మెహబూబా ముఫ్తీ సయ్యద్ (జననం 22 మే 1959), జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి. 4 ఏప్రిల్ 2016 నుంచి ఆమె ప్రభుత్వం అధికారంలో ఉంది.[1] ఆమెను భాజీ, మెహబూబా ఆంటీ అని పిలుస్తారు. జమ్మూ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి మహిళ ఆమె కావడం విశేషం.[2] జనవరి 2016లో మెహబూబా తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సయ్యద్ మరణంతో ఆమె అధికారంలోకి వచ్చారు. అస్సాం మాజీ ముఖ్యమంత్రి సయేదా అన్వారా తైముర్ తరువాత   మెహబూబా రెండో భారతీయ మహిళా ముఖ్యమంత్రి. జమ్మూ అండ్  కాశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పిడిపి)కి ఆమె అధ్యక్షురాలు. అనంతనాగ్ నియోజకవర్గం నుంచి 2004లో ఎంపిగా ఎన్నికయ్యారు  మెహబూబా. 2009 ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు. తిరిగి 2016 ఎన్నికల్లో అనంతనాగ్ నియోజకవర్గం నుంచి మళ్ళీ ఎంపిగా  ఎన్నికయ్యారు.

మెహబూబా ముఫ్తీ
మెహబూబా ముఫ్తీ

మెహబూబా ముఫ్తీ 2016


పదవీ కాలం
4 ఏప్రిల్ 2016 – 19 జూన్ 2018
ముందు ముఫ్తీ మహమ్మద్ సయ్యద్
తరువాత రాష్ట్రపతి పాలన

లోక్ సభ సభ్యురాలు
నియోజకవర్గం అనంత్ నాగ్ నియోజకవర్గం (జమ్మూ కాశ్మీర్)

వ్యక్తిగత వివరాలు

జననం (1959-05-22) 1959 మే 22 (వయసు 65)
బంధువులు ముఫ్తీ మొహమ్మద్ సయీద్, తండ్రి
సంతానం ఇద్దరు కూతుళ్లు - ఇల్తిజా జావేద్, ఇర్టికా జావేద్
పూర్వ విద్యార్థి కాశ్మిర్ యూనివర్సిటీ

తొలినాళ్ళ జీవితం

మార్చు

మెహబూబా 22 మే 1959లో అఖ్రాన్ నౌపోరా , అనంతనాగ్ జిల్లా, జమ్మూ & కాశ్మీర్ లో ముఫ్తీ మొహమ్మద్ సయీద్, గుల్షన్ నజీర్ దంపతులకు జన్మించింది . కాశ్మీర్ విశ్వవిద్యాలయం నుంచి 'లా'లో డిగ్రీ చేశారు ఆమె.[3]

1996లో బిజ్బెహరా నుంచీ పోటీ చేయబోయే అభ్యర్ధుల పేర్లలో మెహబూబా పేరు ముందు ఉండేది. ఆమెకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ లభించింది. ఆమె గెలిచి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూడా క్రీయాశీలకంగా పనిచేశారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ కు వ్యతిరేకమైన పార్టీతో పొత్తు పెట్టుకున్నారనే కోపంతో కాంగ్రెస్ నుండి 1987లో బయటకు వచ్చేశారు ఆమె తండ్రి. 1996లో కాంగ్రెస్ లోకి తిరిగి చేరారు ఆయన. 

1989లో మెహబూబా తండ్రి హోం మంత్రిగా ఎంపికైన సమయంలో, ఆమె సోదరి రుబియా సయ్యద్ ను కిడ్నాప్ చేశారు కొందరు. తిరిగి కొన్ని రోజుల తరువాత విడిచి పెట్టారు.

రాజకీయ జీవితం

మార్చు

కాశ్మీర్ నుండి అతితక్కువ మహిళా రాజకీయ నాయకుల్లో మెహబూబా ఒకరు. ఈమె భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు సాధించుకున్నారు. 1999లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పిడిపి)ని స్థాపించినపుడు ఆమే ఆ పార్టీకి అధ్యక్షురాలు అవుతారని అందరూ భావించారు. కానీ ఆ పదవి తన తండ్రికి ఇచ్చి, ఆమె వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరించారు.

1999లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మెహబూబా అసెంబ్లీ సీటుకు రాజీనామా ఇచ్చారు. శ్రీనగర్ నుంచి పోటీ చేసిన ఆమె ఒమర్ అబ్దుల్లాపై ఓటమి పాలయ్యారు. కానీ 2002లో పహల్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో రఫీ అహ్మద్ మిర్ పై విజయం సాధించారు. 2004లోనూ, 2014లోనూ అనంతనాగ్ నుంచి లోక్ సభకు ఎంపిగా ఎన్నికయ్యారు మెహబూబా.

జనవరి 2016లో ఆమె తండ్రి మరణనించే సమయానికి ఆయన జమ్ము కాశ్మీర్ లో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఆయన చనిపోయిన తరువాత మెహబూబా కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తు  కొనసాగించారు. అలా బిజెపి, పిడిపి కలసి జమ్మూ కాశ్మీర్ లో  రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.[4][5][6] 4 ఏప్రిల్ 2016న మెహబూబా జమ్మూ కాశ్మీర్ కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జమ్మూకు ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.

25 జూన్ 2016న జరిగిన ఉప ఎన్నికల్లో అనంతనాగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మెహబూబా.[7]

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు