ముషాయిరా
ముషాయిరా (ఉర్దూ: مشاعره) షాయరోఁ కి మెహఫిల్ కవిసమ్మేళనం, కవులు స్వేచ్ఛగా తమ భావాలను ప్రకటించే వేదిక. ఈ ముషాయిరా తరహి కావచ్చు, గైర్ తరహి గావచ్చు. నాతియా గావచ్చు, లేదా గజల్ ముషాయిరా గావచ్చు, లేదా మజాహియా ముషాయిరా (హాస్య కవిసమ్మేళనం) గావచ్చు. తరహి ముషాయిరా కవుల మధ్య చాలా పోటాపోటీ వుంటుంది సుమా.
ముషాయిరా రకాలు
మార్చు- తరహి ముషాయిరా : నిర్వాహకులచే ఇవ్వబడిన తరహీమిస్రానుసారంగా కవితలను రచించి వినిపించే ముషాయిరా.
- గైర్ తరహి ముషాయిరా: ఏలాంటి తరహి మిస్రా ఇవ్వబడదు, కవి తన కవితలను స్వతంత్రంగా వినిపించే ముషాయిరా.
- నాతియా ముషాయిరా: ఈ ముషాయిరాలో నాత్లు మాత్రమే వినిపిస్తారు.
- గజల్ ముషాయిరా: ఈ ముషాయిరాలో కేవలం గజల్లు మాత్రమే వినిపిస్తారు.
- ఆలమి ముషాయిరా: ప్రపంచ నలుమూలలనుండి కవులను ఆహ్వానించి నిర్వహించే ముషాయిరా.
- కుల్ హింద్ ముషాయిరా: భారతదేశం నలుమూలలనుండి కవులను ఆహ్వానించి నిర్వహించే ముషాయిరా.
- రియాసతీ ముషాయిరా: రాష్ట్రం నలుమూలలనుండి కవులను ఆహ్వానించి నిర్వహించేముషాయిరా.
- మఖామీ ముషాయిరా: ప్రాంతీయ కవులను ఆహ్వానించి నిర్వహించే ముషాయిరా.
ఈ ముషాయిరాలో కవులు తమ కవిత్వాన్ని తరన్నుమ్లో (రాగయుక్తంగా) గాని తహత్ (సాదా) లో గాని వినిపించవచ్చు.
ఈ ముషాయిరాను నిర్వహించేవాడిని నాజిమ్-యె-ముషాయిరా అంటారు.
కొందరు ప్రముఖ నాజిమ్-యె-ముషాయిరా లు: అన్వర్ జలాల్ పురి, అస్లం ఫర్షోరి, షఫీఖ్ ఆబిది బెంగలూరు, అసర్ సిద్దీఖి మాలెగాఁవ్, సత్తార్ సాహిర్ తిరుపతి, నిసార్ అహ్మద్ సయ్యద్ మదనపల్లె.
సమకాలీన ముషాయిరా కవులు
మార్చుఅహ్మద్ ఫరాజ్, నిదా ఫాజిలి, మునవ్వర్ రానా, బషీర్ బదర్, వసీమ్ బరేల్వి, మాజిద్ దేవ్ బంది, గుల్జార్ దెహ్లవి, రాహత్ ఇందోరి, మన్ జర్ భోపాలి, ముంతాజ్ రాషిద్ ముంబాయి, షఫీఖ్ ఆబిది బెంగలూరు, సత్తార్ సాహిర్ తిరుపతి, నిసార్ అహ్మద్ సయ్యద్ మదనపల్లె, సాగర్ జయ్యది, న.మ.జాలిబ్, సాఖి కడప.
కొందరు హాస్య కవులు
మార్చురవూఫ్ రహీం హైదరాబాద్, షాదాబ్ బేధడక్ చెన్నై, పాగల్ ఆదిలాబాది.