మెంటల్‌ 2016లో విడుదలైన తెలుగు సినిమా. రాజా ఆర్ట్ ప్రొడక్షన్స్, సుబ్రమణ్య ఆర్ట్ క్రియేషన్స్ పై వీవీఏఎన్ ప్రసాద్ దాసరి, వీవీ దుర్గాప్రసాద్ అనగాని నిర్మించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, అక్షా పార్ధసాని హీరో హీరోయిన్ గా నటించగా కరణం పి.బాబ్జీ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం సెప్టెంబరు 9న విడుద‌లైంది.[1][2]

మెంటల్‌
దర్శకత్వంకరణం పి.బాబ్జీ
రచనకరణం పి.బాబ్జీ
స్క్రీన్ ప్లేకరణం పి.బాబ్జీ
కథకరణం పి.బాబ్జీ
నిర్మాతవీవీఏఎన్ ప్రసాద్ దాసరి
వీవీ దుర్గాప్రసాద్ అనగాని
తారాగణంశ్రీకాంత్, అక్షా పార్ధసాని, సుహాసిని, నిఖిత, ముమైత్ ఖాన్
ఛాయాగ్రహణంబుజ్జి
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంసాయి కార్తీక్
నిర్మాణ
సంస్థలు
రాజా ఆర్ట్ ప్రొడక్షన్స్, సుబ్రమణ్య ఆర్ట్ క్రియేషన్స్
విడుదల తేదీ
2016 ఆగస్టు 16 (2016-08-16)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

దుర్గా ప్రసాద్ (శ్రీకాంత్) చిన్నప్పుడే తన తల్లిని చంపిన వారిపై పగ తీర్చుకొని జైలుకి వెళతాడు. జైలు నుంచి తిరిగొచ్చాక నేరస్థులను శిక్షించడం ఒక్క పోలీస్ వల్లే సాధ్యమని దుర్గా పోలీస్ అవుతాడు. ఎలాంటి అన్యాయం జరిగినా అస్సలు ఊరుకొని పోలీస్‌గా అవతారమెత్తిన దుర్గాకు తానుండే ఏరియాలో ఓ పెద్ద రౌడీ అయిన అజయ్ ఘోష్‌తో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆ ఇబ్బందులు ఏంటీ? అజయ్ ఘోష్ ఆగడాలను దుర్గా ఎలా ఎదుర్కున్నాడూ? అన్నదే ఈ సినిమా కథ.

నటీనటులు మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • సంగీతం: సాయి కార్తీక్
  • ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
  • ఫైట్స్: రవి
  • కెమెరా: బుజ్జి
  • నిర్మాతలు: వి.వి.ఎస్.ఎన్.వి ప్రసాద్ దాసరి, వి.వి. దుర్గాప్రసాద్ అనగాని
  • ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పి. సత్యనారాయణ
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: కరణం పి.బాబ్జీ

వివాదం మార్చు

ఈ సినిమాకు ముందు 'మెంటల్ పోలీసు' అని టైటిల్ పెట్టారు. పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా ‘మెంటల్ పోలీస్’ టైటిల్ పెట్టినందుకు నిర్మాత, దర్శకులతోపాటు హీరో శ్రీకాంత్‌కు పోలీసు అధికారుల సంఘం లీగల్ నోటీసులు పంపారు. ఈ సినిమా టైటిల్ పై పోలీసు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో కేసు వేశారు. ఈ కేసులో వాదనలు విన్న అనంతరం మెంటల్ పోలీస్ విడుదలపై స్టే విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.[3]

మూలాలు మార్చు

  1. IMBD (9 September 2016). "Mental". Retrieved 14 May 2021.
  2. Sakshi (18 March 2015). "ఈ పోలీస్ చాలా మెంటల్!". Sakshi. Archived from the original on 14 మే 2021. Retrieved 14 May 2021.
  3. Sakshi (8 April 2016). "'మెంటల్ పోలీస్' నిర్మాతకు లీగల్ నోటీసులు". Sakshi. Archived from the original on 14 మే 2021. Retrieved 14 May 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=మెంటల్&oldid=4076390" నుండి వెలికితీశారు