మూలే సుధీర్ రెడ్డి
మూలే సుధీర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]
ఎం.సుధీర్‌రెడ్డి | |||
![]()
| |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 - ప్రస్తుతం | |||
నియోజకవర్గం | జమ్మలమడుగు నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 12 మార్చి 1981 నిడుజివ్వి యర్రగుంట్ల మండలం కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ భారతదేశం | ||
రాజకీయ పార్టీ | ![]() | ||
తల్లిదండ్రులు | వెంకటసుబ్బారెడ్డి, లక్ష్మీదేవమ్మ | ||
జీవిత భాగస్వామి | క్రాంతి ప్రియ | ||
సంతానం | దిహాంతిక రెడ్డి |
జననం, విద్యాభాస్యంసవరించు
ఎం.సుధీర్‌రెడ్డి 1981 మార్చి 12లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా, యర్రగుంట్ల మండలం, నిడుజివ్వి గ్రామంలో వెంకటసుబ్బారెడ్డి, లక్ష్మీదేవమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన బెంగళూరులో 2005లో ఎంబీబీఎస్, 2007లో డీఏ (అనస్థీషియా) పూర్తి చేశాడు.[2] మూలే సుధీర్ రెడ్డికి మాజీ మంత్రి మైసూరా రెడ్డి పెదనాన్న.[3]
రాజకీయ జీవితంసవరించు
ఎం.సుధీర్‌రెడ్డి 2016లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2016లో జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో తన తల్లి లక్ష్మీదేవమ్మను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉంచి ఎర్రగుంట్ల మండల అధ్యక్షురాలిగా భారీ మెజారిటీతో గెలిపించుకున్నాడు. మూలే సుధీర్ రెడ్డిని 2016లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్తగా వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నియమించాడు. సుధీర్ రెడ్డి ఇంచార్జ్ గా నియమితుడయ్యాక నియోజకవర్గంలోని ప్రతి పల్లెకు తిరుగుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో ఆయనను 2019లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు.
మూలే సుధీర్ రెడ్డి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొన్నపురెడ్డి రామసుబ్బా రెడ్డి పై 51641 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4] ఆయన 2021లో జరిగిన బద్వేలు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బద్వేల్ మండలం రూరల్ ఇన్చార్జిగా నియమితుడయ్యాడు.
మూలాలుసవరించు
- ↑ Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
- ↑ Sakshi (18 March 2019). "కడప బరిలో..వైఎస్సార్ సీపీ దళం". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.
- ↑ The New Indian Express (6 April 2019). "INTERVIEW | Faction politics a thing of past, now people think wisely and oppose it strongly: Dr M.Sudheer Reddy". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
- ↑ Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.