మారిగావ్ జిల్లా

అస్సాం లోని జిల్లా

అస్సాం రాష్ట్ర 27 జిల్లాలలో మారిగావ్ జిల్లా ఒకటి. జిల్లా ప్రధానకార్యాలయంగా మారిగావ్ పట్టణం ఉంది. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా వైశాల్యం 1,550, జనసంఖ్య 957,853, వీరిలో పురుషులు 485,328, స్త్రీల సంఖ్య 472,525. జిల్లాలో పురాతనమైన మయాంగ్ గ్రామం ఉంది. అలాగే " పొబిటోరా విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ ఉంది ".

మారిగావ్ జిల్లా
মৰিগাঁও জিলা
District
పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యంలోని ప్రసిద్ధ నివాసితులలో ఒకరు
పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యంలోని ప్రసిద్ధ నివాసితులలో ఒకరు
Location of Marigaon district in Assam
Location of Marigaon district in Assam
Countryభారత దేశం
Stateఅసోం
ప్రధాన కార్యాలయంమారిగావ్
Time zoneIST

చరిత్ర మార్చు

మారిగావ్ చరిత్ర అస్పష్టంగా ఉంది. ఈ ప్రాంతానికి చెందిన సంప్రదాయక పాలకుడైన అతిమట్టా చరిత్ర మర్మంగానే ఉంది. అరిమట్టా మరణం తతువాత జొంగల్బలాహూ ఆయన కుమారుడు ఈ ప్రాంతానికి పాలకులయ్యారు. కజారీముఖ్ వద్ద కచారీలు జొంగల్బలాహూను వెదురు ఈటెతో చంపారు. అయినప్పటికీ జొంగల్బలాహూ తప్పించుకుని కొలాంగ్ నదిలో మునిగి ఈదుతూ వచ్చి జాగి వద్ద పైకి తేలాడని వివరిస్తుంది. అందువలన ఈ ప్రాంతానికి రహ, జగి అనేపేర్లు వచ్చాయి. భీంసింగ్ రచనలు మారిగావ్, పరిసరప్రాంతాల గురించిన కొంత వివరణ ఇస్తుంది. ఈ ప్రాంతాన్ని 6 మంది పాలకులు పాలించారు. ఈ సమయంలో ఇద్దరు దర్రాంగ్ నుండి రాజకుమారులు (సుప్రద్వాజ్, మకరధ్వజ్) అంతర్యుద్ధం కారణంగా వారి రాజ్యం నుండి పారిపోయి బ్రహ్మపుత్ర నదుని దాటి వచ్చి బహకజరి వద్ద స్థిరపడ్డారు. తరువాత సుప్రధ్వజ్ బఘర రాజు మంగళసింగ్ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. తరువాత సుప్రధ్వజ్ ఈ ప్రాంతానికి 7వ స్వతంత్ర పాలడయ్యాడు. లచిత్ బొర్ఫుఖాన్ పాలనా కాలంలో దర్రాంగ్ నుండి రాం సింగ్, భీంసింగ్ అనే ఇద్దరు రాజకుమారులు బ్రహ్మపుత్రను దాటి ఈ ప్రాంతానికి వచ్చారు. భీంసింగ్ ఇక్కడ స్థిరపడ్డాడు రాంసింగ్ మాత్రం తిరిగి తనస్వస్థలానికి వెళ్ళాడు. భీంసింగ్ ప్రజల అభిమానపాత్రుడు కాలేకపోయాడు. తరువాత భీంసింగ్ బ్రహ్మపుత్ర నదిని దాటి వెళ్ళి మోరీ బీల్ వద్ద స్థిరపడ్డాడు.[1] 1989 సెప్టెంబరు 29న నాగావ్ జిల్లా నుండి కొంత భూభాగం వేరు చేయబడి మారిగావ్ పూర్తి స్థాయి జిల్లాగా ఏర్పాటు చేయబడింది.[2]

