ప్రధాన మెనూను తెరువు

మూస:Humanities

సిలనియోన్ రచించిన తత్వవేత్త ప్లాటో

మానవీయ శాస్త్రాలు అనేది మానవ పరిస్థితిని ప్రధానంగా విశ్లేష, విమర్శక, లేదా భ్రామికైన పద్ధతుల ద్వారా అబ్యాయనం చేసే విద్యా అంశాలు. ఇవి జీవశాస్త్రం మరియు సాంఘిక శాస్త్రాలు ఉపయోగించే సంఖ్యా పద్ధతిని వాడవు.

మానవీయ శాస్త్రాల యొక్క కొన్ని ఉదాహరణలు: ప్రాచీన మరియు ఆదునిక భాష లు, సాహిత్యం, చట్టం, చరిత్ర, తత్వశాస్త్రం, మతం, మరియు దృశ్య మరియు ప్రదర్శన కళలు (సంగీతంతో సహా). మానవీయ శాస్త్రాలలో ఉన్న మరిన్ని సబ్‌జేక్ట్‌లు టెక్నాలజీ, మానవజాతి, ప్రదేశాలు, కమ్యూనికేషన్, సంస్కృతి, మరియు భాషలు. అయితే, వీటిని సాంఘిక శాస్త్రాలు అని తరచూ అనుకుంటారు. మానవీయ శాస్త్రాలని అభ్యసించే వారిని కొన్ని సార్లు "మానవతావాదులు" అని పిలుస్తారు. అయితే, ఈ పదం మానవత్వానికి సంబంధించినదని అందువలన ఈ పదాన్ని మానవీయ శాస్త్రాలను అభ్యసిస్తున్న "మానవతా-వెతిరేక పండితులు తిరస్కరిస్తున్నారు.

విషయ సూచిక

మానవీయ శాస్త్రాలలోని అంశాలుసవరించు

సనాతన గ్రంధాలుసవరించు

 
గ్రీక్ కవి హోమేర్ ఛాతీ

ప్రాశ్చాత్య విద్యారంగ సాంప్రదాయం ప్రకారం, సనాతన రంగం అనేది సనాతన ప్రాచీనత్వ సంస్కృతులను సూచిస్తుంది. అనగా ప్రాచీన గ్రీక్ మరియు రోమన్ సంస్కృతులు. సనాతన రంగం గురించిన అద్యయనం మానవీయ శాస్త్రాలు యొక్క ముఖ్యమైన అంశంగా భావించబడుతుంది; ఐతే, 20వ శాతాబ్దములో వీటి ప్రాదాన్యత తగ్గింది. అయినప్పిటికి, తత్వశాస్త్రం, సాహిత్యం వంటి పలు మానవీయ శాస్త్ర విభాగాలలో సనాతన రంగము యొక్క ప్రభావం పటిష్టంగా ఉంది.

సాంప్రదాయకమైన మరియు విద్యాపరమైన అర్ధం కాకుండా, "సనాతన" అనగా ఇతర ప్రధాన సంస్కృతుల రచనలు కూడా కలిసి ఉంటుంది. ఇతర సంప్రదాయాలలో సనాతన గ్రంథాలు అనగా మెసపటోమియా నుంచి హంమురబి కోడ్ మరియు గిల్గామేష్ ఎపిక్, బుక్ అఫ్ ది డేడ్ అనే ఈజిప్ట్ గ్రంథం, భారత దేశము లోని వేదాలు మరియు ఉపనిషద్లు మరియు కాంఫ్యూషియస్, లావో-త్సే మరియు చైనాకు చెందిన చుంగ్-ట్జు వంటి వారి రచనలు.

చరిత్రసవరించు

చరిత్ర అనగా గతం గురించి పద్ధతి ప్రకారం సేకరించబడిన సమాచారం. విద్యారంగంలో, చరిత్ర అనగా మానవులు, సమాజాలు, సంస్థల గురించిన వివరాల తాత్పర్యము. కాలముతో మార్పు చెందిన ఎయోక్క అంశమైనా దీనిలో కలుస్తుంది. చరిత్ర గురించిన పరిజ్ఞానంలో గత సంఘటనల గురించిన మరియు చారిత్రాత్మక ఆలోచనా విధానం గురించిన పాండిత్యం రెండూ ఉంటాయి.

సాంప్రదాయంగా, చరిత్ర గురించిన అధ్యయనం మానవీయ శాస్త్రాలలో భాగంగా పరిగణించబడుతుంది. ఆధునిక విద్యారంగంలో కొన్ని సార్లు చరిత్ర సాంఘిక శాస్త్రములో భాగంగా సూచించబడుతుంది.

భాషలుసవరించు

ఆధునిక మరియు ప్రాచీన భాషల అధ్యయనమే మానవీయ శాస్త్రము యొక్క ఆధునిక అద్యయనం యొక్క ముఖ్య పాత్ర.

భాషను శాస్త్రీయంగా అద్యయనం చేయడాన్ని భాషాశాస్త్రం అంటారు. ఇది ఒక సాంఘిక శాస్త్రం. మానవీయ శాస్త్రాలకు భాషాశాస్త్రం కేంద్రంగా ఉంటూ ఉంది. ఇరవయవ శాతాబ్ద మరియు ఇరవై ఒకటవ శతాబ్ద సిద్ధాంతాలు ఎక్కువ భాగం భాష ల విశ్లేషణ పై కేంద్రీకరించి ఉండేది. ఆ కాలములో, విట్టజేన్స్టీన్ పేర్కున్న విధముగా, సిద్ధాంతపరమైన గందరగోళాలకు మనం వాడుతున్న పదావళినే కారణమా అనే ప్రశ్నకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది; సాహిత్య సిద్ధాంతం, భాష యొక్క అలంకరణ, సహర్ధక మరియు క్రమపరితమైన అంశాలను అన్వేషించింది; వివిధ కాలపరిమాణాలలో భాష యొక్క అభివృద్ధిని చరిత్రకారులు అభ్యసించారు. గద్యం (నవల వంటివి), కావ్యము, నాటిక వంటి పలు భాషా రూపాలను కలిగిన సాహిత్యం ఆధినిక మానవీయ శాస్త్రాలు కరికులం యొక్క కేంద్ర బ్బగంగా ఉంటుంది. విదేశీ భాషలో కలాశాల స్థాయి ప్రోగ్రాంలలో సహజంగా ఆ భాషతో పాటు ఆ భాషలో కొన్ని ముఖ్య సాహిత్యాలను కూడా అద్యయనం చేయవలసి ఉంటుంది.

చట్టంసవరించు

 
లండన్ లోని ఓల్డ్ బైలీలో ఒక న్యాయస్థానంలో జరుగుతున్న ఒక విచారణ

సహజ పధప్రయోగములో, చట్టం అంటే, సంస్థల ద్వారా అమలు చేయగలే ఒక విధి.[1] చట్టం గురించిన అభ్యయనం సాంఘిక శాస్త్రం మరియు మానవీయ శాస్త్రాల మధ్య ఉన్న హద్దులను దాటుతుంది. చట్టాన్ని ఎల్లప్పుడూ అమలు చేయడం వీలు కాదు, ముఖ్యంగా అంతర్జాతీయ సంబంధాల నేపథ్యంలో. ఈ పదానికి "విధుల వ్యవస్థ", [2] న్యాయాన్ని పొందదైనికై ఒక "వివరనాత్మన సిద్ధాంతం", [3] ప్రజల మంచిని అమలు చేసే ఒక "అధికారం"[4] మరియు "పాలకుడు యొక్క ఆదేశం, ఉల్లంగించేవారికి శిక్ష" అని వివిధ రకాలుగా నిర్వచనం చెప్పబడుతుంది.[5] చట్టం గురించి ఎవరు ఎలాగా అనుకున్నా, అది పూర్తిగా ఒక సామాజిక సంస్థ.

