మూన్ లైటింగ్ (ఆంగ్లం: moonlighting) అనేది కార్పొరేట్‌ పరిభాషలో, తాము ఉద్యోగం చేస్తున్న సంస్థ‌ల‌కు తెలియ‌కుండా ఖాళీ స‌మ‌యాల్లో ఇత‌ర సంస్థ‌ల‌కూ ప‌నిచేయ‌డం. ఈ స‌రికొత్త విధానం క‌రోనా ఉద్ధృతి నేప‌థ్యంలో వచ్చిన వ‌ర్క్ ఫ్రం హోం పధ్ధతి అమ‌లు నుండి మన దేశంలో పురుడుపోసుకుంది. అయితే కొన్ని కంపెనీలు మూన్‌ లైటింగ్‌ను ప్రోత్సహిస్తుంటే మరికొన్ని కంపెనీలు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

క్యాబ్ డ్రైవర్ - ఒక సాధారణ సైడ్ జాబ్
ఫుడ్ డెలివరీ - ఒక సాధారణ సైడ్ జాబ్

నేపధ్యం

మార్చు

ఒక వ్యక్తి తన ప్రాథమిక ఉద్యోగం నుండి వచ్చే ఆదాయం సరిపోనప్పుడో లేదా ఎక్కువ ఆదాయాన్ని సంపాదించాలనే కోరికతోనో సైడ్ జాబ్‌లు చేయాల్సివస్తుంది. ఇది సాధారణ పని వేళల తర్వాత నిర్వహించబడుతుంది. సైడ్ జాబ్‌ అనేది పూర్తి-సమయం ఉద్యోగం, పార్ట్-టైమ్ కాంట్రాక్ట్ లేదా ఫ్రీలాన్స్ పని కావచ్చు. అనధికారికంగా ఈ విధానాన్ని మూన్‌లైటింగ్ అని పిలుస్తారు, సాధారణంగా ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ సైడ్ జాబ్‌లను కూడా కలిగి ఉండవచ్చు.[1]

అమెరికా లాంటి అభివృద్ధిచెందిన దేశాలలోసైతం వేతన స్తబ్దత కారణంగా సైడ్ జాబ్‌లు జనాదరణ పొందాయి. ఆదాయం జీవన వ్యయం పెరుగుదలకు అనుగుణంగా లేక దాదాపు సగం మంది అమెరికన్లు సైడ్ జాబ్ కలిగి ఉన్నారని నివేదికలున్నాయి, వీరిలో 43% పూర్తి-కాల కార్మికులు ఉన్నారు.[2] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 60 శాతం మంది విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటున్నారు, కారణం 43 శాతం మంది అద్దె ఖర్చులు చెల్లించవలసి ఉంటుంది. అంతేకాకుండా విద్యార్థి రుణాలను చెల్లించడానికి సైడ్ జాబ్ అనేది ఒక సాధనం.[3][4][5]

అలాగే ఒక వ్యక్తి ప్రాథమిక ఉద్యోగం ఆదాయాన్ని మాత్రమే అందిస్తుంది, సంతోషాన్ని ఇవ్వలేదు. అందుకని వారు ఇష్టపడే సైడ్ జాబ్‌ను కొనసాగించవచ్చు,[6]

పర్యవసానం

మార్చు

ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ మరొక సంస్థలో పనిచేయడంపై ఐటీ పరిశ్రమ వర్గాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ కంపెనీలు మూన్ లైటింగ్ కు అంగీకరిస్తున్నాయి, టెక్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిపి గుర్నానీ వంటి వారు సైతం తమకు అభ్యంతరం లేదని చెప్పారు. అయితే ఇన్ఫోసిస్, విప్రో మాత్రం మూన్ లైటింగ్ పై సీరియస్ గా ఉన్నాయి.

తమ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తమ పోటీదారుల కోసం కూడా పనిచేస్తున్న 300 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు విప్రో సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ 2022 సెప్టెంబరు 21న ప్రకటించారు.[7]

అదనపు ఆదాయం - పన్ను

మార్చు

ఈ ఆదాయంపై కూడా నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు గానీ, ప్రొఫెషనల్ ఉద్యోగులకు కానీ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194జె ప్రకారం రూ. 30 వేలు దాటిన తర్వాత 10 శాతం ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ (టీడీఎస్) వర్తిస్తుంది. అలాగే ఒక ఆర్థిక సంవత్సరంలో చేసిన చెల్లింపు లక్ష రూపాయలు దాటినప్పుడు కూడా టీడీఎస్‌ను మినహాయించాల్సి ఉంటుంది.[8]

మూలాలు

మార్చు
  1. McDowell, Erin (June 28, 2019). "21 high-paying side jobs you can do in your spare time". Business Insider.
  2. Dixon, Amanda. "Survey: Nearly 1 In 3 Side Hustlers Needs The Income To Stay Afloat". Bankrate.
  3. Fenton, Abigail (November 22, 2019). "Two in five young Brits rely on 'side hustle' to make ends meet". Yahoo! Finance.
  4. Dixon, Amanda. "Survey: Nearly 1 In 3 Side Hustlers Needs The Income To Stay Afloat". Bankrate.
  5. Vallejo, Camila (November 14, 2019). "Tales from the 'side hustle generation': Meet the Connecticut millennials working multiple jobs to pay the bills". Hartford Courant.
  6. "Definition of DAY JOB". Merriam-Webster.
  7. "wipro: Wipro: మూన్ లైటింగ్ సిబ్బందిపై విప్రో వేటు - wipro fires 300 staff members found to be moonlighting | Economic Times Hindi". web.archive.org. 2022-09-22. Archived from the original on 2022-09-22. Retrieved 2022-09-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  8. "Moonlighting Can Have Tax Implications Warn Income Tax Authorities - Sakshi". web.archive.org. 2022-12-29. Archived from the original on 2022-12-29. Retrieved 2022-12-29.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)