భౌగోళికం మార్చు

మారిగావ్ జిల్లా వైశాల్యం 170 చ.కి.మీ.[3] వైశాల్యంలో మారిగావ్ జిల్లా సమోయాలోని సవాలీకి సమానం.[4] జిల్లా ఉత్తర సరిహద్దులో బ్రహ్మపుత్ర నది, దక్షిణ సరిహద్దులో కర్బి ఆంగ్లాంగ్ జిల్లా, తూర్పు సరిహద్దులో నాగావ్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో కామరూప్ జిల్లా ఉన్నాయి. జిల్లాలో అధికంగా నదులు, కాలువలు ప్రవహిస్తున్న కారణంగా విస్తారమైన సారవంతమైన భూములు అక్కడక్కడా చిత్తడి భూములు ఉన్నాయి. జిల్లాలో కీలింగ్, కొలాంగ్, కొప్లి నదులు ప్రవహిస్తున్నాయి. మతిపర్వత్ వద్ద కీలింగ్ నది కోలాంగ్ నదితో సంగమించి పశ్చిమ దిశగా ప్రవహిస్తుంది. జాగి దుయీ ఖుతీ ముఖ్ వద్ద కొలాంగ్ నది కొపిలి నదితో సంగమిస్తుంది. జిల్లా మొత్తం పూర్తిగా ప్రకృతి సౌందర్యంతో శోభిల్లుతుంది.

ఆర్ధికం మార్చు

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో మారిగావ్ జిల్లా ఒకటి అని గుర్తించింది[5]. బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న అస్సాం రాష్ట్ర 11 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[5]

విభాగాలు మార్చు

జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి : జాగిరోడ్డు, మారిగావ్, లహరిఘాట్.[6] జాగిరోడ్డు షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేకించబడింది.[6] ఇవన్నీ నౌగాంగ్ పార్లమెంటు నియోజక వర్గంలో భాగంగా ఉన్నాయి.[7]

2011 లో గణాంకాలు మార్చు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 957,853, [8]
ఇది దాదాపు. ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[9]
అమెరికాలోని. మొంటానా నగర జనసంఖ్యకు సమం.[10]
640 భారతదేశ జిల్లాలలో. 455వ స్థానంలో ఉంది.[8]
1చ.కి.మీ జనసాంద్రత. 618 [8]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 23.39%.[8]
1991-2001కుటుంబనియంత్రణ శాతం. 21.35%
స్త్రీ పురుష నిష్పత్తి. 974:1000 [8] 2001- 946-1000
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 69.37%.[8] 2001- 58.63%
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ
జిల్లావైశాల్యం 1559 చ.కి.మీ

2001 గణాంకాలు మార్చు

విషయాలు వివరణలు
జనసంఖ్య 5,312,396
1901 - 2001 జనసంఖ్య అభివృద్ధి.
స్త్రీ:పుర్షులు 946:1000
అక్షరాస్యత 58.53%
పురుషుల అక్షరాస్యత 73.66%
స్త్రీల అక్షరాస్యత 64.99%
మొత్తం అక్షరాశ్యులు 554,143 of
పురుషుల అక్షరాస్యత సంఖ్య 297,422
స్త్రీల అక్షరాస్యత సంఖ్య 256,721
2001 - 1చ.కి.మీ జనసాంద్రత. 500
0-6 వయసున్న బాలబాలికల సంఖ్య 148,765 (19.16)
బాలురు 81,567
బాలికలు 77,521
మొత్తం అస్సాంలో మారిగావ్ జనసంఖ్య 3.07 %

వృక్షజాలం, జంతుజాలం మార్చు

అరణ్యాలు మార్చు

జిల్లాలో 1891లో అస్సాం ఫారెస్ట్ రెగ్యులేషన్ 3 అభయారణ్యాలు ఏర్పాటు చేయబడ్డాయి: సునైకుచి, ఖులహత్, బుర మయాంగ్. జిల్లాలోని మయాంగ్ వద్ద పొబితొర వన్యప్రాణి అభయారణ్యం ఏర్పాటు చేయబడింది. ఈ అభయారణ్యంలో ప్రత్యేకంగా ఖడ్గమృగాలు ఉన్నాయి.

మూలాలు మార్చు

  1. "HISTORY OF MORIGAON". Archived from the original on 2012-02-07. Retrieved 2014-09-25.
  2. Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  3. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: Assam: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1116. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  4. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2015-12-01. Retrieved 2011-10-11. Savai'i 1,708
  5. 5.0 5.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  6. 6.0 6.1 "List of Assembly Constituencies showing their Revenue & Election District wise break - up" (PDF). Chief Electoral Officer, Assam website. Archived from the original (PDF) on 22 మార్చి 2012. Retrieved 26 September 2011.
  7. "List of Assembly Constituencies showing their Parliamentary Constituencies wise break - up" (PDF). Chief Electoral Officer, Assam website. Archived from the original (PDF) on 22 మార్చి 2012. Retrieved 26 September 2011.
  8. 8.0 8.1 8.2 8.3 8.4 8.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  9. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Fiji 883,125 July 2011 est.
  10. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Montana 989,415

వెలుపలి లింకులు మార్చు

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు