మూగవాని పిల్లనగ్రోవి

మూగవాని పిల్లనగ్రోవి ప్రముఖ రచయిత కేశవరెడ్డి రచించిన నవల.

మూగవాని పిల్లనగ్రోవి
కృతికర్త: డా.కేశవరెడ్డి
ముఖచిత్ర కళాకారుడు: కాళ్ళ
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రచురణ: రీతిక పబ్లికేషన్స్(1995), హైదరాబాద్ బుక్ ట్రస్ట్(2008)
విడుదల: 1995
ఆంగ్ల ప్రచురణ: 2013

రచన నేపథ్యం మార్చు

మూగవాని పిల్లనగ్రోవి నవల డాక్టర్ కేశవరెడ్డి 1993లో రచించారు. నవలను 1993లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ధారావాహికగా ప్రచురించారు. 1995లో రీతిక పబ్లికేషన్స్ ద్వారా తొలిప్రచురణ జరిగింది. 2008 నవంబరులో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు పునర్ముద్రించారు. ఆ ప్రతికి కాళ్ళ ముఖచిత్రాన్ని చిత్రించారు.[1]

ఇతివృత్తం మార్చు

మూగవాని పిల్లనగ్రోవి నవల బక్కిరెడ్డి అనే రైతు వీరగాథ. తన పొలాన్ని కాపాడుకుని సేద్యం చేయడం కొనసాగిద్దామనే ప్రయత్నం చేసిన సన్నకారు రైతు బక్కిరెడ్డి ఆ ప్రయత్నంలో విఫలుడవుతాడు. భూమిని, సేద్యాన్ని కోల్పోలేక చివరికి ఉన్మాదిగా మారి మరణిస్తాడు. మరణించిన బక్కిరెడ్డి కథ మొదట జాలిగాథగా ఉన్నా, పంచభూతాలు అతని మమతను, మరణాన్ని వీరత్వంగా గుర్తించి ఆ భూమిని అతను కాక వేరెవరూ దున్నకూడదన్న వరం బక్కిరెడ్డికి ఇస్తాయి. ఆ ప్రాంతం బక్కిరెడ్డి పేరిట చిన్న తోపులా మిగిలిపోతుంది. జానపద సంప్రదాయంలోని కథల పద్ధతిలోనే ఈ నవల కూడా వీరగాథగా రూపాంతరం చెందడంతో ముగుస్తుంది.[1]

ప్రాచుర్యం మార్చు

మూగవాని పిల్లనగ్రోవి నవల ప్రాచుర్యం పొందింది. నవలను మూగవాని పిల్లనగ్రోవి అనే పేరుతోనే స్వయంగా డా.కేశవరెడ్డి స్వయంగా ఆంగ్లంలోకి అనువదించారు. ఆంగ్లంలో బలాడ్ ఆఫ్ ఒంటిల్లు అనే ఉపశీర్షికను ఉంచారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ ఆంగ్లానువాదాన్ని ప్రచురించారు.[2] [3]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 మూగవాని పిల్లనగ్రోవి:డా.కేశవరెడ్డి:హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పబ్లికేషన్స్:2008
  2. "మీట్ మిస్టర్ ఆక్స్‌ఫర్డ్ రెడ్డీ:మోహన్:ఆంధ్రజ్యోతి:డిసెంబరు 9, 2013". Archived from the original on 2014-01-22. Retrieved 2014-03-19.
  3. నువ్వొకటి రాస్తావు! నేనొకటి చదువుతాను!!:సాక్షి:ఫిబ్రవరి 28, 2014