మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధం

మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధం (1817-1818) బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి, మరాఠా సామ్రాజ్యానికి మధ్య జరిగిన యుద్ధాల్లో చివరి, నిర్ణయాత్మక యుద్ధం. ఈ యుద్ధంతో కంపెనీ భారతదేశంలోని ప్రధాన భాగంపై నియంత్రణ సాధించింది. భారతదేశంలో బ్రిటీష్ వారు సమీకరించిన అత్యంత భారీ సంఖ్యాక సైన్యం[1] మరాఠా భూభాగంపై దండయాత్ర సాగించడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. గవర్నర్ జనరల్ హేస్టింగ్స్ (బెంగాల్ తొలి గవర్నర్-జనరల్ వారన్ హేస్టింగ్స్ కాదు, అతనితో ఏ సంబంధం లేదు), జనరల్ థామస్ హిస్లాప్ సైన్యాన్ని నడిపించారు. మధ్య భారతానికి చెందిన ముస్లిం కిరాయి సైనికులు, మరాఠా సైన్యాల దండు అయిన పిండారీలకు వ్యతిరేకంగా దాడితో యుద్ధ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.[note 1]

మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధం
ఆంగ్లో-మరాఠా యుద్ధాలులో భాగము
Indian Camp Scene.jpg
భారతీయ సైనిక శిబిరం దృశ్యం
తేదీనవంబరు 1817 – ఫిబ్రవరి 1818
ప్రదేశంప్రస్తుతం మహారాష్ట్ర, ఇతర సమీప రాష్ట్రాలు
ఫలితంబ్రిటీష్ వారి నిర్ణయాత్మక విజయం
మరాఠా సామ్రాజ్యం అంతం; బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ భారతదేశంపై నియంత్రణ సాధించింది.
ప్రత్యర్థులు
Flag of the Maratha Empire.svg మరాఠా సామ్రాజ్యం United Kingdom బ్రిటీష్ సామ్రాజ్యం
 • Flag of the British East India Company (1801).svg బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ
 • సేనాపతులు, నాయకులు
  * బాపు గోఖలే (రెండవ పీష్వా బాజీరావు సైన్యాధ్యక్షుడు)
 • అప్పా సాహెబ్ భోంస్లే
 • మూడవ మల్హర్ రావు హోల్కర్
 • * హేస్టింగ్స్
 • జాన్ మాల్కం
 • థామస్ హిస్లాప్
 • బలం
  10,000 పైగా100,000కు పైగా

  ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా పీష్వా రెండవ బాజీరావు సైన్యానికి, నాగపూర్ పాలకుడు రెండవ ముధోజీ భోంస్లే, ఇండోర్ పాలకుడు మల్హర్ రావు హోల్కర్ తోడయ్యారు. నాలుగవ ప్రధాన మరాఠా నాయకుడు దౌలత్ రావు సింధియా తటస్థంగా ఉండిపోయేలా ఈస్టిండియా కంపెనీ దౌత్యం, ఒత్తిడి పనిచేశాయి, రాజస్థాన్ పై తన నియంత్రణ కోల్పోయినా సింధియా బ్రిటీష్ సైన్యానికి భయపడి తటస్థంగా ఉండిపోయాడు.

  బ్రిటీష్ వారు చాలా వేగంగా విజయాలు అందుకున్నారు. ఫలితంగా మరాఠా సామ్రాజ్యం ముక్కలై, మరాఠాలు స్వాతంత్రం కోల్పోయారు. ఖడ్కి, కోరెగావ్ యుద్ధాల్లో పీష్వా ఓడిపోయాడు. పీష్వా బందీ కాకుండా అడ్డుకునేందుకు పీష్వా సైన్యాలు అనేక చిన్నా చితకా పోరాటాలు చేశారు.[3]

  అయితే పీష్వాని కంపెనీ బందీని చేసి, కాన్పూరుకు సమీపంలోని బిథూర్ అన్న చిన్న సంస్థానంలో ఉంచారు. అతని భూభాగంలో చాలావరకూ స్వాధీనం చేసుకుని, బొంబాయి ప్రెసిడెన్సీలో కలిపింది. తన భూభాగాన్ని రాచరిక రాష్ట్రంగా చేసి సతారా మహారాజు పరిపాలించేందుకు పున:ప్రతిష్టించారు. డల్హౌసీ తీసుకువచ్చిన రాజ్యసంక్రమణ సిద్ధాంతం ద్వారా 1848లో ఈ భూభాగం బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమైపోయింది. సితాబుల్దీ యుద్ధంలో భోంస్లే, మహిద్ పూర్ యుద్ధంలో హోల్కర్ ఓడిపోయారు. నాగ్ పూర్ చుట్టుపక్కల భోంస్లే పాలనలో ఉన్న ఉత్తర భాగం, బుందేల్ ఖండ్ లో పీష్వా భూభాగాలతో సహా సౌగోర్, నెరబుద్దా భూభాగాలు అన్న పేరిట బ్రిటీష్ ఇండియాలో కలిసిపోయాయి. భోంస్లే, హోల్కర్ ల ఓటమి, మరాఠా రాజ్యాలైన నాగ్ పూర్, ఇండోర్ ల స్వాతంత్రాన్ని హరించడానికి కారణమయింది. వీటితో పాటు సింధియా నుంచి గ్వాలియర్, పీష్వా నుంచి ఝాన్సీ కూడా తమ నియంత్రణలోకి తెచ్చుకుని బ్రిటీష్ సార్వభౌమాధికారం క్రింద రాజరిక రాష్ట్రాలుగా పరిమిత పరిపాలన ఏర్పాటుచేశారు. ఖడ్కి, సితాబుల్ది, మహిద్ పూర్, కోరెగావ్, సతారా ప్రాంతాల్లో అత్యంత వేగంగా సాధించిన విజయాల వల్ల భారతీయ యుద్ధ నిర్వహణలో బ్రిటీష్ వారు సాధించిన దక్షత తెలియజేస్తున్నాయి.[4]

  వివరణలుసవరించు

  1. "అనేక పిండారీలు మొదట్లో ముస్లిం లేక మరాఠా ఆశ్వికదళ సైనికులు, దళం నుంచి తొలగించడం వల్ల కానీ, పిండారీ జీవితమే బావుందని కానీ పిండారీలుగా మారిపోయారు. ముస్లిములమని చెప్పుకునే పలువురు పిండారీలు కనీసం కలిమా తిరిగి చెప్పలేరు, లేదా ప్రవక్త పేరు కూడా వినివుండరు."[2]

  మూలాలుసవరించు

  1. Bakshi & Ralhan 2007, p. 261.
  2. McEldowney 1966, p. 18.
  3. Naravane, M.S. (2014). Battles of the Honorourable East India Company. A.P.H. Publishing Corporation. pp. 79–86. ISBN 9788131300343.
  4. Black 2006, p. 78.