చట్ట విధానం సామాజిక శాస్త్రం మరియు మానవీయ శాస్త్రాల యొక్క ప్రతి అంశాన్ని కలిగి ఉంటుంది. చతాలను రాజకీయాలు అని అనొచ్చు ఎందుకంటే వాటిని సృష్టించేది రాజకీయవేత్తలే. చట్టం ఒక సిద్ధాంతం ఎందుకంటే, నైతిక విలువలే వాటి సిద్ధాంతాలకు రూపం ఇస్తుంది. చట్టం చరిత్ర యొక్క పలు కథలను చెపుతుంది ఎందుకంటే, నియమాలు, కేసులు మరియు కోడులు కాలాలుతో పటు రూపుదిద్దుకుంటాయి. 
చట్టం ఆర్థికవిధానం కూడా ఎందుకంటే ఒప్పందం, సివిల్ నేరాలు, ఆస్తి చట్టం, కార్కికుల చట్టం, సంస్థల చట్టం, ఇవన్ని కూడా ధనాన్ని పంచె ప్రక్రియ పై ప్రభావం చూపుతుంది కనుక. లా అనే నామవాచకం, పురాతన ఆంగ్ల పదమైన లగు నుంచి వచ్చింది. ఈ పదానికి అర్ధం, స్థిరమైనది లేదా నియంత్రించబడినది[6]. లీగల్ అనే విశేషణం లేక్స్ అనే లాటిన్ పదమునుండి వచ్చింది.[7]

సాహిత్యంసవరించు

 
షేక్స్‌పియర్ ఆంగ్ల సాహిత్యంలో అత్యుత్తమ గ్రంథాలను రచించాడు.

"సాహిత్యం" అనేది ఒక సందిగ్దమైన పధం; ఏదో ఒక్క రూపంలో (వాగ్రూపంగా కూడా) ప్రేషణం చేయదానికి సంరక్షించబడిన ఏ యొక్క పదాల శ్రేణినైనా ఈ పధం సూచించవచ్చు; ఐతే, సహజంగా ఈ పధం కథలు, పద్యాలు/1}, నాటికలు వంటి సృజనాత్మక రచనలను సూచిస్తుంది; ఈ పధం, ప్రత్యేక గొప్పతనంతో కూడిన ప్రతిష్టాత్మక రచనలకు మాత్రమే వాడబడుతుంది.

ప్రదర్శక కళలుసవరించు

ప్రదర్శక కళలు ప్లాస్టిక్ కళ లకంటే విభిన్నమైనది. ప్రదర్శక కళ కళాకారుడు యొక్క శరీరం, ముఖం వంటివిని వాడుటే, ప్లాస్టిక్ కళలో మట్టి, లోహం, పెయింట్ వంటిని వాడి ఏదో యొక్క కళావస్తును తయారు చేయబడుతుంది. ప్రదర్శక కళలో కొన్ని: ఆక్రోబాటిక్స్, బస్కింగ్, హాస్యం, నృత్యం, మేజిక్, సంగీతం, ఒపేరా, చిత్రం, జగ్లింగ్, మరియు బ్రాస్ బ్యాండ్ రంగస్థలం వంటి మార్చింగ్ కళలు.

ఇటువంటి కళలలో పాల్గొని ప్రేక్షకల ముందు ప్రదర్శన ఇచ్చే కాళాకారులను ప్రదర్శకుడు అని పిలుస్తారు. వీరిలో కొందరు: నటులు, కమెడియన్లు, నర్తకులు, సంగీతకారులుs, మరియు గాయకులు. ప్రదర్శక కళలతో సంబంధమున్న పాటలు రాయడం, రంగస్థలం వంటి పలు రంగాలలో కళాకారులు ఉన్నారు. ప్రదర్శకులు కాస్ట్యూమ్ మేకప్ సహాయంతో తమ రూపాన్ని మార్చుకుంటూ ఉంటారు. మరొక ప్రదర్శక కళా రూపమైన ఫైన్ ఆర్ట్స్లో కళాకారులు ప్రత్యక్షంగా ప్రేక్షకులు ముందు ప్రదర్శన ఇస్తారు. దీనినే ప్రదర్శక కళ అంటారు. పలు ప్రదర్శక కళలలో ఏదో ఒక రామిన ప్లాస్టిక్ కళ కూడా ఉంటుంది. బహుశా రంగాలంకరణ సామగ్రి రూపంలో. ఆధునిక నృత్య యుగములో నృత్యం ప్లాస్టిక్ కళలో భాగంగా భావించబడుతున్నది.

సంగీతంసవరించు

 
మొజార్ట్యుం, సల్స్‌బర్గ్ లో ఒక సంగీత కార్యక్రమం

సంగీతంభారతీయ సంగీతము, ఒక విద్యారంగ విభాగముగా, వివిధ మార్గాలు తీసుకోవచ్చు. వాటిలో కొన్ని సంగీత ప్రదర్శన, సంగీత విద్యా (సంగీత బోధకులకు శిక్షణ ఇవ్వడం), సంగీత శాస్త్రం, సంగీత చరిత్ర మరియు రూపకల్పన. సంగీతంలో అండర్ గ్రాడ్యువేట్ చదివేవారు, ఈ అన్ని రంగాలలో కోర్సులు చదువుతారు. గ్రాడ్యువేట్ విద్యార్థులు ఒక విశేష రంగం పై కేంద్రీకరిస్తారు. వదాన్యత కళా సంప్రదాయములో, సంగీతకారులు కాని వారికి ఏకాగ్రత మరియు ఆలకించడం వంటి అంశాలలో ప్రావిణ్యం పెంచుకోవడానికి సంగీతాన్ని వాడుతారు.

నాట్యరంగంసవరించు

నాట్యరంగం (గ్రీక్ లో "తియేట్రాన్", θέατρον ) ఒక ప్రదర్శక కళ అంశం. దీంట్లో ప్రేక్షకుల ముందు ఇతర ప్రదర్శక కళా రూపాలైన మాటలు, సైగలు, సంగీతం, నృత్యం, ధ్వని వంటి అంశాలను వాడి కథలను కళాకారులు నటిస్తారు. సాధారణమైన ఉప్స్ఖ్యాన పద్ధతి కాకుండా, నాట్యరంగం ఇతర రూపాలను కూడా తీసుకోవచ్చు. వాటిలో కొన్ని: ఒపేరా, బాలెట్, మైమ్, కబుకి, సాంప్రదాయక భారత నృత్యం, చైనీస్ ఒపేరా, ముంమేర్స్ నాటకం, మరియు పాంటోమైమ్.

నృత్యంసవరించు

డాన్స్ (నృత్యం) (పురాతన ఫ్రెంచ్ భాషలో డాన్సియర్ నుంచి, బహుశా ఫ్రాన్కిష్ నుంచి కావచ్చు) అనే పధం సహజంగా ఒక మానవుడు చేసే కదిలికలను సూచిస్తుంది. ఇది ఒక వ్యక్తీకరణ రూపం కావచ్చు లేదా సామాజిక, ఆధ్యాద్మిక లేదా ప్రదర్శక రంగంలో ప్రదర్శించవచ్చు. మానవులు లేదా జంతువుల (తేనెటీగ నృత్యం, శృంగార నృత్యం) మధ్య వాగ్రూపంగా-కాని సంప్రదింపులను (శరీర భాషను చూడండి) వ్యక్తపరచడానికి మరియు జీవంలేని వసతువుల కదిలికలను (ఆకులు గాలిలో నృత్యమాడాయి ) వ్యక్తపరచడానికి నృత్యం వాడబడుతుంది. నృత్యాన్ని రూపొందించే కళ కోరియోగ్రాఫి అనబడుతుంది మరియు, ఈ పని చేసేవారు కొరియోగ్రాఫర్ అని పిలవబడుతారు.

ఏది నృత్యం అనేది సామాజిక, సాంస్కృతిక, అందం, కళాపూరితమైన, మరియు నైతిక అంశాల బట్టి మారుతుంది. ఇది ప్రమేయాత్మక కదిలిలకలు (జానపద నృత్యం) నుంచి సంహితమైన బాలెట్ వంటి వర్చువసో పద్ధతులు వరకు మారుతుంది. క్రీడాలో, జింనాస్టిక్స్, ఫిగర్ స్కేటింగ్ మరియు ఏక కాలిక ఈత వంటివి నృత్యం లోని విభాగాలే. మార్షియల్ ఆర్ట్స్ 'కట' కూడా నృత్యంతో పోల్చబడుతుంది.

తత్త్వశాస్త్రంసవరించు

 
సోరెన్ కియర్కేగార్డ్ యొక్క రచనలు, తత్వ శాస్త్రం, సాహిత్యం, మతసిద్ధాంతం, మానసికతత్వం, సంగీతం, మరియు సాంప్రదాయక అధ్యయనాలు వంటి మానవీయ శాస్త్రాల యొక్క పలు రంగాలలో ఉండేవి.

తత్త్వశాస్త్రం —పదప్రవర ప్రకారం "వివేకం పై ప్రేమ"—అనేది జీవించి ఉండడం, జ్ఞానం, కారణం, న్యాయం, సత్యం, తప్పు, ఒప్పు అందం, మనసు, భాష వంటి అంశాలను అధ్యయనం చేయడం. ఈ అంశాలను అధ్యయనం చేసే ఇతర మార్గాలనుంచి తత్వశాస్త్రం వేరుబడుతుంది. ఈ శాస్త్రం విమర్శనాత్మక మరియు పద్ధతి ప్రకారమైన మార్గాన్ని ఉపయోగించి, వివెకమైన తర్కాన్ని వాడుతుంది. ఇది పరిశోధనల మీద ఆధారపడదు (పరిశోధనాత్మక తాత్వ శాస్త్రం మినగా).[8]

గతములో తాత్వ శాస్త్రం అనేది చాలా విస్త్రారమైన ఒక పదం. దీనిలో ఉన్న పలు విభాగాలు ఇప్పుడు విడి విభాగాలుగా ఏర్పడ్డాయి. ఉదా:భౌతిక శాస్త్రం (ఇమాన్యువెల్ కంట్ చెప్పినట్లుగా, "పురాతన గ్రీక్ తత్వ శాస్త్రం మూడు శాస్త్రాలుగా విబజించబద్దాయి: భౌతిక శాస్త్రం, నీతి శాస్త్రం మరియ్ తర్క శాస్త్రం.") [9][9] ఈనాడు, తత్వ శాస్త్రం యొక్క ముఖ్య విభాగాలు తర్కం, నీతి, మెటాఫిసిక్స్, మరియు ఎపిస్టమాలజి. కాని ఇప్పటికి ఇతర విభాగాలతొ ఉమ్మడిగా కొన్న అంశాలు ఉంటున్నాయి; ఉదాహరణకు పధార్త శాస్త్రంలో తత్వ శాస్త్రం భాషా శాస్త్రంతొ కలుస్తుంది.

ఇరవయవ శాతబ్ద ప్రారంభమునుండి, విశ్వవిద్యాలయాలో (ముఖ్యంగా ఆంగ్లం మాట్లాడే ప్రదేశాలలో) చేపటుతున్న తత్వశాస్త్రం, ఎక్కువ విశ్లేషంగా మారింది. విశ్లేష తాత్వశాస్త్రం, తర్కం మరియు ఇతర వివేకమైన.[10] గొట్ట్ లోబ్ ఫ్రేజ్, బెర్ట్రాండ్ రస్సేల్, జి.ఈ. మూర్, మరియ్యు లడ్విగ్ విట్జెన్స్టీన్ వంటి తత్వవేత్తలు ఈ పద్ధతిను ప్రారంభించారు.

మతంసవరించు

 
ఈ 13వ శతాబ్ద నాటి కంపాస్ దేవుడు సృష్టికి ఒక చిహ్నం.

కొత్త రాతియుగం లోనే మత నమ్మకం ప్రారంభమయిందని పలువురు చరిత్రకారులు అభిప్రాయం.[ఉల్లేఖన అవసరం] ఈ కాలములో మత నమ్మకం ప్రకారం ఈ క్రింద వాటిని ఆరాధించేవారు: మాతృ దేవత, ఆకాశ తండ్రి, సూర్యుడు, చంద్రుడు. (సూర్య ఆరాధనను చూడండి)[ఉల్లేఖన అవసరం]

తూర్పు మరియు ప్రాశ్చాత్య దేశాలలో సుమారు 6వ శతాబ్ద BC సమయములో కొత్త తత్వాలు మరియు మతాలు ఏర్పడ్డాయి. కాలక్రమేణా, పలు రకాల మతాలు ప్రపంచవ్యాప్తంగా వేలుచాయి. వీటిలో తొలి దశలో వచ్చిన ప్రధాన మతాలు: భారత దేశములో హిందూ మతం, జైనమతం, మరియు బౌద్ధమతం మరియు పెర్షియాలో జోరాస్త్రియ మతం. తూర్పు దేశాలలో, ప్రస్తుతం వరకు ముఖ్యంగా మూడు మత నమ్మకాలు చైనీస్ ఆలోచన పై ప్రభావం చూపాయి: అవి టవోయిజం, లీగలిజం, మరియు కంఫ్యూషియనిజం. తరువాత కాలములో ప్రాబల్యం పొందిన కంఫ్యూషియన్ సాంప్రదాయం, చట్టం యొక్క బలాన్ని కాకుండా, రాజకీయ నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చింది. ప్రాశ్చాత్య దేశాలలో, ప్లేటో మరియు అరిస్టాటిల్ వంటి తత్వవేత్తల గ్రంథాలు కలిగిన గ్రీక్ సిద్దాంత సాంప్రదాయం 4వ శతాబ్దం BCలో అలెక్సాన్డెర్ అఫ్ మసడాన్ యొక్క యుద్ధాల వలన ఐరోపా మరియు మధ్య తూర్పు ప్రాంతాలలో వ్యాపించింది.

ఉమ్మడి సేమితిక్ పారంపర్యం నుంచి ఏర్పడిన మతాలను, అబ్రహమిక్ మతాలుగా పేర్కొంటారు. వీటి మూలం హీబ్రూ బైబిల్/పాత టెస్టమెంట్ లో వివరించబడిన మూలపురుషుడైన అబ్రహం (సిర్కా 1900 BCE) యొక్క అనుచరులు. దీనిలో అతన్ని ఒక ప్రవక్త (జేనేసిస్ 20:7) మరియు కొరాన్ లో అతను ఒక ప్రవక్త అని పేర్కోబడ్డాడు. ఈ సంబంధిత మతాలన్నీ కలిసి ఒక పెద్ద మతాల కూటమిగా ఏర్పడింది. ఈ మతాలు జుడాయిజం, క్రైస్తవమతం మరియు ఇస్లాం.ఈ మతాలను ప్రస్తుతం ప్రపంచంలో సగానికంటే ఎక్కువ జనము పాటిస్తున్నారు.

దృశ్య కళలుసవరించు

దృశ్య కళల చరిత్రసవరించు

 
సాంగ్ డైనస్టికు చెందిన ఎమ్పరోర్ గావోజోంగ్ (1107–1187) గీసిన క్వాట్రైన్ ఆన్ హేవేన్లీ మౌంటైన్; సిల్క్ మీద ఒక ఆల్బం ఆకు వలే ఒక ఫాన్ ఉంచబడింది. నాలుగు వరసలలో కర్సివ్ వ్రాత.

కళ యొక్క గొప్ప సంప్రదాయాలు, ప్రాచీన జపాన్, గ్రీస్, రోమ్, చైనా, భారతదేశం, మెసపటోమియా మరియు మేసోఅమెరికా వంటి నాగరికతల మీద ప్రభావం చూపింది.

ప్రాచీన గ్రీక్ కళ, మానవ శరీర రూపాన్ని ఆరాధించడం, దానికి సంబంధించిన కండల ప్రదర్శన, అందం, సరితూనిక మరియు శారీరకంగా సరైన పరిమాణాలు వంటి నైపుణ్యాలను ఆచరించారు. ప్రాచీన రోమన్ కళ దైవాలను ఆదర్శప్రాయమైన మానవులుగా చిత్రీకరించింది. ఆ దైవాలు ప్రత్యేకమైన అంశాలతో చిత్రీకరించబడ్డారు (ఉదా. జూయాస్ యొక్క పిడుగుపాటు).

మాధ్యమిక యుగమునకు చెందిన బైజాంటైన్ మరియు గోతిక్ కళలో చర్చికి ఎక్కువ ప్రాముఖ్యత ఉండడంతో, భౌతిక వాస్తవాల కంటే బిబ్లికల్ విషయాలే ఉండాలని చర్చి పట్టు పట్టింది. పునరుద్దరణ తరువాత మరల భౌతిక అంశాలకు ప్రాముఖ్యత పెరిగింది. ఇదే మార్పు కళా రూపాలలోను ఏర్పడి, మానవ శరీరం, భూమి యొక్క మూడు-పరిమాణాలు వంటి అంశాలు ప్రదర్శించబడ్డాయి.

తూర్పు ప్రాంతాల కళ ప్రాశ్చాత్య ప్రాచీన కళా రూపము మాదిరిగానే ఉండేది. ఉపరితలంపై రూపాలు చిత్రించటం, స్థానిక రంగు (అనగా, వస్తు యొక్క వాస్తవ రంగు, ఎర్ర దుస్తుకు ఎర్ర రంగు వాడడమే కాని కాంతి, నీడ వంటి అంశాల వలన ఆ రంగులో ఏర్పడే మార్పును కాదు) పై కేంద్రీకరించేవారు. ఈ శైలి యొక్క ప్రత్యేక అంశం ఏమంటే, స్థానిక రంగు ఒక రూపురేఖ ఉండేది. (ప్రస్తుతం ఇదే కార్టూన్ లాగా మారింది) ఈ శైలి భారత దేశం, టిబెట్ మరియు జపాన్ కళలో కనిపిస్తూ ఉంది.

 
ఒక కళాకారుడు యొక్క పాలెట్

ఇస్లాం మతం రూపాలను చిత్రీకరించడాన్ని నిషేధిస్తుంది. మత పరమైన విషయాలు రేఖాగణితం ద్వారా ప్రదర్శించబడేవి. ఐన్స్టీన్[11] కనిపెట్టిన సాపేక్షత్వ సిద్ధాంతం మరియు ఫ్రుడ్[12] యొక్క మానసిక శాస్త్రం మరియు సాంకేతిక అభివృద్ధి వంటి కొత్త అంశాలు 19వ శతాబ్దము కాలము ఎన్లైటన్మెంట్లో చూపబడిన భౌతిక మరియు హేతుబద్దమైన నిజాలను త్రోసిపుచ్చాయి. ఈ కాలములో పెరుగుతున్న ప్రపంచవ్యాప్త సంకర్షణల వలన ఇతర సంస్కృతులు ప్రాశ్చాత్య కళ పై ప్రభావం చూపాయి.

మాధ్యమ రకాలుసవరించు

రేఖాచిత్రం అనేది, వివిధ పరికరాలు, పద్ధతులను వాడి ఒక ప్రతిబింబాన్ని రూపొందించడం. ఉపరితలం పై పరికరము ద్వారా ఒత్తిడి పెట్టి లేదా ఉపరితలం పై ఒక పరికరాన్ని జరపడం ద్వారా గుర్తులు పెట్టడం జరుగుతుంది. దీనికి సహజంగా వాడే పరికరాలు గ్రాఫైట్ పెన్సిల్లు, కాలము మరియు సిరా, సిరాపూసిన బ్రష్లు, వాక్స్ రంగు పెన్సిల్లు, క్రేయాన్లు, బొగ్గులు, పాస్టేల్లు, మరియు మార్కర్లు. ఈ ఫలితాలను అనుసరించే డిజిటల్ పరికరాలు కూడా వాడబడతాయి. రేఖాచిత్రములో వాడబడే ప్రధాన పద్ధతులు: గీత రేఖాచిత్రం, హాట్చింగ్, క్రాస్-హాట్చింగ్, రాండం హాట్చింగ్, స్క్రిబ్లింగ్, స్టిప్లింగ్, మరియు బ్లెండింగ్. రేఖాచిత్రీకరణలో నైపుణ్యం కలిగిన వారిని డ్రాఫ్ట్స్ మాన్ లేదా డ్రాట్స్ మాన్ అని పిలుస్తారు.

చిత్రలేఖనంసవరించు

 
ప్రాశ్చాత్య ప్రపంచములో కళాత్మక చిత్రాలలో అత్యధిక ప్రాబల్యం చెందిన చిత్రం మొనాలీసా

చిత్రలేఖనం అనగా పేపర్, కాన్వాస్ లేదా గోడ ఉపరితలం పై ఒక మాధ్యములో ఉన్న వర్ణం మరియు ఒక అతికించే వస్తువును (బంక) రాయడం. అయితే, కళాత్మకంగా చూస్తే, ఈ పనిని రేఖాచిత్రం గీయడం, కూర్పు మరియు ఇతర అలంకార పద్ధతులతో కలిసి, కళాకారుని యొక్క భావాలను వ్యక్తపరిచే విధంగా చిత్రీకరించడం. ఆధ్యాత్మక రూపాలను మరియు విషయాలను వ్యక్తపరచడానికి కూడా రేఖాచిత్రం వాడబడుతుంది; ఈ కళ కుండల పై పౌరాణిక బొమ్మలను చిత్రీకరించడం నుండి సిస్టైన్ చాపెల్, మానవ శరీరం వరకు వేరుబడుతుంది.

రంగు చిత్రలేఖనము యొక్క సారమయినట్లే, ధ్వని సంగీతమునకు సారం. రంగు చాలా స్వీయాత్మకమైనది, కాని దానికి గమనించదగ్గ మానసిక ప్రభావాలు ఉన్నాయి. కానీ అవి ఒక సంస్కృతికి దాని తరువాత సంస్కృతికి వేరువేరుగా ఉంటాయి. నలుపు పశ్చిమంలో దుఃఖాన్ని సూచిస్తుంది. కానీ ఇతర ప్రదేశాలలో తెలుపు సూచించవచ్చు. కొందరు చిత్రకారులు, సిద్దాంతకర్తలు, రచయితలు మరియు శాస్త్రజ్ఞులు, ముఖ్యంగా గోయేత్, కాన్డిన్స్కీ, ఐస్సాక్ న్యూటన్, వారి స్వంత రంగు సిద్ధాంతమును రచించారు. అయినా కూడా భాష వాడటం అనేది రంగుతో సమానమైన సర్వసమంవయం మాత్రమే. "ఎరుపు" అను పదం, ఉదాహరణకి, స్పెక్ట్రంలోని స్వచ్ఛమైన ఎరుపు రంగుకు సంబంధించిన అనేక మార్పులను పొందుపరచుకుంటుంది. సంగీతంలోని వివిధ ధ్వనుల మధ్యనున్న అంగీకారము మాదిరిగా వివిధ రంగులలో ఒక సాంప్రదాయ పద్ధతి అనుసరించటం లేదు. సంగీతంలోని వివిధ ధ్వనులైన C లేక C#లలో ఉన్నట్లు, ఈ అవసరాలకు పాంటోన్ విధానమును ముద్రణ మరియు రూపకల్పన పరిశ్రమలో విరివిగా వాడినట్లుగా రంగులలో ఒక పద్ధతి ఏర్పడలేదు.

ఆధునిక కళాకారులు చిత్రీకరణ అనే ఆచరణను వ్యాపింపజేసి, ఉదాహరణకు, కాలేజ్కు వర్తించేటట్లు చేశారు. ఇది క్యూబిజంతో మొదలయింది కానీ దానిని చిత్రీకరణ అని కచ్చితంగా అనలేము. కొందఱు ఆధునిక చిత్రకారులు ఇసుక, సిమెంటు, గరిక లేక కొయ్య వంటి వివిధ వస్తువులను నిగారింపు కొరకు కలిపి వాడతారు. దీనికి ఉదాహరణలు జీన్ డ్యుబఫ్ఫేట్ లేక యాన్సేల్మ్ కీఫర్ యొక్క సృష్టులు. ఆధునిక మరియు సమకాలీన కళ చేతిపనితనం యొక్క చారిత్రాత్మక విలువ నుండి భావన విధానం వైపుకు మళ్ళింది. ఈ కారణంగా కొందరు చిత్రీకరణ, ఒక ముఖ్యమైన కళారూపంగా మరణించిందని చెప్పడం జరిగింది. కానీ ఈ వ్యాఖ్యానం అధిక భాగం కళాకారులను ఈ వృత్తిని పూర్తి స్థాయిలో గానీ, ఒక భాగంగా గానీ కొనసాగించలేనట్లుగా బెదిరించలేకపోయింది.

మానవీయ శాస్త్రాల యొక్క చరిత్రసవరించు

పశ్చిమంలో, మానవీయ శాస్త్రాల యొక్క అధ్యయనము ప్రాచీన గ్రీస్ లో సామాజికులకు సామూహిక విద్యాబోధన పై ఆధారపడి ప్రారంభమయింది. రోమన్ కాలంలో, ఏడు స్వేచ్ఛా కళలు అను ఆలోచన ఉత్పన్నమయినాయి. అవి వ్యాకరణం, అలంకారాలు మరియు తర్కము ( ట్రివియం, తో సహా గణితం, రేఖాగణితం, ఖగోళ శాస్త్రము మరియు సంగీతం (క్వాడ్రీవియం).[13] ఈ శాస్త్రాలు మధ్యయుగంనాటి విద్యాబోధనలో అధికపాత్ర వహించి, మానవీయ శాస్త్రాలను చాతుర్యాలు లేక "పని చేయు విధానాలు"గా ఉద్ఘాటించటం జరిగింది.

మానవీయత పునరుద్దారణతో పదిహేనవ శతాబ్దంలో ఒక ప్రధాన మార్పు జరిగి, మానవీయ శాస్త్రాలు చదవటం కంటే ఎక్కువ ఆచరించటానికి తగినవిగా భావింపబడి, సాంప్రదాయ రంగాల నుండి సాహిత్యం మరియు చరిత్ర వంటి రంగాలకు బదలీ కావటం జరిగింది. ఇరవయ్యవ శాతబ్దములో, ఈ అభిప్రాయాన్ని పోస్ట్ మాడేర్నిస్ట్ ఉద్యమం సవాలు చేసింది. ఈ ఉద్యమం ప్రజాస్వామ్య సమాజానికి అనుగుణంగా మరింత సమానత్వ పద్ధతిలో మానవీయ శాస్త్రాలకు పునఃనిర్వచనం ఇవ్వడానికి కృషి చేసింది.[14]

మానవీయ శాస్త్రాలు ఈనాడుసవరించు

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోసవరించు

విశాలమైన "ఉదార కళా విద్య" సిద్దాంతాన్ని పలు అమెరిక కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు పాటిస్తున్నాయి. దీని ప్రకారం, విద్యార్థులు వారి విశేష పాఠ్యాంశాలతోపాటు మానవీయ శాస్త్రాలను కూడా అబ్యాసించాలి. అందరు విద్యార్థులు తత్వశాస్త్రం, సాహిత్యం, కళా పాఠాలలో విస్తారమైన కోర్ కరికులాన్ని చదవాలనే నియమాన్ని పెట్టిన తొలి పాఠశాలలు, చికాగో విశ్వవిద్యాలయలం మరియు కొలంబియా విశ్వవిద్యాలయములు. ఉదార కళాలో దేశీయ గుర్తింపు పొందిన రెండు సంవత్సరాల ప్రోగ్రాంను రూపొందించిన ఇతర కళాశాలలు, St. జాన్స్ కాలేజీ, సెయింట్ అన్సేలం కాలేజీ, ప్రొవిడెన్స్ కాలేజీ. యునైటెడ్ స్టేట్స్ లో, ఉదార కళకు ఆదరణ చూపిన ప్రముఖులు: మార్టిమర్ జే. అడ్లేర్[15] మరియు ఈ. డి. హిర్స్చ్, జూనియర్.

మానవీయ శాస్త్రాలు పై 1980 యునైటెడ్ స్టేట్స్ రోకెఫెల్లెర్ కమిషన్ సమర్పించిన ది హ్యుమానిటీస్ ఇన్ అమెరికన్ లైఫ్ అనే నివేదికలో ఈ విధంగా వివరించారు:

మానవీయ శాస్త్రాలు ద్వారా ఒక మూలాధార ప్రశ్నకు సమాధానం వెతుకున్నాం: మానవుడుగా ఉండాలంటే ఏమి అర్ధం? ఈ ప్రశ్నకు మానవీయ శాస్త్రాలు కొంత మేరకు జాడ చూపిస్తున్న, పూర్తి సమాధానాన్ని ఇవ్వడం లేదు. జననం, మిత్రత్వం, ఆశ, ఔచిత్యం వంటి అంశాలతో పాటు అనౌచిత్యము, నిస్పృహ, ఒంటరితనం, మరణం వంటివి కూడా అదే మోతాదులో ఉన్న ఈ ప్రపంచంలో ఏ విధంగా నైతిక, అధ్యాత్మిక, వివేచనాత్మక అంశాలను పరిగణనలోకి తీసుకోవడానికి ప్రజలు ప్రయత్నించారు.

"ఉదార కళలో విద్యకు ఏ పాత్ర లేదని ఎక్కువ మంది విమర్శకులు అభిప్రాయపడుతున్నారు" [16] లేదా తక్కువ తక్కువ విషయాల గురించి ఎక్కువ ఎక్కువ నేర్చుకోవడం" [17]. పట్టభద్రుల సంఖ్య పెరుగుతున్న అమెరికాలో ఇటువంటి చదువులు ఉద్యోగాలకు విద్యార్దులను తయారుచేయడం లేదు.[18]రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, లక్షల మంది వెటరన్లు GI బిల్ ను అనుకూలంగా తీసుకున్నారు. విద్యా రంగానికి కేంద్ర నిధులు మరియు ఋణాలను మరింత పెంచడం వలన, యునైటెడ్ స్టేట్స్ లో కళాశాలలో చదివిన మంది సంఖ్య బాగా పెరిగింది.[18] 2003లో, మొత్తం జనాభాలో సుమారు 53% మంది ఏదో ఒక కళాశాల విద్యను కలిగి ఉన్నారు. 27.2% మంది బేచలర్ డిగ్రీ లేదా దానికంటే పై చదువు చదివినవారు. 8% మంది గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసినవారు.[19] దానికి వ్యతిరేక ధృక్పధం ఏమంటే "విజ్ఞానమునకు సంబంధించిన విషయ పరిజ్ఞానము కలిగి ఉండి, కళలు మరియు శాస్త్రాల అందలి విషయాలు అన్వేషించటం మరియు క్రొత్తవి కనిపెట్టడంయే కాకుండా, జ్ఞానాన్ని, అనుభవాన్ని మరియు క్రమశిక్షణతో జోడించగల సమర్ధత వలననూ, ఈ మార్పు చెందే ప్రపంచంలో త్వరతగతిలో పాతబడిపోయే ప్రత్యేక పద్ధతులు, వానికి అనుబంధ శిక్షణ వలన కంటే ఎక్కువ విలువైన ప్రభావం ఉంటుంది."

[18]

ఈ డిజిటల్ కాలంలోసవరించు

మానవీయ శాస్త్రాలలో పరిశోధకులు చరిత్ర పుస్తకాల యొక్క డిజిటలైజ్ద్ కూర్పులు వంటి అనేక పెద్ద మరియు చిన్న డిజిటల్ కార్పోరాను, వానితో పాటు డిజిటల్ టూల్స్ మరియు వాటిని శోధించే పద్ధతులను అభివృద్ధి పరచారు. కార్పోరా గురించిన క్రొత్త జ్ఞానాన్ని బయల్పరచటం మరియు నూతన, బయల్పరచే మార్గాలకు సంబంధించిన పరిశోధనా వివరాలు తెలియజేయటం కూడా వారి లక్ష్యాలు. డిజిటల్ మానవీయ శాస్త్రాలు అను విభాగంలో ఈ క్రియాశీలత ఎక్కువగా ఉంటుంది.

మానవీయ శాస్త్రాల యొక్క చట్టబద్ధతసవరించు

ప్రైవేటు మరియు పబ్లిక్ పోస్ట్-సెకండరీ ఇన్స్టిట్యూషన్స్లలో నమోదు చేసుకున్న పట్టభద్రుల సంఖ్య యొక్క పెరుగుదలతో పోలిస్తే, మానవీయ శాస్త్రాలలో నమోదయిన వారి సంఖ్యా మరియు మేజర్లయిన వారి శాతం కూడా తగ్గిపోతున్నది. కాని మొత్తం మీద మానవీయ శాస్త్రాలలో నమోదు చేసుకున్నవారి అసలు సంఖ్యలో పెద్దగా మార్పు లేదు (అంతే కాక కొన్ని ప్రమాణాల ప్రకారం కొంచం పెరిగిందన్నది నిజం).[20]

విశ్వవిద్యాలయంలో మానవీయ శాస్త్రాల పండితులు ఎదుర్కుంటున్న ఆధునిక "సంక్షోబం" పలు అంశాలు కలిగి ఉంది: యునైటెడ్ స్టేట్స్ లోని విశ్వవిద్యాలయాలు ప్రత్యేకంగా కార్పరేట్ మార్గార్శకాలను అమలు చేస్తున్నాయి. దాని ప్రకారం, అండర్‌గ్రాడ్యువేట్ విద్య మరియు విద్యా పాండిత్యం, మరియు పరిశోధనా రంగాలనుండి లాభం ఆర్జించే పద్ధతిని పాటిస్తున్నాయి. దీని వలన విశ్వవిద్యాలయానికి బయట ప్రపంచంలో ఉపయోగపడే అంశాలకు ఆదరణ పెరిగింది. "జీవితమంతా అభ్యయన" అనే అంశం పై కార్పరేట్ ఒత్తిడి, విద్యను అందించే వ్యవస్థగా, పరిశోధనా సంస్థగా విశ్వవిద్యాలయం పాత్ర మీద ప్రభావం చూపింది.[21] మారుతున్న సంస్థాగత నియమాలు, మరియు సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న ప్రపంచంలో ఏవి "ఉపయోగమైన నైపుణ్యాలు" అనే అంశం పై మారుతున్న నిర్వచనం వంటి అంశాలు విశ్వవిద్యాలయ వ్యవస్థ లోపల మరియు బయట కూడా పెను మార్పులు తెచ్చాయి.

