎత్తుకొని ప్రజా పోరాటాల్లో పాలు పంచుకొంటున్నాడు. చిన్నప్పటి నుంచి ప్రజా నాట్యమండలితో అతనికి అనుబంధం ఉంది. ప్రపంచ యువజన ఫెడరేషన్ కు నాయకునిగా భాద్యతలు నిర్వర్తిస్తున్నాడు. అతను ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ సంస్థలలో పనిచేసాడు. యూరోపియన్ దేశాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. జీఐఎస్ దేశాలకు ప్రాతినిథ్యం వహిస్తూ రష్యాలో కల్చరల్ విభాగానికి సెక్రెటరగా పనిచేశాడు. అతను సీపీఐ, సీపీఎం పార్టీలు నిర్వహిస్తున్న అన్ని ఉద్యమాలలో అనేక బాధ్యతలను చేపడతున్నాడు. అతను అన్ని వామపక్ష పార్టీలను ఏకం చేయాలనే కార్యచరణను చేపట్టాడు[1].

అతను రాజకీయాల్లో కూడా ప్రత్యక్ష, పరోక్ష సేవలందిస్తున్నాడు. సినీ ప్రముఖులు అల్లు రామలింగయ్య, మిక్కిలినేని, మదుసూధన్‌రావు, ప్రకాశ్ రావు, టీ కృష్ణ, మాదాల రంగారావు లాంటి వ్యక్తులు సేవలందించిన ప్రజా నాట్యమండలి కి వామపక్ష పార్టీలతో అనుబంధం ఉంది. ప్రస్తుతం లెఫ్ట్ పార్టీలను ఏకంగా చేయాలని, ఒకే భావం జాలం ఉండి వేర్వేరుగా పార్టీలుగా ఉండే వామపక్ష పార్టీలను మళ్లీ కలిపి ఒకటిగా చేయాలనే కార్యచరణ చేపట్టాడు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "కెసిఆర్ మూడెకరాలు ఇస్తానని చెప్పి.. ప్రభుత్వాలు అంతే: మాదాల రవి".
  2. "biography of madala ravi".
"https://te.wikipedia.org/w/index.php?title=మాదాల_రవి&oldid=3281592" నుండి వెలికితీశారు