ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 72 జిల్లాలలో ముజఫర్‌నగర్ జిల్లా (హిందీ: मुज़फ़्फ़र नगर ज़िला ) (ఉర్దూ: مُظفٌر نگر ضلع) ఒకటి. ముజఫర్‌నగర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ముజఫర్‌నగర్ జిల్లా సహరన్పూర్ డివిషన్‌లో భాగంగా ఉంది.జిల్లాకు యు.పి.లో అత్యధిక వ్యవసాయ జి.డి.పి ఉంది. ఉత్తరప్రదేశ సమృద్ధికలిగిన జిల్లాలలో ఇది ఒకటిగా గుర్తించబడుతుంది. దేశంలో అత్యధికంగా చెరకు ఉత్పత్తి చేస్తున్న జిల్లాగా గుర్తించబడుతుంది.

Muzaffar Nagar జిల్లా

मुज़फ़्फ़र नगर ज़िला
مُظفٌر نگر ضلع
Uttar Pradesh లో Muzaffar Nagar జిల్లా స్థానము
Uttar Pradesh లో Muzaffar Nagar జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంUttar Pradesh
పరిపాలన విభాగముSaharanpur
ముఖ్య పట్టణంMuzaffar Nagar
మండలాలుSadar,Budhana,Jansath and Khatauli
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుMuzaffar Nagar, Bijnor(partial)
 • శాసనసభ నియోజకవర్గాలుMuzaffar Nagar,
Budhana,
Charthawal,
Khatauli,
Meerapur,
Purkazi
విస్తీర్ణం
 • మొత్తం2,958 కి.మీ2 (1,142 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం28,27,154
 • సాంద్రత960/కి.మీ2 (2,500/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత68.68 per cent[1]
ప్రధాన రహదార్లుNH 58
జాలస్థలిఅధికారిక జాలస్థలి

ప్రయాణ సౌకర్యాలుసవరించు

ముజఫర్‌నగర్ జిల్లా ఉత్తర ప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో ఉంది. ఇది ఢిల్లీ నుండి 12 కి.మీ దూరంలో ఉంది. ఇది జాతీయరహదారి - 58 లో ఢిల్లీ, డెహ్రాడూన్ మార్గంలో ఉంది. ముజఫర్‌ నగర్ జిల్లా రైలు, రహదారి మార్గాలతో చక్కగా అనుసంధానించబడి ఉంది.

చరిత్రసవరించు

పురాతన కాలంసవరించు

పురాతన కాలం ముజఫర్‌పూర్ జిల్లా గంగా యమునా మైదానంలో ఉంది. ఇది మానవ నివాసాలకు అనుకూలమైన ప్రదేశం. జిల్లాలో మండి గ్రామం ప్రాంతంలో ఆరభకాల హరప్పన్ నాగరికతకు చెందిన మానవనివాసం గురించిన ఆధారాలు లభిస్తున్నాయి. ఈ ప్రాంతం హరప్పానాగరికత కాలంలో జనపదంగా ఉండేదని భావిస్తున్నారు. హరప్పా నాగరికతలో ఉపయోగించిన కుండలు, పళ్ళికలు, మూకుడులు, ఇతర వస్తువులు వంటివి తరచుగా జిల్లా, పరిసర ప్రాంతాలలో ఉపయోగంలో కనిపిస్తున్నాయి. ప్రస్తుత పంజాబు భూభాగం నుండి ఈ ప్రాంతానికి ఇండో ఆర్యన్ ప్రజల ప్రవేశానికి ఈ ప్రాంతం సాక్ష్యంగా ఉంది. మాహాభారత కాలంలో ఇది కురు సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. జిల్లా ప్రాంతానికి తూర్పు సరిహద్దులో ఉసినర, పాంచాల మహాజనపదాలు ఉన్నాయి. ప్రాంతీయ వాసుల కథనలను అనుసరించి ప్రస్తుత పచెండా గ్రామంలో పాండవులు, కౌరవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగిందని తెలుస్తుంది. అలాగే పాండవుల సేనలు విడిది చేసిన ప్రాంతం ప్రస్తుతం పాండవాలి అని కౌరవ సేనలు విడిచేసిన ప్రాంతం ప్రస్తుత కౌరవాలి అని భావిస్తున్నారు. హస్థినౌరానికి, కురుక్షేత్రానికి ఇది సమీపంగా ఉన్నందున ఈ ప్రాంతానికి మహాభారతకాలంలో ప్రధాన్యత ఉండేదని తెలుస్తుంది. ఇక్కడ జరిపిన త్రవ్వకాలలో లభించిన పురాతన గ్రీసు, రోము నాణ్యాల ఆధారంగా ఆకాలంలో ఇది ప్రధాన వ్యాపార మార్గంలో ఉందని భావిస్తున్నారు. ఇక్కడ పురాతత్వ పరిశోధన త్రవ్వకాలు కొనసాగుతూ ఉన్నాయి. తూర్పు, పశ్చిమ భూభాగలోజరిగిన సామ్రాజ్య విస్తరణా దండయాత్రలలో అధికభాగం గంగా యమునా మైదాన ప్రాంతంలోనే జరిగాయి. దందయత్రల సమయంలో సైన్యాలు ముజఫర్‌నగర్, సహరనపూర్ భూభాగాలను దాటుకుంటూ వెళ్ళాయని భావిస్తున్నప్పటికీ విశ్వసనీయమైన సమాచారం మాత్రం లభించలేదు. జిల్లాలోని సర్వత్ ప్రాంతంలో ఒకప్పుడు శ్రవణ మహర్షి నివసించిన ప్రాంతం (శ్రవణావతం) అని విశ్వసిస్తున్నారు. సర్వత్ గ్రామంలో శ్రవణ మహర్షి ఆలయం ఉంది. దీనిని ఈ ప్రాంతాన్ని పాలించిన త్యాగి పాలకులు నిర్మించారు.

మధ్యయుగంసవరించు

ముజఫర్‌నగర్ ఆరంభకాల మధ్యయుగ చరిత్ర ఇండో- ముగల్ కాలం వరకు అస్పష్టంగా ఉంది. 1399లో ఈ ప్రంతం మీదుగా తైమూరు సైన్యాలు ఢిల్లీ వైపు పయనించాయని భావిస్తున్నారు. వారి మీద ఈ ప్రాంతప్రజలు సాగించిన సమరం అపజయంతో ముగిసింది. ముగల్ చక్రవర్తి అక్బర్ కాలంలో ముజఫర్‌నగర్ ప్రాంతంలో అధికభాగాన్ని సర్వత్ అని పిలువబడింది. ఆసమయంలో సర్వత్ తగ (త్యాగి బ్రాహ్మణుల) ఆధీనంలో ఉండేది. సర్వత్ గ్రామం సహరనపూర్ సర్కిల్‌లో భాగంగా ఉండేది. అక్బర్ సర్వత్ పరగణాను సయ్యద్ ముహమ్మద్ ఖాన్‌కు బహుమతిగా ఇచ్చాడు. 17వ శతాబ్దం వరకు ఇది సయ్యద్ ముహమ్మద్ వారసుల ఆధీనంలో ఉంది. పీర్ ఖాన్‌ను చంపిన తరువాత షాజహాన్ మరణించిన పీర్ ఖాన్ బిరుదును, సర్వత్ పరగణాను సయ్యద్ ముజఫర్ అలీ ఖానుకు కానుకగా ఇచ్చాడు. ఆయనకుమారుడు మున్వర్ లస్కర్ అలీ ఖాన్ నగరాన్ని స్థాపించి దానికి ముజఫర్‌నగర్ అని నామకరణం చేసాడు. [2] జిల్లా చరిత్ర సయ్యద్ పాలకులతో ముడిపడి ఉంది. ఇది సయ్యద్ సోదరులకు (హాసన్, అబ్దుల్లా) జన్మస్థానం. హాసన్, అబ్దుల్లా సోదరులు ముగల్ పాలకులకు అండగా నిలిచిన వారిలో ముఖ్యులుగా చరిత్రలో స్థానం సంపాదించారు. 18వ శతాబ్దంలో మరాఠీ పాలకులు గంగా యమునా భూభాగంలో అధికభాగం మీద ఆధిక్యత సాధించారు.

కాలనీ కాలంసవరించు

1803లో బ్రిటిష్ పాలకులు సామ్రాజ్య విస్తరణలో భాగంగ తూర్పు నుండి ప్రయాణించి సహరంపూర్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. అందులో ముజఫర్‌నగర్ కూడా భాగంగా ఉంది. జిల్లా సరిహద్దులు న్యాయపరిధి తరచుగా మారుతూ ఉండేవి. 1826 నుండి ఈ ప్రాంతానికి ప్రత్యేకత కల్పించబడింది. 1857లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర భారతదేశం తిరుగుబాటు చేసినప్పుడు తిరుగుబాటులో ముజఫర్‌నగర్ ప్రజలు కూడా భాగస్వామ్యం వహించారు. తిరుగుబాటుకు షామ్లి కేంద్రంగా ఉంది. తరువాత కొంతకాలం ఇది స్వతంత్రంగా ఉంది. తిరుగుబాటు విఫలం అయిన తరువాత బ్రిటిష్ ప్రభుత్వం ఈ ప్రాంతం లోని తిరుగుబాటు దారుల మీద తీవ్రంగా వ్యవహరించింది. స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న షామ్లి, తంభవన్, ఇతర ప్రాంతాలకు చెందిన రొహిల్లా పఠాన్ మద్దతుదార్లను మూకుమ్మడిగా వధించారు. ఈ ప్రాంతం పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. అయినప్పటికీ 1899 నాటికి ప్రజలలో స్వాతంత్ర్య జ్వాల తీవ్రంగా రాజుకుంది. ముజఫర్‌నగర్‌లో జాతీయ కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభించబడింది. పి.టి సుందర్‌లాల్, లాలా హర్దయాళ్, శ్రీ శాంతి నారాయణ్, నవాబ్‌జాదా, లైక్వత్ అలీ ఖాన్ (1947లో దేశం విభజించబడిన తరువాత ఆయన పాకిస్థాన్ మొదటి ప్రధానిగా పదవి వహించాడు), హాజీ అహమ్మద్ బక్ష్ స్వాతంత్ర్య సమరయోధులలో ముఖులు. హాజీ అహమ్మద్ బక్ష్ జైలులో ఉన్న సమయంలో ఆయన కుమారుడు మరణించినప్పటికీ ఆయన కుమారుని అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు. ఆయన క్షమాపణ పత్రం సమర్పించడానికి నిరాకరించినందున ఆయనకు జైలు నుండి వెళ్ళాడానికి జైలర్ నుండి అనుమతి లభించలేదు. క్షపాపణ పత్రం ఇవ్వనందుకు ఆయన వీపు మీద 50 కొరడాదెబ్బలను శిక్షగా ఇచ్చారు.

స్వాతంత్ర్యానంతరంసవరించు

2013లో ముజఫర్‌నగర్‌లో చెలరేగిన మతఘర్షణలు జాతీయస్థాయిలో కలవరపరిచాయి. హిందూ, ముస్లిం మతాల నడుమ జరిగిన ఈ ఘర్షణల్లో 43 మంది మరణించారు, 93 మంది గాయపడ్డారు.[3]

పురాణాలుసవరించు

జిల్లా ప్రాంతంలో శుక్రతల్, ఖద్దర్ మొదలైన పలు పౌరాణిక ప్రాముఖ్యత కలిన ప్రదేశాలు ఉన్నాయి. జిల్లాలో రెండు శాకంబరీదేవి ఆలయాలు ఉన్నాయి. జిల్లాలోని ఫారెస్ట్ అనబడే ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన కథనం ఉంది. ఇది సన్యాసులకు, దేవుళ్ళకు ఇది ప్రఖ్యాతి చెందిన ప్రాంతంగా ఉంది. ఫారెస్ట్‌లో బాబా గోపాల్ గిరి దేవతలను ఆరాధించే వాడు. ఆయన మరణించిన తరువాత కూడా జీవించే విద్యను తెలుసుకున్నాడని ప్రజలు విశ్వసించేవారు. ఈ అరణ్యంలో మనిషిని సజీవంగా ఉంచే మూలికలు ఉన్నాయని ప్రజలు విశ్వసిస్తున్నారు. బాబా స్వప్నంలో శాకంబరీదేవి కనిపించి తనకు ఆలయం నిర్మించమని కోరిందని బాబా ప్రజల నుండి విరాళాలు సేకరించి ఆలయ నిర్మాణం పూర్తిచేసాడని ప్రజల కథనాల ద్వారా తెలుస్తుంది. శకంబరీ దేవి ఫారెస్ట్ ప్రాంతంలో శాశ్వతంగా ఉండాలని కోరుకున్నదని భక్తులు విశ్వసిస్తున్నారు. ఆలయనిర్మాణం పూర్తి అయిన తరువాత బాబా మరణించాడు.

భౌగోళికంసవరించు

ముజఫర్‌నగర్ జిల్లా దాదాపు దీర్ఘచతురశ్రాకారంలో ఉంటుంది. జిల్లా 29°11′30″ డిగ్రీల ఉత్తర అక్షాంశం, 29°45′15 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా వైశాల్యం 300 చ.కి.మీ. జిల్లా తూర్పు, పడమరల మధ్య అత్యధిక దూరం 97 కి.మీ. ఉత్తర, దక్షిణాల మధ్య అత్యధిక దూరం 57 కి.మీ. సరాసరి పొడవు 95 కి.మీ. సరాసరి వెడల్పు 50 కి.మీ. జిల్లా సరాసరిగ సముద్రమట్టానికి 232 మీ. ఎత్తున ఉంది. జిల్లాలో రెండు నదులు ప్రవహిస్తున్నాయి. తూర్పున గంగానది పశ్చిమంలో యమునా నది ప్రవహిస్తుంది.

సరిహద్దులుసవరించు

సరిహద్దు వివరణ జిల్లా
పశ్చిమ సరిహద్దు షామ్లి జిల్లా
తూర్పు సరిహద్దు బిజ్నూర్ జిల్లా, ఉత్తర ప్రదేశ్
ఉత్తర సరిహద్దు సహ్రాన్‌‌పూర్ జిల్లా
దక్షిణ సరిహద్దు మీరట్ జిల్లా

విభాగాలుసవరించు

జిల్లాలో 10 మండలాల [4] జాబితా :-

Sr. No. మండలం పేరు Sr. No. మండలం పేరు
1 కూక్ర 2 బుధన
3 భగ్ర 4 షహ్పుర్
5 పుర్కజి 6 చర్థవల్
7 మొర్న 8 జన్సథ్
9 ఖతౌలి 10 కంధ్ల (20 గ్రామాలు)

2011లో ముజఫర్‌నగర్ జిల్లా షామ్లీ, కైరనా తాలూకాలను వేరుచేసి షామ్లి పట్టణం [5] కేంద్రంగా షామ్లీ జిల్లా రూపొందించబడింది.

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,827,154,[6]
ఇది దాదాపు. లెబనాన్ దేశ జనసంఖ్యకు సమానం.[7]
అమెరికాలోని. ఒరెగాన్ నగర జనసంఖ్యకు సమం.[8]
640 భారతదేశ జిల్లాలలో. 125 వ స్థానంలో ఉంది..[6]
1చ.కి.మీ జనసాంద్రత. 960 .[6]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 16.8%.[6]
స్త్రీ పురుష నిష్పత్తి. 886:1000 [6]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 70.11%.[6]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ
ప్రజలు హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు[9]
ముజఫర్‌నగర్ బి.1.[10]

ఆర్ధికంసవరించు

ముజఫర్‌నగర్ పారిశ్రామికంగా ప్రాధాన్యత కలిగిన నగరంగా గుర్తించబడుతుంది. జిల్లాలో చక్కెర మిల్లులు, స్టీల్, పేపర్ ప్రధానపరిశ్రమలుగా ఉన్నాయి. జిల్లాలో రాణా స్టీల్, బర్నాలా స్టీల్, యు.పి స్టీల్, సిధ్‌బలి స్టీల్ మొదలైన స్టీల్ పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో రిసార్ట్లులు, రెస్టారెంట్లు ఉన్నాయి. .