పౌరసత్వం, స్వయ-పరిశోధన మరియు మానవీయ శాస్త్రాలుసవరించు

19వ శతాబ్ద ఆఖరి నుంచి, మానవీయ శాస్త్రాల యొక్క ప్రధాన సమర్ధన ఏమంటే, ఇది స్వయ-పరిశోధనను పెంచి, దాని ద్వారా వ్యక్తిగత స్పృహను పెంచి విద్యుక్త ధర్మాన్ని కూడా అభివృద్ధి చేస్తుంది.

విల్హెం డిల్తే మరియు హాన్స్-జార్జ్ గడమేర్ మానవీయ శాస్త్రాలును జీవశాస్త్రాల నుండి వేరుగా పరిగణించడానికి చేసే ప్రయత్నాలను మానవజాతి తమ అనుభవాలను అర్ధం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలని వివరించారు. ఈ అవగాహన ఒకే తరహా సంస్కృతికు చెందిన ఒకే-ఆలోచన కలిగిన జనాలను కలుపుతుందని వారు పేర్కొన్నారు. ఇది గతముతో ఒక సంస్కృత వారదిని సృష్టించిందని పేర్కొన్నారు.[22]

ఆ "వివరణాత్మక కల్పన"[23]ను తమ స్వంత సామాజిక మరియు సంస్కృతికి బయట ఉన్నవారి అనుభవాలను అర్ధం చేసుకునే సామర్ధ్యానికి కారణమని ఇరవయ్యవ శాతాబ్ద ఆఖరిలో మరియు ఇరవై ఒకటో శతాబ్ద ప్రారంభాముకు చెందినా పండితులు అభిప్రాయపడ్డారు. ఆ వివరణాత్మక కల్పన ద్వారా మానవీయ శాస్త్రాలు పండితులు మరియు విద్యార్థులు మనము జీవిస్తున్న ఈ బహుళ-సంస్కృత ప్రపంచానికి సరి పోయే స్పృహను అభివృద్ధి చేసుకుంటారు.[24] ఆ స్పృహ నిశ్చేష్టిత రూపాన్ని తీసుకోవచ్చు. దీని వలన మరింత సమర్ధవంతమైన స్వయ-పరిశోధన[25] జరగవచ్చు లేదా క్రియాశీలమైన సానుభూతిని కలిగించవచ్చు. ఇది బాధ్యత కలిగిన ఒక పౌరుడు నిర్వహించవలసిన కర్తవ్యాలను చేయడానికి తోడ్పడవచ్చు.[24] మానవీయ శాస్త్రాలు ఎంత మేరకు ఒక వ్యక్తి పై ప్రభావం చూపగలదనే విషయం పై ఏకాభిప్రాయం లేదు. ఈ మానవీయ అనుభవాలలో నేర్చుకున్న అంశాలు "ప్రజల పై గుర్తించగల మంచి ప్రభావాన్ని " చూపుతుందా లేదా అనే విషయం పై కూడా చర్చ ఉంది.[26]

నిజము, అర్ధము, మరియు మానవీయ శాస్త్రాలుసవరించు

సహజ శాస్త్రాలకు మానవీయ అధ్యయనాలకు మధ్య ఉన్న విభేదాలు మానవీయ శాస్త్రాల వివాదాల యొక్క అర్ధాలను కూడా తెలియచేస్తుంది. మానవీయ శాస్త్రాలను సహజ శాస్త్రాలనుండి వేరుగా చూపించేది, వాటిలో ఉన్న పాఠ్యాంశాలు కాదు. ఒక ప్రశ్నకు సమాధానము తెలుసుకునే విధములో ఈ రెండు శాస్త్రాలలో మార్పు ఉంటుంది.

అర్ధం, ఉద్దేశం మరియు లక్ష్యాలను అర్ధం చేసుకోవడం పై మానవీయ శాస్త్రాలు దృష్టి సారిస్తుంది. చారిత్రాత్మక మరియు సామాజిక విషయాలను అర్ధం చేసుకోవడంలో దోహతపడుతుంది. సత్య అన్వేషణకు ఇది ఒక వ్యాఖ్యానపరమైన పద్ధతి. సంఘటనలు అనుకోకుండా జరుగుతాయని చెప్పడమో లేదా సహజ ప్రపంచము యొక్క సత్యాన్ని అన్వేషించడమో దీని ఉద్దేశం కాదు.[27]
సమాజములో దీని ఉపయోగం కాకుండా, చరిత్ర, సంస్కృతి మరియు సాహిత్యములో అర్ధం చేసుకోవడానికి కూడదా వివరణాత్మక కల్పన ఒక ముఖ్య ఉపకరనంగా ఉంటుంది.

కళాకారులు లేదా పండితులు వాడే ఉపకరణాలలో కల్పన ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది. అర్ధాన్ని సృష్టించి ప్రేక్షకులనుంచి స్పందన తెప్పించే మార్గంగా కూడా కల్పన పాత్ర వహిస్తుంది. మానవీయ శాస్త్రాల పండితుడు ఎప్పుడు కూడా జీవిత అనుభవాలతో కలిసి ఉండి నుండి నేర్చుకుంటూ ఉంటాడు కనుక, సిద్ధాంతపరంగా "నిరపేక్ష" జ్ఞానం అనేది సాధ్యం కాదు; అందువలన జ్ఞానం అనేది ఒక విషయము యొక్క నేపథ్యాన్ని కనిపెట్టి మరల పునఃకనిపెట్టుతూ ఉండే నిరంతర ప్రక్రియ. ప్రశ్నల అర్ధం, ఉద్దేశం మరియు రచయిత గురించి మానవియా దృష్టితో తెలుసుకునే ఒక పద్ధతిని పోస్ట్-స్ట్రక్చురలిజం రూపొందించింది.[dubious ] రచయిత మరణం విషయాన్ని రోలాండ్ భర్తెస్ ప్రకటించిన నేపథ్యములో, డికన్స్ట్రక్షన్ మరియు ప్రసంగం వంటి వివిధ పద్ధతులను వస్తువులను తయారు చేయడంలోను మానవీయ అధ్యయనం యొక్క హీర్మేన్యూటిక్ విషయాలను తయారీ చేయడంలోను ఉపయోగిస్తుంది. మానవీయ శాస్త్రాల వ్యాఖ్యానపరమైన నిర్మాణాలు విమర్శకు గురయ్యాయి. మానవీయ శాస్త్రాలను అభ్యసించడం "శాస్తీయం" కాదని అందుకని ఈ శాస్త్రాలకు ఆధునిక విశ్వవిద్యాలయ కరికులంలో కలపడానికి అర్హత లేదని విమర్శ వచ్చింది. దేనికి చెప్పబడిన కారణం, వీటి మారుతున్న అర్ధాలే.[dubious ]

సంతోషం, జ్ఞానాన్వేషణ, మరియు మానవీయ శాస్త్రాల విధ్యార్దివేతనంసవరించు

మానవీయ శాస్త్రాల వలన ఎటువంటి ప్రయోజనం లేదని పేర్కొని మానవీయ శాస్త్రాలను సంర్దిన్చావచ్చని స్టాన్లీ ఫిష్ వంటి కొందరు పేర్కొంటున్నారు.[28] (చరిత్ర మరియు తాత్వశాస్త్రం కాకుండా సాహిత్యపరమైన అధ్యయనం గురించి ఫిష్ మాట్లాడి ఉండవచ్చు.) సామాజిక ఉపయోగం (ఉత్పత్తి పెరగడం వంటిది) లేదా వ్యక్తి యొక్క ఉద్దేశాలలోని ఉదాత్తతను పెంచటం వంటి అంశాలు (మనిషి తెలివిని పెంచడం లేదా వివక్ష ధోరణిని తగ్గించటం వంటి) ప్రయోజనాల దృష్టితో మానవీన శాస్త్రాలను సమర్ధించటం తగదని ఫిష్ చెప్పారు. దీనివలన, ఈ శాస్త్రాల యొక్క అకడమిక్ విభాగాలపై అసాధ్యమైన ఒత్తిడి వస్తుందని చెప్పారు. అంతే కాక, శిక్షణ ద్వారా లభించే సూక్షమంగా ఆలోచించే సామర్ధ్యాన్ని ఇతర నేపథ్యాలలో పొందవచ్చు.[21] రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రాశ్చాత్య సమాజంలో విజయం సాధించడానికి సహాయపడిన సామాజిక ప్రయోజనాలను (కొన్ని సార్లు దీనినే సాంఘికవాదులు "సాంస్కృతిక మూలధనం" అని అంటారు) ఇప్పుడు మానవీయ శాస్త్రాలు అందించడం లేదు.

