మిరియాల నూనె ఒక ఆవశ్యక నూనె.ఇది ఓషద నూనె .ఈ నూనెను నల్లమిరియాల నూనె అనికూడా అంటారు.ఆంగ్లంలో పెప్పెర్ ఆయిల్ లేదా బ్లాక్ పెప్పరు ఆయిల్ అంటారు.మిరియాల నూనె రోగనిరోధకశక్తిని పెంపెందించుటకు, జీర్ణ వ్యవస్థ పనితీరును పెంచడానికి సహాయపడుతుంది.మిరియాలను కూడా అయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. అంతేకాదు మిరియాలను మసాలాదినుసుగా వాడతారు. మిరియాలపొడిని ఆహారానికి ఘాటైన రుచి, వాసనకై చేరుస్తారు.వైద్యపరంగా మిరియాల వలన, మిరియాల నునే వలన పలు ప్రయోజనాలు ఉన్నాయి.

నల్ల మిరియాలు
Pepper plant with immature peppercorns
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
P. nigrum
Binomial name
Piper nigrum

మిరియపు మొక్క/మిరియాలమొక్క

మార్చు

ఇవి పైపరేసి కుటుంబంలో పైపర్ ప్రజాతికి చెందినది.మొక్క నిజానికి ఒక అటవీ మొక్క, ఈమొక్క ఇతర చెట్ల ఆధారంగా ఎగబ్రాకే మొక్క. ఇతర చెట్ల కాండం, కొమ్మల ఆధారాలను ఇరవై అడుగుల ఎత్తుకు ఏగబాకుతుంది., కానీ సాధారణంగా వాణిజ్య అవసరాలకు సుమారు 12 అడుగుల వరకు మాత్రమే పెంచుతారు.మొక్క దాదాపు ఇరవై సంవత్సరాల ఆయుర్దాయం కలిగి ఉంది.

మిరియాలమొక్క పుట్టుక స్థానం-ఆవాసం

మార్చు

ఈ మొక్క పుట్టుక స్థానం భారతదేశంఅని బావించబడుతున్నది.ఇది మలేషియా, మడగాస్కర్, చైనా, ఇండోనేషియా దేశాలలో ఎక్కువ స్థాయిలో సాగులో ఉంది. మిరియాల నూనె ఎక్కువగా సింగపూర్, భారతదేశం, మలేషియాలో ఉత్పత్తి అవుతున్నది.[2]

పేరు వెనుక చరిత్ర

మార్చు

పెప్పర్ అనే పదం లాటిన్ పదమైన పైపర్ నుండి ఉద్భవించింది, ఇది సంస్కృత పదమైన పిప్పాలి నుండి తీసుకోబడింది.మిరియాలను పురాతన రోమన్లు, గ్రీకుల కాలం నుండి ఉపయోగించబడినట్లు తెలుస్తున్నది..టర్కి వాళ్లు మిరియాల అమ్మకం మీద పన్ను కూడా విధించినట్లు తెలుస్తున్నది.

మిరియపు నూనె ఉత్పత్తి/సంగహణ

మార్చు

మిరియాలనూనెను నీటి ఆవిరి స్వేదనక్రియ/స్టీము డిస్టిలేసను విధానంలో ఉత్త్పత్తి చేస్తారు.బాగా పక్వానికి వచేముందు దోరగా వున్న మిరియపు పళ్లను సేకరించి నీడలో ఆరబెట్టి తరువాత నీటి ఆవిరి స్వేదనక్రియ పద్ధతిలో నూనెను సంగ్రహించెదరు.ఎండిన మిరియాలనుండి దాదాపు 2%వరకు మిరియాల నూనె ఉత్పత్తి అవును.[2]

డిస్టిలేటరు, స్టీలుతో చేయబడిన పాత్ర స్తూపాకారంగా వుండి, పైభాగం శంకువు లేదా డోము ఆకారంలో వుండును. పైభాగాన ఒక గొట్టం, తిరగేసిన U లా వంపుగా వుండి, దాని చివర ఒక కండెన్సరుకు బిగింపబడి వుండును. కండెన్సరులో ద్రవీకరణ చెందిన నూనెను సంగ్రహించుటకు ఒకగొట్టం సంగ్రహణ పాత్రకు కలుపబడి వుండును.డిస్టిలేటరు ఒక పొయ్యి మీద అమర్చబడి వుండును. డిస్టిలేటరులో మిరియాలు నింపెదరు.డిస్టిలేటరు అడుగు భాగం నుండి స్టిమును పంపెదరు. మిరియాల నూనె తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆవిరిగా మారు స్వాభావం కల్గి ఉంది.అందువలన డిస్టిలేటరులోకి స్టిమును పంపి నపుడు స్టీము వేడికి మిరియాలనూనె కూడా ఆవిరిగా మారి, డిస్టిలేటరు పైభాగంలో వున్న గొట్టం ద్వారా కండెన్సరు చేరి, అక్కడ ద్రవీకరణ చెంది సంగ్రహణ పాత్రలో జమ అగును. మిరియాల నూనె యొక్కసాంద్రత నీటి కన్న తక్కువ కావడం వలన, సంగ్రహణ పాత్రలో కింది భాగంలో నీరు, నీటి ఉపరితలంలో తులసి నూనె జమ అగును.

మిరియపు నూనె భౌతిక గుణాలు-నూనెలోని సమ్మేళనాలు

మార్చు
  • మిరియపు నూనె సాంద్రత:0.8590
  • వక్రీభవన సూచిక:1.476 (30 °Cవద్ద)

మిరియపు నూనెలో చాలా రసాయన సమ్మేళనాలు ఉన్నప్పటికి అందులో ముఖ్యమైనవి కరైపిల్లేన్ (caryophyllene) 19-20% వరకు, లిమానేన్ 9-10%వరకు కాంపీన్ (camphene)8నుండి9%శాతం మధ్యలో వుండును.మొక్క మెరిగిన ప్రదేశాన్ని బట్టి.భూమి సారాన్ని బట్టి నూనెలోని ఘటకాల సంఖ్య వాటి, శాతం మారును. మిరియపు నూనె లోని కొన్ని పదార్థాలు[3]

వరుస సంఖ్య రసాయన సమ్మేళనం శాతం
1 కారియో పిల్లేన్ (caryophyllene) 19-20%
2 లిమానేన్ 9-10%
3 కాంపేన్ (camphene) 8-9%
4 జెర్మ్‌క్రీన్ (germacrene) : 11.01%),
5 బీటా-పినేనే (β-pinene) 10.02%),
6 ఆల్ఫా పెల్లెండ్రీన్ (α- phellandrene .56
7 బీటా కరైపిల్లేన్ (β-caryophyllene) 7.29%
8 ఆల్ఫా పీనెనే ( αpinene) (6.40%),
9 సీస్-బీటా ఓసిమేన్ (cis-β-ocimene 3.19%
10 3-కరీన్ (3-carene) 7.08%
11 సబినిన్ (sabinene) 2.98%
12 trifluoromethanesulfenyl fluoride 2.14
13 caryophyllene oxide 1.78%

ఉపయోగాలు

మార్చు
  • మిరియపు నూనె యాంటీ క్యాన్సరు గుణం కల్గి ఉంది.అనగా క్యాన్సరు సంక్రమణను ని;లువరించు లక్షణం కల్గి ఉంది.మిరియపు నూనెను లోపలికి తీసుకున్నప్పుడు, రక్త నాళాలలో రక్త ప్రసరణను మెరుగు పరచి, రక్త వత్తిడిని తగ్గిస్తుంది.యాంటీ వైరల్ లక్షణాలను కల్గి వున్నది నల్ల మిరియాలు నూనె మలబద్ధకం, అతిసారం, వాయువు యొక్క అసౌకర్యాన్ని తగ్గించటానికి సహాయపడవచ్చు. కాంప్లిమెంటరీ మెడిసిన్ జర్నల్ లో ప్రచురించబడిన 2014 సంవత్సరపు అధ్యయనం ప్రకారం మిరియపు నూనెను మార్జోరామ్, లావెండరు,, పుదీనా నూనెతో కల్పి మెడ నొప్పితో బాధ పడుతున్న రోగులకు మెడమీద నాలుగు వారాలపారు రోజు మార్దన చెయ్యడం వలన నొప్పి గణనీయంగా తగ్గింది.యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటిస్ప్యాస్మోడిక్ లక్షణాల కారణంగా, నల్ల మిరియాలు నూనె కండరాల గాయాలు, స్నాయువు, కీళ్ళనొప్పులు, రుమటిజం యొక్క లక్షణాలను తగ్గించేందుకు పనిచేస్తుంది.[4]
  • ఇది లాలాజల ప్రవాహాన్ని పెంచుతుంది, ఆకలిని ప్రేరేపిస్తుంది, పెరిస్టాలిసిస్ను ప్రోత్సహిస్తుంది, ఒక సాధారణ జీర్ణ టానిక్.[2]
  • కీళ్లనొప్పులకి, వాతనొప్పులకు ఉపయోగిస్తారు.
  • మిరియపు నూనె యాంటీ క్యాన్సరు గుణం కల్గి ఉంది.అనగా క్యాన్సరు సంక్రమణను నిలువరించు లక్షణం కల్గి ఉంది.
  • మిరియపు నూనెను లోపలికి తీసుకున్నప్పుడు, రక్త నాళాలలో రక్త ప్రసరణను మెరుగు పరచి, రక్త వత్తిడిని తగ్గిస్తుంది.
  • యాంటీ వైరల్ లక్షణాలను కల్గి ఉంది.
  • నల్ల మిరియాలు నూనె మలబద్ధకం, అతిసారం, వాయువు యొక్క అసౌకర్యాన్ని తగ్గించటానికి సహాయపడును.
  • నల్ల మిరియాలు నూనె నొప్పి ఉపశమనం కల్గిస్తుంది., రుమటిజం, చలి, ఫ్లూ, జలుబు, తగ్గిస్తుంది, అలసట, కండరాల నొప్పులు, శారీరక నొప్పులు తగ్గిస్తుంది

బయటి వీడియో లింకులు

మార్చు

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Piper nigrum information from NPGS/GRIN". www.ars-grin.gov. Archived from the original on 23 డిసెంబరు 2008. Retrieved 2 March 2008.
  2. 2.0 2.1 2.2 "Black pepper essential oil information". essentialoils.co.za. Archived from the original on 2018-01-26. Retrieved 2018-08-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Physicochemical Characteristics of Essential Oil of Black Pepper" (PDF). jfqhc.ssu.ac.ir. Archived from the original on 2018-04-21. Retrieved 2018-08-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "10 Black Pepper Essential Oil Benefits You Won't Believe". draxe.com. Archived from the original on 2018-08-06. Retrieved 2018-08-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)