మానికొండ చలపతిరావు

పత్రికా రచయిత, సంపాదకుడు, గ్రంథకర్త, సాహితీవేత్త

మానికొండ చలపతిరావు (1908 -1983) పత్రికా రచయిత, సంపాదకుడు, గ్రంథకర్త, సాహితీవేత్త, మానవతా వాది.

మానికొండ చలపతిరావు
జననం1908
మరణం25 మార్చి 1983
వృత్తిపత్రికా రచయిత, సంపాదకుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నెహ్రూ ఆలోచనావిధానం

జీవిత విశేషాలు మార్చు

వీరు 1908 సంవత్సరంలో విశాఖపట్నంలో జన్మించారు. ఎం.ఏ., బి.ఎల్. పట్టాలను పొంది కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు. వీరు విశాఖపట్నంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన "ఎథేనియం" అనే పేరుతో సాహిత్య సాంస్కృతిక సంస్థను నెలకొల్పి తాను కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత "పీపుల్స్ వాయిస్", "వీక్ ఎండ్", "హిందూస్థాన్ టైమ్స్" పత్రికలలో వేర్వేరు కాలాలలో సహాయ సంపాదకులుగా పనిచేశారు.

జవహార్ లాల్ నెహ్రూ 1938 లో లక్నో నుండి ప్రారంభించిన "నేషనల్ హెరాల్డ్" దినపత్రికకు వీరిని సహాయ సంపాదకునిగా నియమించారు. తర్వాత అదే పత్రికకు సంపాదకులుగా 1946 నుండి 1978 వరకు కొనసాగి నెహ్రూకు సన్నిహిత మిత్రుడై భారతదేశంలోని ప్రముఖ పత్రికా సంపాదకులుగా పేరుపొందారు.

ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (Indian Fedration of Working Journalists) అనే సంస్థను వ్యవస్థీకరించి దానికి మొదటి అధ్యక్షులై ఆ సంస్థను 1950 నుండి 1955 వరకు ట్రేడ్ యూనియన్ పద్ధతిలో నడిపి దేశంలోని పత్రికా రచయితలకు మేలైన స్థితిగతులను కల్పించడానికి ఎంతగానో పాటుపడ్డారు.

భారతదేశ ప్రభుత్వం ప్రెస్ కమిషన్ (Press Commission) ఏర్పాటుచేయడానికి వీరే ప్రధాన కారకులు. వీరు ఐక్యరాజ్య సమితికి చెందిన యునెస్కో సంస్థకు భారతదేశ ప్రతినిధిగా వ్యవహరించారు. వీరు జవహర్ లాల్ నెహ్రూ, గోవింద వల్లభ పంత్ ల జీవిత్రచరిత్రలను ఆంగ్లంలో రచించారు. ది ప్రెస్ ఇన్ ఇండియా (The Press in India) అనేది వీరి ప్రసిద్ధిచెందిన గ్రంథం.

వీరు 1983 మార్చి 25 తేదీన అకస్మాత్తుగా పరమపదించారు.

రచనలు మార్చు

  • చలపతి రావ్, ఎం., ఒక విప్లవం, చిన్న చిన్న ముక్కలు;. భారత సమస్యలు పై వ్యాసాలు ఆక్స్ఫర్డ్, న్యూయార్క్, పెర్గామోన్ ప్రెస్ [1965] మొదటి ఎడిషన్
  • చలపతి రావ్, ఎం. మహాత్మా గాంధీ, నెహ్రూ. బొంబాయి, న్యూ యార్క్, మిత్రరాజ్యాల పబ్లిషర్స్ [1967]
  • గోవింద్ బల్లబ్ పంత్, తన జీవితం, సార్లు / M. చలపతి రావ్ న్యూ ఢిల్లీ:. మిత్రరాజ్యాల, 1981.
  • భారతదేశం: / భారతదేశం పర్యాటక అభివృద్ధి సంస్థ ఉత్పత్తి ఒక ప్రజలు చిత్రం; ఎం చలపతి రావ్ ద్వారా వ్యాఖ్యానం; జెహ్రా త్యాబ్జి, TS నాగరాజన్ ద్వారా డిజైన్, చిత్రాన్ని సవరణ. న్యూఢిల్లీ: విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, Govt. భారతదేశం, c1976 యొక్క.
  • జవహర్ లాల్ నెహ్రూ ఎం చలపతి రావ్ [ద్వారా]. [న్యూ ఢిల్లీ] పబ్లికేషన్స్ డివిజన్, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, Govt. భారతదేశం యొక్క [1973]
  • జర్నలిజం, రాజకీయాలు / చలపతి రావ్ ఎం.. న్యూ ఢిల్లీ: వికాస్, c1984.
  • మాగ్నస్ & ముసేస్: 'MC' (ఎం చలపతి రావ్) / కంపైల్, హరీంద్ర శ్రీవాస్తవ ద్వారా సవరించబడింది యొక్క "ఆఫ్ ద రికార్డ్" మ్యూజింగ్స్. గుర్గాన్: అకడమిక్ ప్రెస్, 1980.
  • ప్రెస్ / ఎం. చలపతి రావ్ న్యూ ఢిల్లీ:. నేషనల్ బుక్ ట్రస్ట్, భారతదేశం, 1974.
  • భారతదేశంలో ప్రెస్ ఎం చలపతి రావ్ [ద్వారా]. బొంబాయి, న్యూ యార్క్, మిత్రరాజ్యాల పబ్లిషర్స్ [1968]
  • జవహర్ లాల్ నెహ్రూ యొక్క రచనల ఎంచుకున్న[అడ్వైజరీ బోర్డు: ఎం. చలపతి NY శారదా ప్రసాద్, BR నందా; సాధారణ ఎడిటర్:. S. గోపాల్. న్యూ ఢిల్లీ, ఓరియంట్ లాంగ్మన్ [1972 -
  • భారత స్వాతంత్ర్య ఇరవై ఐదు సంవత్సరాల.జాగ్ మోహన్ ద్వారా భాషలు. రచనలు పంపేవారు: ఎం. చలపతి రావ్ [, ఇతరులు], ఢిల్లీ, వికాస్ పబ్. హౌస్ [1973]

మూలాలు మార్చు

ఇతర లింకులు మార్చు