దానికి బదులుగా, మానవీయ శాస్త్రాలు ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని, (జ్ఞాన అన్వేషణలో లభించే ఆనందం) అందిస్తుంది. ఇటువంటి ఆనందం ప్రాశ్చాత్య సంస్కృతి అయిన విశ్రాంతి యొక్క ప్రైవేటీకరణ మరియు వెనువెంటనే ఫలాలు వంటి అంశాలకు భిన్నంగా ఉంది; అందువలన ఇది జుర్గెన్ హబెర్మాస్ చెప్పినట్లు ఈ శాస్త్రాలకు సామాజిక అనే హొదాను తీసివేయాలి. బహిరంగంగా జరిగే ప్రయ్నాలలో అదివరకు ప్రశ్నించబడని అంశాలకు హేతుబద్దమైన సమాధానం దొరకదు. ఆధునిక ప్రాశ్చాత్య వినియోగదారుల సమాజంలో ప్రైవేట్ మరియు పబ్లిక్ రంగాలకు మధ్య బంధాన్ని ఎకడమిక్ ఆనంద అన్వేషణ మాత్రమే ఇవ్వగలదు అని ఈ వాదన చెపుతుంది. ఈ విధంగా ఆధినిక ప్రజాయస్వామ్యము యొక్క పునాది అయిన పబ్లిక్ రంగాన్ని బలపరుచగలదు అనేది పలువురు సిద్ధాంతుల వాదన.

భావనాత్మకత మరియు మానవీయ శాస్త్రాల యొక్క నిరాదరణసవరించు

మానవీయ శాస్త్రాలను సమర్ధిస్తూ చేయబడుతున్న ఈ వాదనలలో, మానవీయ శాస్త్రాలకు బహిరంగ మద్దతు ఈయటం గురించిన వ్యతిరేకత ముఖ్యంగా ఉండేవి. మనం ఒక మారుతున్న ప్రపంచంలో జీవిస్తున్నామని, ఈ ప్రపంచంలో "సాంసృతిక మూలధనానికి" స్థానములో "వైజ్ఞానిక పరిజ్ఞానానికి" ప్రాముఖ్యత పెరిగింది. దీనిలో రేనైసాన్స్ మానవీయ శాస్త్రాల విద్యార్థి యొక్క భావనాత్మకత పాతబడిపోయింది అని జోసెఫ్ కరోల్ వక్కాణిస్తున్నారు. మానవీయ శాస్త్రాల ఉపయోగం గురించిన అందోళనలకు, నిర్ణయాలకు ఈ వాదనలు తావు ఇస్తున్నాయి. సాహిత్యం, చరిత్ర మరియు కళ వంటి అంశాలలోని ఉద్ధండులు "పరిశోధనా శాస్త్రవేత్తలతో కలిసికట్టుగా పని చేయవలసిన" లేదా కనీసం "సంఖ్యా శాస్త్రాలలోని కనుగొన్న విషయాలను తెలివిగా ఉపయోగించవలసిన" అవసరం కనిపిస్తున్న ఈ క్రొత్త ప్రపంచంలో ఈ పరిణామం చాలా ముఖ్యమైనదిగా అగుపిస్తుంది.[29] సామర్ధ్యము మరియు ఆచరణాత్మక ప్రయోజనాలు వంటి అంశాలకు ప్రాముఖ్యత ఎక్కువగా ఉన్న ఈ "ప్రస్తుత రోజు మరియు కాలంలో", మానవీయ శాస్త్ర నిపుణులు కరువవుతున్నారనే వాదన, మార్విన్ మిన్స్కి అనే కృత్రిమ వివేకము అందలి నిపుణుడు వ్యక్తపరచిన ఈ మాటలలో బహుశా చాల శక్తిమంతంగా తెలియచేయడమైనది: "మానవీయ శాస్త్రాలు మరియు కళకు మనం అత్యధిక డబ్బును వృధా చేస్తున్నాం- ఆ డబ్బును నాకు ఇవ్వండి. నేను ఒక మెరుగైన విద్యార్థిని తయారు చేస్తాను".[30]

మిన్స్కీకి సాంకేతిక పరిజ్ఞానం మీద ఉన్న మెరుగైన నమ్మకం మరియు ఈనాటి మానవీయ శాస్త్రాల విద్యార్థి స్థాయిని గతములోని మరుగునపడిన జ్ఞాపకం అనే భావనకు భావనాత్మకుల డాలర్ల పన్ను డబ్బుపై ఆధారపడి, "పోస్ట్-హ్యుమనిస్ట్" లేదా "ట్రాన్స్-హ్యుమనిస్ట్లని తమను పిలుచుకునే పండితులు మరియు సాంస్కృతిక విమర్శకులు ఆప్యాయంగా జి.ఐ. బిల్ వాదనలను స్మరిస్తున్నారు. ప్రస్తుతము మానవులకు ఉన్న శాస్త్రీయ అవగాహనల యొక్క పోకడ "మానవత" అనే మౌలిక అంశానే ప్రశ్నించే విధంగా ఉందనే భావం ఉంది. ఈ పోకడలను సమర్ధించటానికి ఉదాహరణలు: మనసు అనేది కేవలం ఒక లెక్కించే పరికరం అని కాగ్నిటివ్ శాస్త్రవేత్తలు చెప్పడం, మానవులు స్వయంగా ఉత్త్పత్తి అయే జన్యువులు ఉపయోగించే తాత్కాలిక పొట్టు కంటే ఏ మాత్రం గొప్పవారు కాదని (కొందరు పోస్ట్-మాడర్న్ భాషశాస్త్ర నిపుణులు చెప్పుతున్నట్లు మేమే లు) జన్యుశాస్త్రవేత్తలు చెప్పడము, ఏదో ఒక నాడు మానవ-జంతు సంకరజీవిని సృష్టించ తము సాధ్యమేనని మరియు ఉపయుక్తమయిందని బయో-ఇంజినీర్లు చెప్పడము[ఉల్లేఖన అవసరం]. పాత-తరహా మానవతావాద పండితులతో కాకుండా, ట్రాన్స్-హ్యూమనిస్ట్లు అధ్యయన శాస్త్రం, బయో-ఇంజనీరింగ్ వంటి రంగాలలో, మానవజాతిని నిర్భంధించే శారీరిక పరిమితులను అధిగమించేందుకు, మన మానసిక మరియు శారీరక సామర్ధ్యాలను పరీక్షించే మరియు మార్చే విషయం మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. మానవీయ శాస్త్రాలు మరుగునపడ్డాయి అనే విమర్శ ఉన్నప్పటికీ, పలు ప్రాభల్యం కలిగిన పోస్ట్-హ్యూమనిస్ట్ రచనలు చిత్రం సాహిత్య విమర్శ, చరిత్ర, మరియు సాంస్కృతిక అధ్యయనాలు వంటి రంగాలలో రచించబడ్డాయి. డోన్న హరవే, ఎం. కతేరిన్ హేలేస్ వంటి వారి రచనలు వీటికి ఉదాహరణలు. ఇటీవల కాలాలలో, మానవీయ శాస్త్రాల అధ్యయనం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుపుతున్నట్లు అనేక గ్రంథాలు, వ్యాసాలూ వ్రాయబడుతున్నాయి. ఉదారహరణలు: హారొల్ద్ బ్లూం, హౌ టు రీడ్ అండ్ వై (2001), హన్స్ ఉల్రిచ్ గంబ్రేచ్ట్, ప్రొడక్షన్ అఫ్ ప్రేసేన్స్ (2004), ఫ్రాంక్ బి. ఫర్రేల్, వై డస్ లిటరేచర్ మేటర్?

(2004), జాన్ కారీ, వాట్ గుడ్ ఆర్ ది ఆర్ట్స్? (2006), లిసా జున్శైన్, వై వీ రీడ్ ఫిక్షన్ (2006), అలెక్సాన్డర్ నేహమాస్, ఓన్లీ ఎ ప్రామిస్ అఫ్ హప్పినెస్ (2007), రిటా ఫెల్స్కి, ఉసెస్ అఫ్ లిటరేచర్ (2008).

అమియల్ డోమింగో

వీటిని కూడా చూడండిసవరించు

 • గొప్ప పుస్తకాలు
 • కెనడాలో గొప్ప పుస్తక ప్రదర్శనలు
 • ఉదాత్త కళలు
 • సాంఘిక శాస్త్రాలు
 • ఫ్రోనెటిక్ సామాజిక శాస్త్రం
 • మానవ శాస్త్రం
 • డిజిటల్ మానవీయ శాస్త్రాలు
 • థ టూ కల్చర్స్
 • విద్యావిషయక విభాగాల యొక్క పట్టిక
 • ప్రజాసంబంధ మానవీయ శాస్త్రాలు
 • "మానవ శాస్త్రాల ఆవర్తన పట్టిక" టిన్బర్జన్ యొక్క నాలుగు ప్రశ్నలు

సూచనలుసవరించు

 1. Robertson, Geoffrey (2006). Crimes Against Humanity. Penguin. p. 90. ISBN 9780141024639.
 2. Hart, H.L.A. (1961). The Concept of Law. Oxford University Press. ISBN ISBN 0-19-876122-8 Check |isbn= value: invalid character (help).
 3. Dworkin, Ronald (1986). Law's Empire. Harvard University Press. ISBN ISBN 0-674-51836-5 Check |isbn= value: invalid character (help).
 4. Raz, Joseph (1979). The Authority of Law. Oxford University Press. ISBN 0199562687.
 5. Austin, John (1831). The Providence of Jurisprudence Determined.
 6. ఎటిమాన్లైన్ డిక్షనరీ చూడండి
 7. మిర్రిం-వెబ్స్టర్స్ డిక్షనరీ చూడండి
 8. తోమాస్ నగెల్ (1987). వాట్ డస్ ఇట్ ఆల్ మీన్? ఎ వెరి షార్ట్ ఇంట్రోడక్షన్ టు ఫిలాసఫీ . ఆక్స్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం ప్రెస్, pp. 4-5.
 9. 9.0 9.1 కాంట్, ఇమాన్యువేల్ (1785). గ్రౌండ్వర్క్ అఫ్ ది మెటాఫిసిక్ అఫ్ మారల్స్ , మొదటి పంక్తి.
 10. ఉదాహరణ చూడండి బ్రియన్ లైటర్ [1] "'విశ్లేషనాత్మక' సిద్ధాంతం అనేది ఈ నాడు తత్వశాస్త్రము యొక్క శిలిని చూపిస్తుంది గాని ఒక తత్వశాస్త్ర కార్యక్రమాన్ని లేదా అభిప్రాయాలను కాదు. విస్లేషణాత్మక తత్వవేత్తలు ఒక వాదనలో స్పష్టత మరియు ఖచ్చితత్వం వంటి అంశాలను చూస్తారు; తర్కశాస్త్రము యొక్క ఉపకరణాలను వాడుకుంటారు; మానవీయ శాస్త్రాల కంటే కూడా విజ్ఞానం మరియు గాణితశాస్త్రాలతో ఎక్కువగా సంబంధం కలిగి ఉంటారు."
 11. Turney, Jon (2003-09-06). "Does time fly?". The Guardian. London. Retrieved 2008-05-01.
 12. "Internet Modern History Sourcebook: Darwin, Freud, Einstein, Dada". www.fordham.edu. Retrieved 2008-05-01. Cite web requires |website= (help)
 13. లేవి, ఆల్బర్ట్ W.; ది హ్యుమానిటీస్ టుడే , ఇండియాన విశ్వవిద్యాలయం ప్రెస్, బ్లూమింగ్టన్, 1970.
 14. వాల్లింగ్, డోనోవన్ ఆర్.; అండర్ కన్స్ట్రక్షన్: ది రోల్ అఫ్ ది ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ ఇన్ పోస్ట్-మాడేర్న్ స్కూలింగ్ ఫి డెల్టా కప్పు ఎడ్యుకేషనల్ ఫౌండేషన్, బ్లూమింగ్టన్, ఇండియాన, 1997.
 15. అడ్లేర్, మార్టిమెర్ జే.; "ఎ గైడ్బుక్ టు లెర్నింగ్: ఫర్ ది లైఫ్లాంగ్ పర్సూట్ అఫ్ విస్డం"
 16. లెర్నింగ్ టు లేర్న్ ఫ్రం ఎక్స్పీరియన్సు ఎడ్వర్డ్ సెల్ రచించినది 1984 పేజి XI
 17. XI [2] టెడ్ లో లిజ్ కలేమన్ ప్రసంగం - "ఉదార విద్య యొక్క చిత్తశుద్ధి" లో ఏమి తప్పని వివాదం. http://www.ted.com/talks/liz_coleman_s_call_to_reinvent_liberal_arts_education.html
 18. 18.0 18.1 18.2 లిబెరల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ఫర్ ఎ గ్లోబల్ సొసైటి, క్యారోల్ ఎం. బర్కేర్ కార్నెగీ కార్పరేషన్ http://www.carnegie.org/sub/pubs/libarts.pdf
 19. "US Census Bureau, educational attainment in 2003" (PDF). Retrieved 2007-01-03. Cite web requires |website= (help)[dead link]
 20. నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ ప్రకారం, గుర్హింపు పొందిన కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో మొత్తం అండర్ గ్రాడ్యువేట్ల సంఖ్య 1970లో 7.3 మిలియను నుండి 2004లో 14.7 మిలియనుకు పెరిగింది (http://nces.ed.gov/fastfacts/display.asp?id=98). ఈ సమయములో, బిజినెస్ గ్రాడ్యువేట్ల సంఖ్య 115K నుంచి 311K కు పెరిగింది. చరిత్ర మరియు సామాజిక శాస్త్రంs కలిపి (NCES ప్రకారం) 155K నుంచి 156K కు స్వల్పంగా పెరిగింది. ఆంగ్లంలో 67K నుండి 54K కు తగ్గింది. విదేశీ భాషలో 21K నుండి 18K కు తగ్గింది. తత్వశాస్త్రంలో 8K నుండి 11K కు పెరిగింది. ఇతర ఉదార కళలు 7K నుండి 43K కు పెర్గింది.
 21. 21.0 21.1 లియు, అలన్. లాస్ అఫ్ కూల్, 2004.
 22. డీల్థే, విల్హేల్మ్. ది ఫార్మేషన్ అఫ్ థే హిస్టారికాల్ వరల్డ్ ఇన్ థే హ్యూమన్ సైన్సస్ , 103.
 23. వాన్ రైట్, మోయ్రా. "నారెటివ్ ఇమాజినేషన్ అండ్ టేకింగ్ థే పెర్స్పెక్టివ్ అఫ్ అతర్స్," స్టడీస్ ఇన్ ఫిలాసఫి అండ్ ఎడ్యుకేషన్ 21, 4-5 (జూలై, 2002), 407-416.
 24. 24.0 24.1 నుస్స్ బాం, మార్త. కల్టివేటింగ్ హ్యుమానిటీ .
 25. హర్ఫం, జియోఫ్రి. “బెనీత్ అండ్ బియాండ్ థే క్రైసిస్ అఫ్ థే హ్యుమానిటీస్” న్యూ లిటరరీ హిస్టరీ 36 (2005), 21-36.
 26. హర్ఫం, 31.
 27. డిల్తే, విల్హేలం. ది ఆర్మతిఒన్ అఫ్ థే హిస్టారికల్ వరల్డ్ ఇన్ థే హ్యూమన్ సైన్సస్ , 103
 28. ఫిష్, స్టాన్లీ, http://fish.blogs.nytimes.com/2008/01/06/will-the-humanities-save-us/#more-81
 29. ""థియరీ," యంటి-థియరీ, అండ్ ఎంపిరికల్ క్రిటిసిసం," బయోపోయటిక్స్: ఎవల్యూషనారి ఎక్స్ప్లోరేషన్స్ ఇన్ ది ఆర్ట్స్ , బ్రెట్ కూక్ మరియు ఫ్రెడెరిక్ టర్నర్, eds., లెక్సింగ్టన్, కెంటకి: ICUS బుక్స్, 1999, pp. 144-145. 152.
 30. అలం లియు, “ది ఫ్యూచర్ అఫ్ హ్యుమానిటీస్ ఇన్ ది డిజిటల్ ఏజ్” డిజిటల్ ఏజ్ లో రౌండ్ టేబిల్ వివాదం « చరిత్ర

బాహ్య లింకులుసవరించు