మాధవధార

విశాఖపట్నం నగరంలోని ఒక శివారు ప్రాంతం.

మాధవధార, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని శివారు ప్రాంతం.[1][2]

మాధవధార
సమీపప్రాంతం
మాధవస్వామి దేవాలయ రోడ్డు
మాధవస్వామి దేవాలయ రోడ్డు
మాధవధార is located in Visakhapatnam
మాధవధార
మాధవధార
విశాఖట్నం నగర పటంలో మాధవధార స్థానం
Coordinates: 17°44′42″N 83°15′53″E / 17.744948°N 83.264600°E / 17.744948; 83.264600
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530007
Vehicle registrationఏపి-31

భౌగోళికం

మార్చు

ఇది 17°44′42″N 83°15′53″E / 17.744948°N 83.264600°E / 17.744948; 83.264600 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

సమీప ప్రాంతాలు

మార్చు

ఇక్కడికి సమీపంలో శ్రీ విజయనగర్ నావల్ కాలనీ, డిఎల్ఎస్ కాలనీ, సంజీవయ్య కాలనీ, శాంతి నగర్, మర్రిపాలెం మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

గురించి

మార్చు
 
రాధామాధవస్వామి ఆలయం

ఇది పూర్తిగా కొండలతో కూడివున్న ఈ ప్రాంతం, విశాఖపట్నం నగరంలో ఇది ఒక ముఖ్యమైన నివాస ప్రాంతంగా, అందమైన సహజ ప్రదేశంగా ఉంది. ఇక్కడ రాధామాధవస్వామి, వేణుగోపాలస్వామి వంటి చారిత్రక దేవాలయాలు ఉన్నాయి.[3]

రవాణా

మార్చు

గాజువాక, ఎన్ఏడి ఎక్స్ రోడ్, ద్వారకా నగర్ లతోపాటు నగరంలోని ఇతర ప్రాంతాలతో కలుపబడి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మాధవధార మీదుగా ఎంఎన్ క్లబ్, మురళీనగర్, కైలాసపురం, అక్కయ్యపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ సెంటర్, టౌన్ కొత్తరోడ్, ఓల్డ్ హెడ్ పోస్ట్ ఆఫీస్, డాబాగార్డెన్స్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో మర్రిపాలెం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[4]

మూలాలు

మార్చు
  1. location
  2. "Madhavadhara Locality". www.onefivenine.com. Retrieved 2021-05-15.
  3. about
  4. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 15 May 2021.

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=మాధవధార&oldid=3898296" నుండి వెలికితీశారు