సంస్కృతిసవరించు

జిల్లా సాంస్కృతికంగా ఇండో - ఇస్లామిక్ మిశ్రిత పశ్చిమ ఉత్తరప్రదేశాన్ని పోలి ఉంటుంది. పురాతన నగరంలో ముగల్ సామ్రాజ్య చిహ్నాలు అధికంగా ఉంటాయి. జిల్లాలోని పట్టణాలు, గ్రామాలలో ముగల్ కాలంనాటి నిర్మాణాలు అనేకం ఉన్నాయి. జిల్లా కేంద్రానికి 22 కి.మీ దూరంలో ఉన్న జంసత్ తాలూకాలో శితమహల్, కిల్లి దర్వాజా మొదలైన పలు హవేలీలు (సయ్యదీల మఠాలు) ఉన్నాయి.

జంసత్ హౌస్సవరించు

జంసత్ హౌస్ అంసరి రోడ్డులో ఉన్న పెద్ద భవనం. ఇది సీనియర్ అడ్వకేట్ ఎస్.హెచ్ జామిల్ అహ్మద్ కు స్వంతమైనది. ఈ భవనం ముందు సయ్యద్ జంసత్ సయ్యద్ సోదరులది. మౌలానా లిఫ్తిఖరుల్ హాసన్ సాహెబ్ (ఖండ్ల) ఈ నగరాన్ని సందర్శించినప్పుడు ఈ భవనంలో కొంతకాలం ఉండి ప్రసగించాడు.

బొహరాన్ మందిర్సవరించు

ఇది ముజఫర్‌నగర్ అంసారి రోడ్డు సమీపంలో ఉంది. ఈ ఆకయంలో 11 శివలింగాలు ఉంటాయి. ఇది ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశంగా గుర్తించబడుతుంది. ఇక్కడకు భక్తులు మితంగానే వస్తుంటారు.

వహెల్నాసవరించు

జిల్లా కేంద్రానికి 4 కి.మీ దూరంలో ఉంది. ఇది జైనుల పవిత్ర ఒరదేశం. హిందూ- ముస్లిం - జైన సంప్రదాయానికి ఇది సంకేతంగా ఉంది. ఇక్కడ ఒకదానికి ఒకటి ఆనుకుని జైన మందిరం, శివాలయం, మసీదు ఉన్నాయి.

ప్రముఖులుసవరించు

 • ప్రపంచ ప్రఖ్యాత రచయిత ఇస్లామిక్ న్యాయవ్యవస్థ గ్రంథాల రచయిత మౌలాలానా అషరఫ్ థన్వి జన్మస్థానం జిల్లాలోని థానాభవన్.||
 • తబ్లిగి జమాత్ ఉద్యమ స్థాపకుడు మౌలానా ఇలియాస్ ముజఫర్‌నగర్ జిల్లాలోని కంధ్లా వాసి.
 • రచయిత ఫాజైల్ ఇ ఆమల్ కూడా కంధ్లా వాసి.
 • 'ప్రముఖ హిందీ రాచయిత విష్ణు ప్రభాకర్ స్వస్థలం ముజఫర్‌నగర్ జిల్లాలోని మిరాపూర్.

విద్యసవరించు

 • 'జిల్లాలో రెండు వైద్య కళాశాలలు, ఐదు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. నగరంలో నాలుగు మేనేన్మెంటు కళాశాలలు, ఎనిమిది డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. నగరం విద్యా వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది.
 • 'ఎస్.డి.డిగ్రీ కాలేజ్, ముజఫర్నగర్ ఈ ప్రాంతంలో పేరొందిన కామర్స్ కళాశాల. ( ఇది C.C.S. విశ్వవిద్యాలయం, మీరట్ అనుబంధంగా ఉంది..) కాలేజ్ -M.Sc, M.Com, B.Com, B.Sc

డిగ్రీ కోర్సులను అందిస్తుంది.

