మిలింద్ మానే (జననం 3 డిసెంబర్ 1970) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నాగపూర్ నార్త్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

మిలింద్ మనే

పదవీ కాలం
2014 – 2019
ముందు నితిన్ రౌత్
తరువాత నితిన్ రౌత్
నియోజకవర్గం నాగపూర్ నార్త్

వ్యక్తిగత వివరాలు

జననం (1970-12-03) 1970 డిసెంబరు 3 (వయసు 54)
నాగ్‌పూర్ , మహారాష్ట్ర, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ
  • భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సరిత మనే
సంతానం తేజల్ మానే, ఆస్తా మానే, మైత్రేయ మనే
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

మిలింద్ మానే ఆర్.పి.ఐ (యునైటెడ్) ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2007లో నారా వార్డు నుండి ఆర్.పి.ఐ (యునైటెడ్) అభ్యర్థిగా కార్పొరేటర్‌గా ఎన్నికై ఆ తరువాత 2012 మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నాగపూర్ నార్త్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి కిషోర్ ఉత్తమ్రావ్ గజ్భియే పై 55187 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

మిలింద్ మానే 2019,[3] 2024 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నితిన్ రౌత్ చేతిలో ఓడిపోయాడు.[4]

మూలాలు

మార్చు
  1. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  2. The Times of India (23 October 2014). "Despite having experience very few corporators become legislators". Archived from the original on 7 December 2024. Retrieved 7 December 2024.
  3. TimelineDaily (30 October 2024). "Nitin Raut, Milind Mane Face-Off In Nagpur North" (in ఇంగ్లీష్). Archived from the original on 7 December 2024. Retrieved 7 December 2024.
  4. Election Commission of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Nagpur North". Archived from the original on 7 December 2024. Retrieved 7 December 2024.