 • ఈ ప్రాంతంలో పేరొందిన సైన్స్ కళాశాల D.A.V. (PG) కాలేజ్, ముజఫర్నగర్ . ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ఉత్తమ కళాశాలలో ఒకటిగా UP ప్రభుత్వం చేత ఎంపిక చేయబడింది. కాలేజ్ : BCA, BBA, B.Sc.- బయోటెక్నాలజీ, M.Sc.- బయోటెక్నాలజీ, M.Sc.- మైక్రోబయాలజీ, M.Sc.- బయోకెమిస్ట్రీ. కోర్సులను అందిస్తుంది.
 • ఈ ప్రాంతంలో పేరొందిన పాలిటెక్నిక్ కళాశాల మహాత్మా గాంధీ పాలిటెక్నిక్ ముజఫర్నగర్ . ఇది టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉత్తర ప్రదేశ్ బోర్డు (BTEUP), లక్నో అనుబంధంగా ఉంది. కాలేజ్ ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ మొదలైనవి తోడ్పడే ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులను అందిస్తుంది.
 • నగరంలో ఒక మెడికల్ కాలేజీ (ముజఫర్నగర్ మెడికల్ కాలేజ్; మీరట్) ఉంది. ముజాఫర్ నగర్ హైవే దాదాపు 10 కి.మీ దూరంలో ఉంది. ఇది చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది. ఇది మెడికల్ కౌన్సిల్ ఆమోదం పొందింది. ఇది నగరం శివార్లలో . ఈ కళాశాల MBBSతో పాటు, వివిధ ఇతర కోర్సులు అందిస్తోంది.
 • 12 వ తరగతి విద్య :- అప్, హోలీ ఏంజిల్స్ 'కాన్వెంట్ స్కూల్, SDPublic స్కూల్, Bhagwanti సరస్వతి విద్యా మందిర్, DAVInter కళాశాల, గ్యాన్ డీప్ పబ్లిక్ స్కూల్, DAV పబ్లిక్ స్కూల్, SD వంటి అనేక మంచి పాఠశాలలు ఉన్నాయి ఇంటర్ కాలేజ్, G.C. పబ్లిక్ స్కూల్, ఎం.జి. పబ్లిక్ స్కూల్, లాలా జగదీష్ ప్రసాద్ సరస్వతి విద్యా మందిర్ ఇంటర్ కళాశాల మొదలైనవి

ఇవికూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

 1. "District-specific Literates and Literacy Rates, 2011". Registrar General, India, Ministry of Home Affairs. Retrieved 2010-10-10. Cite web requires |website= (help)
 2. "Brief District History". Muzaffarnagar district website. మూలం నుండి 2013-09-14 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-09-09. Cite web requires |website= (help)
 3. "Troops deployed to quell deadly communal clashes between Hindus, Muslims in north India". Associated Press. మూలం నుండి 8 September 2013 న ఆర్కైవు చేసారు. Retrieved 8 September 2013. Cite news requires |newspaper= (help)
 4. "Administration". Muzaffarnagar.nic.in. మూలం నుండి 2012-05-11 న ఆర్కైవు చేసారు. Retrieved 2012-08-08. Cite web requires |website= (help)
 5. "Three new districts in Uttar Pradesh". iGovernment.in. మూలం నుండి 2014-03-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2012-08-08. Cite web requires |website= (help)
 6. 6.0 6.1 6.2 6.3 6.4 6.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
 7. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Albania 2,827,800 July 2011 est. Cite web requires |website= (help)
 8. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Oregon 3,831,074 Cite web requires |website= (help)
 9. [1].
 10. MINUTES OF THE 34th MEETING OF EMPOWERED COMMITTEE TO CONSIDER AND APPROVE REVISED PLAN FOR BALANCE FUND FOR THE DISTRICTS OF GHAZIABAD, BAREILLY, BARABANKI, SIDDHARTH NAGAR, SHAHJANPUR, MORADABAD, MUZAFFAR NAGAR, BAHRAICH AND LUCKNOW (UTTAR PRADESH) UNDER MULTI-SECTORAL DEVELOPMENT PROGRAMME IN MINORITY CONCENTRATION DISTRICTS HELD ON 22nd JULY, 2010 AT 11.00 A.M. UNDER THE CHAIRMANSHIP OF SECRETARY, MINISTRY OF MINORITY AFFAIRS. Archived 2011-09-30 at the Wayback Machine F. No. 3/64/2010-PP-I, GOVERNMENT OF INDIA, MINISTRY OF MINORITY AFFAIRS

బయటి లింకులుసవరించు

Coordinates: 29°27′N 77°35′E / 29.450°N 77.583°E / 29.450; 77.583

వెలుపలి లింకులుసవరించు